లాస్‌వెగాస్: మ్యూజిక్ కాన్సర్ట్‌పై కాల్పులతో విరుచుకుపడ్డ స్టీఫెన్ పెడాక్ గర్ల్ ఫ్రెండ్ డాన్లీ అమెరికా చేరుకోవడంతో విచారణలో కీలక ఆధారాలు లభ్యం కానున్నాయి. లాస్‌వెగాస్ నరమేథం సమయంలో ఫిలిప్పీన్స్‌లో ఉన్న డాన్లీ(62) తిరిగి రావడంతో ఎలాంటి నేరచరిత్ర లేని పెడాక్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ దిశగా లాస్‌ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆమెను కలిశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
డాన్లీ నుంచి త్వరలోనే తాము కీలక సమాచారం రాబడతామని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో తెలిపారు. విలాసవంతం జీవితం గడుపుతూ గ్యాంబ్లర్‌గా పేరొందిన 64 ఏళ్ల పెడాక్ ఎందుకు ఇంతటి ఉన్మాద చర్యకు పాల్పడ్డాడనే దానిపై అధికారులు నిగ్గుతేల్చుతారని జోసెఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెడాక్ ప్రియురాలు డాన్లీ ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించి అక్కడి అధికారులు అమెరికా అధికార యంత్రాంగానికి అన్ని వివరాలు అందించారు.
అమెరికన్ అధికారుల విచారణకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వారు చెప్పారు. కాల్పులకు ముందు పెడాక్ లక్ష డాలర్లను ఫిలిప్పీన్స్‌కు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపైనా వారు ఆరా తీస్తున్నారు. పెడాక్ రోజుకు పదివేల డాలర్లు జూదం ఆడతారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment