GES 2017
-
వచ్చే రెండేళ్లూ ప్రారంభోత్సవాలే..
సాక్షి, హైదరాబాద్ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కోసం హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ కోసమో, మరెవరి కోసమో తాము అభివృద్ధి పనులు చేయడం లేదని, నగర ప్రజల కోసమే ఈ పనులు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విశ్వనగరం కోసం రూపొందించిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో పలు పనులు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇది పనుల అమలు సంవత్సరమని, జవాబుదారీతనంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మిషన్ హైదరాబాద్ పేరుతో రానున్న ఏడేళ్ల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో రూ.44.30 కోట్లతో నిర్మించిన అండర్ పాస్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి తదితరులతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొత్తం రూ.23 వేల కోట్లతో 4 దశల్లో ఎస్సార్డీపీ పనులకు ప్రణాళిక రూపొందించగా ప్రస్తుతం 19 ప్రాంతాల్లో రూ.3,200 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మరో రూ.3 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. 111 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనులు.. నగరంలో 111 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, ఇందులో మూడు స్కైవేలు నిర్మించాలని తలపెట్టామన్నారు. వీటిల్లో రూ.వెయ్యి కోట్లతో ఉప్పల్–నారపల్లి స్కైవే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. మరో రెండింటికి అవసరమైన భూముల కోసం రక్షణ శాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. అనుమతి రాగానే జూబ్లీ బస్టాండ్ నుంచి తిరుమలగిరి రాజీవ్ రహదారి వరకు ఒక స్కైవే, ప్యాట్నీ నుంచి బోయిన్పల్లి వరకు మరో స్కైవే నిర్మాణం చేపడతామన్నారు. జాతీయ రహదారుల సంస్థతో కలసి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను పొడిగించాలని ప్రతిపాదించామని చెప్పారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. రేతిబౌలి నుంచి నానల్‌నగర్ వరకు రూ.175 కోట్లతో, అంబర్పేట్ వద్ద రూ.270 కోట్లతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు 2019 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు. శిల్పారామం సౌందర్యం దెబ్బతినకుండా అక్కడ మరో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తామని, రూ.2,225 కోట్ల విలువైన దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. మెరుగైన నగరం.. ఓడీఎఫ్ సిటీ.. కేంద్ర ప్రభుత్వం, మెర్సర్ సంస్థల సర్వేల్లో దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ మూడేళ్లు వరుసగా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. స్వచ్ఛభారత్ మిషన్.. హైదరాబాద్‌ను బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) సిటీగా ప్రకటించినందుకు జీహెచ్ఎంసీలోని పారిశుధ్య కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు. నగర రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు, మెరుగులు దిద్దే చర్యలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండు దశల్లో రూ.950 కోట్లతో రోడ్లను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, అధునాతన సాంకేతికతను వినియోగించుకుని వర్షానికి దెబ్బతినని విధంగా రోడ్లు నిర్మిస్తామన్నారు. దేశంలో ఏ మెట్రో నగరంలో లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ బాండ్లు జారీ చేయనున్నామని చెప్పారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన అండర్‌పాస్‌ను 9 నెలల్లోనే పూర్తిచేయడంతో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్‌తోపాటు ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, అధికారులను కేటీఆర్, నాయిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండర్‌పాస్‌తో సమయం ఆదా.. అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌తో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వైపు నుంచి బంజారాహిల్స్ సహ కోర్ సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ వల్ల ప్రస్తుతం 15 నిమిషాల నుంచి అరగంట పడుతుండగా.. అండర్‌పాస్‌తో రెండు నిమిషాల్లో వెళ్లవచ్చు. పది మీటర్ల వెడల్పు ఉన్న రెండు లేన్ల ఈ అండర్ పాస్ క్యారేజ్ వే 7 మీటర్లు. ఇది పనుల అమలు సంవత్సరం.. నగరంలో ఏ పని ఎప్పుడు పూర్తవుతుందో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆ పని, పూర్తయ్యే సమయం ఇలా.. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు ఇవీ.. 54 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు 111 కి.మీ. మేర స్కైవేలు 166 కి.మీ. మేజర్ కారిడార్ అభివృద్ధి పనులు 348 కి.మీ. మేజర్ రోడ్ అభివృద్ధి పనులు -
