గ్రహణ సమయంలో దేవాలయాలను మూసి వేస్తారెందుకని?
అంతరార్థం
ఆదిత్యమండల మధ్యాంతర్వర్తీ నారాయణః- ఏ దైవమైనా సూర్యమండల మధ్యంలోనే ఉంటాడని దీని భావం. సూర్యుణ్ణి గ్రహణం (పట్టుకోవడం) చేయగానే ఆ మండలంలో ఉన్న అందరు దేవతలకీ కూడ గ్రహణ దోషం వస్తుంది కదా! ప్రవహిస్తున్న విద్యుత్తీగను పట్టుకుంటే పట్టుకున్నవారికే కాక వారిని తాకిన వారికి కూడా ప్రమాదమే! అందుకే గ్రహణ సమయంలో దేవతామూర్తులకు దోషం అంటకుండా దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణమయ్యాక శుద్ధి చేసేది ఇందుకే. విగ్రహం కిందనున్న శక్తిమంతమైన యంత్రబీజాక్షర శక్తిని ధ్వంసం చేసే శక్తి గ్రహణకాల కిరణాలకీ, అగ్నికీ ఉంది. అందుకే హనుమ రావణుని బీజ యంత్రశక్తిని ధ్వంసం చేయడానికే లంకాదహనాన్ని చేశాడు.