Naga Chaitanya Says He Got Caught While Making Out In The Back Seat Of Car - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: 'కారులో గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌.. నాకేమీ తప్పు అనిపించలేదు'

Published Mon, Aug 15 2022 11:31 AM | Last Updated on Mon, Aug 15 2022 4:44 PM

Naga Chaitanya Says He Got Caught While Making Out In The Back Seat Of Car - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నా చై నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. బాలరాజుగా చైతూ అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుతున్నాయి. ఇక లాల్‌ సింగ్‌ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోనూ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు చై. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చై తన లవ్‌లైఫ్‌పై ఓపెన్‌ అయ్యాడు.

సమంతతో​ పెళ్లికి ముందు చైతూకి కాలేజీ రోజుల్లో ఓ లవ్‌స్టోరీ ఉందట. ఈ విషయం గురించి స్వయంగా చెప్పిన చై తన గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌ చేస్తూ పట్టుబడ్డానని చెప్పి షాక్‌ ఇచ్చాడు. 'కారు వెనుక సీట్లో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ముద్దాడుతుండగా పోలీసులకు దొరికిపోయాను. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.నేను చేస్తుందో ఏంటో నాకు తెలుసు. అంతా బాగానే ఉంది కానీ పోలీసులకు దొరికిపోయాను' అంటూ షాకింగ్‌ సీక్రెట్‌ రివీల్‌ చేశాడు.

అయితే తన గర్ల్‌ఫ్రెండ్‌ పేరు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం చై చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా సమంతతో విడాకులు తర్వాత, ఒక వ్యక్తిగా చాలా మారిపోయానని గతంలో చైతూ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇంతకు ముందు ఓపెన్‌ అయ్యేవాడు కాదని, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీతోనూ చాలా క్లోజ్‌గా విషయాలు షేర్‌ చేసుకుంటున్నట్లు తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement