LasVegas
-
స్కెచ్ వేసి..గురి చూసి...
లాస్‌వెగాస్: మ్యూజిక్ కన్సార్ట్‌లో మారణహోమం సృష్టించి 58 మందిని బలిగొన్న లాస్‌వెగాస్ షూటర్ స్టీఫెన్ పెడాక్ పక్కా ప్రణాళికతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆధునిక అమెరికా చరిత్రలో ఏ వ్యక్తీ చేయని విధంగా దశాబ్ధాల తరబడి పెడాక్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సేకరించి నిల్వ చేశాడని, వ్యూహాత్మకంగానే మెరుపు దాడికి దిగాడని అధికారులు భావిస్తున్నారు.అయితే ఇంతటి నరమేథానికి 64 ఏళ్ల పెడాక్‌ను పురిగొల్పిందేమిటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది. గుంభనంగా ఉంటూ రహస్య జీవితం గడిపేందుకు మొగ్గు చూపే పెడాక్ ఏళ్ల తరబడి ఆయుధాలను నిల్వ చేస్తూ మృత్యు ఘంటికలు ఎందుకు మోగించాడనేదే ప్రశ్నగా ముందుకొస్తున్నదని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కేవలం పెడాక్ ఒక్కడే సేకరించి, నిల్వ చేశాడనడం ఊహకందని విషయమన్నారు. ఈ ప్రక్రియలో పెడాక్‌కు ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాల్పుల ఘటన అనంతరం సజీవంగా బయటపడేందుకు పెడాక్ ప్రయత్నించాడనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మ్యూజిక్ కన్సార్ట్ జరిగిన వేదికకు దగ్గరలోని ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఇక మారణకాండ చోటుచేసుకున్న హోటల్ సూట్ నుంచి, మరో మూడు ప్రాంతాల నుంచీ పోలీసులు దాదాపు 50 వరకూ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 15 రైఫిళ్లలో బుల్లెట్లు నింపిఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ఆటోమేటిక్ వెపన్స్ అని, పెడాక్ 2016 అక్టోబర్‌లోనే 30కి పైగా గన్లను కొనుగోలు చేశాడని విచారణలో తేలిందన్నారు.మరోవైపు కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర దాగుందని ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ అరోన్ రోజ్ చెప్పారు. ఇక పెడాక్ గర్ల్‌ఫ్రెండ్ డాన్లీని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించగా పెడాక్ ఆలోచనల గురించి తనకు తెలియదని తేల్చిచెప్పినట్టు సమాచారం. -
మారణహోమానికి కారణమిదేనా..?
లాస్‌వెగాస్: అమెరికాలో కాల్పుల కలకలానికి తలో రకంగా భాష్యం చెబుతుంటే తాజాగా ఓ ట్వీట్‌పై విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల అమెరికాలో సామూహిక హత్యాకాండలు పెరిగిపోవడం పట్ల క్రిస్టీ అల్లీ అనే 66 ఏళ్ల చీర్స్ యాక్ట్రెస్ లోతైన విశ్లేషణ చేశారు. ఈ ఉన్మాద చర్యలకు సైకియాట్రిక్ డ్రగ్స్ ప్రేరేపిస్తున్నాయని పేర్కొన్నారు.1980కు ముందు ఎలాంటి షూటర్లు, కిల్లర్లు ఎందుకు లేరని ఆమె ప్రశ్నలు సంథించారు. ఈ మిస్టరీని ఛేదిస్తే కాల్పుల ఉదంతాలకు మూలాలను పసిగట్టవచ్చన్నారు. అమెరికాలో పెచ్చుమీరుతున్న ఉన్మాద చర్యలకు గన్ల కంటే ఇతర అంశమేదో ఉందని తనకు తెలుస్తోందని క్రిస్టీ ట్వీట్ చేశారు. లాస్‌వెగాస్‌లో కాల్పుల ఘటన నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్‌పై హాట్ హాట్ డిబేట్ సాగుతోంది. అయితే ఆమె ట్వీట్‌ను సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి. -
కిల్లర్ గర్ల్ ఫ్రెండ్‌ను విచారించనున్న పోలీసులు
లాస్‌వెగాస్: మ్యూజిక్ కాన్సర్ట్‌పై కాల్పులతో విరుచుకుపడ్డ స్టీఫెన్ పెడాక్ గర్ల్ ఫ్రెండ్ డాన్లీ అమెరికా చేరుకోవడంతో విచారణలో కీలక ఆధారాలు లభ్యం కానున్నాయి. లాస్‌వెగాస్ నరమేథం సమయంలో ఫిలిప్పీన్స్‌లో ఉన్న డాన్లీ(62) తిరిగి రావడంతో ఎలాంటి నేరచరిత్ర లేని పెడాక్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ దిశగా లాస్ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆమెను కలిశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. డాన్లీ నుంచి త్వరలోనే తాము కీలక సమాచారం రాబడతామని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో తెలిపారు. విలాసవంతం జీవితం గడుపుతూ గ్యాంబ్లర్‌గా పేరొందిన 64 ఏళ్ల పెడాక్ ఎందుకు ఇంతటి ఉన్మాద చర్యకు పాల్పడ్డాడనే దానిపై అధికారులు నిగ్గుతేల్చుతారని జోసెఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెడాక్ ప్రియురాలు డాన్లీ ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించి అక్కడి అధికారులు అమెరికా అధికార యంత్రాంగానికి అన్ని వివరాలు అందించారు. అమెరికన్ అధికారుల విచారణకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వారు చెప్పారు. కాల్పులకు ముందు పెడాక్ లక్ష డాలర్లను ఫిలిప్పీన్స్‌కు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపైనా వారు ఆరా తీస్తున్నారు. పెడాక్ రోజుకు పదివేల డాలర్లు జూదం ఆడతారని పేర్కొంటున్నారు. -
లాస్ వేగాస్‌లో కాల్పులు