లాస్‌వెగాస్: అమెరికాలో కాల్పుల కలకలానికి తలో రకంగా భాష్యం చెబుతుంటే తాజాగా ఓ ట్వీట్‌పై విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల అమెరికాలో సామూహిక హత్యాకాండలు పెరిగిపోవడం పట్ల క్రిస్టీ అల్లీ అనే 66 ఏళ్ల చీర్స్ యాక్ట్రెస్ లోతైన విశ్లేషణ చేశారు. ఈ ఉన్మాద చర్యలకు సైకియాట్రిక్ డ్రగ్స్ ప్రేరేపిస్తున్నాయని పేర్కొన్నారు.1980కు ముందు ఎలాంటి షూటర్లు, కిల్లర్లు ఎందుకు లేరని ఆమె ప్రశ్నలు సంథించారు.
ఈ మిస్టరీని ఛేదిస్తే కాల్పుల ఉదంతాలకు మూలాలను పసిగట్టవచ్చన్నారు. అమెరికాలో పెచ్చుమీరుతున్న ఉన్మాద చర్యలకు గన్‌ల కంటే ఇతర అంశమేదో ఉందని తనకు తెలుస్తోందని క్రిస్టీ ట్వీట్ చేశారు. లాస్‌వెగాస్‌లో కాల్పుల ఘటన నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్‌పై హాట్ హాట్ డిబేట్ సాగుతోంది. అయితే ఆమె ట్వీట్‌ను సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment