Girl freed
-
గర్ల్‌ఫ్రెండ్‌తో పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికా: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నా చై నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. బాలరాజుగా చైతూ అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుతున్నాయి. ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోనూ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు చై. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చై తన లవ్లైఫ్పై ఓపెన్ అయ్యాడు. సమంతతో పెళ్లికి ముందు చైతూకి కాలేజీ రోజుల్లో ఓ లవ్‌స్టోరీ ఉందట. ఈ విషయం గురించి స్వయంగా చెప్పిన చై తన గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డానని చెప్పి షాక్ ఇచ్చాడు. 'కారు వెనుక సీట్లో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ముద్దాడుతుండగా పోలీసులకు దొరికిపోయాను. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.నేను చేస్తుందో ఏంటో నాకు తెలుసు. అంతా బాగానే ఉంది కానీ పోలీసులకు దొరికిపోయాను' అంటూ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు. అయితే తన గర్ల్‌ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం చై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా సమంతతో విడాకులు తర్వాత, ఒక వ్యక్తిగా చాలా మారిపోయానని గతంలో చైతూ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఓపెన్ అయ్యేవాడు కాదని, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనూ చాలా క్లోజ్‌గా విషయాలు షేర్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. -
కిల్లర్ గర్ల్ ఫ్రెండ్‌ను విచారించనున్న పోలీసులు
లాస్‌వెగాస్: మ్యూజిక్ కాన్సర్ట్‌పై కాల్పులతో విరుచుకుపడ్డ స్టీఫెన్ పెడాక్ గర్ల్ ఫ్రెండ్ డాన్లీ అమెరికా చేరుకోవడంతో విచారణలో కీలక ఆధారాలు లభ్యం కానున్నాయి. లాస్‌వెగాస్ నరమేథం సమయంలో ఫిలిప్పీన్స్‌లో ఉన్న డాన్లీ(62) తిరిగి రావడంతో ఎలాంటి నేరచరిత్ర లేని పెడాక్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ దిశగా లాస్ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆమెను కలిశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. డాన్లీ నుంచి త్వరలోనే తాము కీలక సమాచారం రాబడతామని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో తెలిపారు. విలాసవంతం జీవితం గడుపుతూ గ్యాంబ్లర్‌గా పేరొందిన 64 ఏళ్ల పెడాక్ ఎందుకు ఇంతటి ఉన్మాద చర్యకు పాల్పడ్డాడనే దానిపై అధికారులు నిగ్గుతేల్చుతారని జోసెఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెడాక్ ప్రియురాలు డాన్లీ ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించి అక్కడి అధికారులు అమెరికా అధికార యంత్రాంగానికి అన్ని వివరాలు అందించారు. అమెరికన్ అధికారుల విచారణకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వారు చెప్పారు. కాల్పులకు ముందు పెడాక్ లక్ష డాలర్లను ఫిలిప్పీన్స్‌కు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపైనా వారు ఆరా తీస్తున్నారు. పెడాక్ రోజుకు పదివేల డాలర్లు జూదం ఆడతారని పేర్కొంటున్నారు. -
వ్యభిచార గృహం నుంచి బాలికకు విముక్తి
హసన్‌పర్తి : వ్యభిచార గృహం నుంచి ఓ బాలికకు గురువారం విముక్తి కలిగింది. సిద్ధాపురంలో అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారవృత్తి చేయిస్తున్నారనే నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఎస్సై పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం... సిద్ధాపురానికి చెందిన ముస్కు పోచాలు, ముస్కు సీత, ముస్కు రఘు వేశ్యాగృహం నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల నుంచి ఓ బాలికను రూ.20వేలకు కొనుగోలు చేసి 20 రోజుల క్రితం తీసుకువచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు దాడి నిర్వహించారు. ఈ బాలికతోపాటు మరో ఐదుగురు అమ్మాయిలను సైతం పోలీసులు గుర్తించారు. వారు మేజర్ కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. కాగా సిరిసిల్లకు చెందిన వేశ్యాగృహ నిర్వాహకురాలు స్వాతి మూడు నెలల క్రితం ఆ బాలికను ఖమ్మం నుంచి తీసుకువచ్చినట్లు తెలిసింది. వేశ్యాగృహం నుంచి విముక్తి పొందిన బాలికను పోలీసులు నగరంలోని బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. దీంతో ఆ బాలికను మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలికతో వ్యభిచారం చేయించిన పోచాలు, సీత, రఘుతోపాటు సిరిసిల్లకు చెందిన స్వాతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.