కేటీఆర్‌కు అమెరికా రాయబారి ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ను విజయవంతం గా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా రాయబారి కెన్నెత్.ఐ.జస్టర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర సర్కా రు అద్భుతమైన ఏర్పాట్లు చేయడం వల్లే ఈ సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయ న్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. సదస్సు సందర్భం గా తనను కలిసే అవకాశం కల్పించినందు కు జస్టర్.. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను రూపొందించిందని ప్రశంసలు కురిపించారు. -
ఆర్టీసీలో ‘ఖాకీ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తలపై టోపీ.. నేవీ బ్లూ రంగు యూనిఫాం.. క్రమశిక్షణ ఉట్టిపడే రూపం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ప్రధాన ఆకర్షణగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సిబ్బంది వీరు. వీరిని చూస్తే ఆర్టీసీ సిబ్బంది దర్పం ఇలాగే ఉంటుందనుకుంటారు కదా! కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. నాలుగేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు యూనిఫామ్ అందటం లేదు. నిధులకు కటకట ఉండటంతో ఆర్టీసీ యాజమాన్యం 2014 నుంచి యూనిఫాం ఇవ్వటం లేదు. గతంలో ఇచ్చిన యూనిఫాంతోనే ఇప్పటివరకు కాలం నెట్టుకొచ్చిన కార్మికులు, ఇప్పుడు అవి చిరిగిపోవటంతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం కొత్త యూనిఫాం ఇవ్వటం లేదు. యూనిఫాం లేకుండా విధులకు హాజరైతే స్థానిక అధికారులు ఊరుకోవటం లేదు. దీంతో కార్మికులు సొంతంగా యూనిఫాం కొని విధులకు రావాల్సిన దుస్థితి నెలకొంది. వేతన సవరణ, వసతుల కల్పన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ఇంతకాలం నిరసనలు, ధర్నాలు చేపట్టిన కార్మికులు ఇప్పుడు యూనిఫాం కోసం ఆందోళనకు దిగాల్సి పరిస్థితి ఏర్పడింది. సాధారణ దుస్తులతో విధులకు వెళ్తే అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ సమయంలో ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. మరోవైపు యూనిఫాం పంపిణీలో అలసత్వం వహించడం విడ్డూరంగా కనిపిస్తోంది. సొంతంగా కొనక తప్పనిస్థితి డ్రైవర్, కండక్టర్, సెక్యూరిటీ, మెకానిక్ తదితరులు ఖాకీరంగు యూనిఫాం ధరిస్తారు. ఏసీ బస్సుల్లో అయితే నేవీ బ్లూ ఉంటుంది. ప్రస్తుతం ఏసీ బస్సుల సిబ్బందికి మాత్రమే యూనిఫాం ఇస్తున్నారు. గతం లో ప్రతి రెండేళ్లకు మూడు జతల యూనిఫాం దుస్తు లు ఇచ్చేవారు. ప్యాంటు కోసం 1.20 మీటర్లు, చొక్కా కోసం 1.80 మీటర్ల చొప్పున వస్త్రాన్ని అందించేవారు. 2014 ఆరంభంలో ఇచ్చిన మూడు జతల దుస్తులతోనే ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. కొన్ని డిపోల్లో కార్మికులు సాధారణ దుస్తుల్లో వెళ్లటంతో అది క్రమశిక్షణ రాహిత్యమంటూ డిపో మేనేజర్లు హెచ్చరించారు. మెమోలు జారీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో కార్మికులే యూనిఫాం కొంటున్నారు. ఈసారి యూనిఫాం ఇవ్వకుంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు సమాచారం. పోలీసులు, తపాలా శాఖ ఉద్యోగులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు.. ఇలా కొన్ని విభాగాల్లో యూనిఫామే గుర్తింపు. అలాంటి కీలక అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరించటం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు ఇవాంకా కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా హైదరాబాద్ వచ్చిన తనకు ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు. తన హైదరాబాద్ పర్యటన ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన అనుభవమని పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం అందజేసిన కానుక విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రాష్ట్ర ప్రజలు చూపిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ భారత్‌కు తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
మిత్ర రోబో తయారీలో మనోడి కృషి