Girlfriends murder
-
ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య
కురబలకోట : ప్రియురాలిని హత్య చేసి ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో గురువారం సంచలనం కలిగించింది. ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు... తెట్టుకు చెందిన గాయత్రి (30)కి నిమ్మనపల్లె మండలం వెంకటాపురానికి చెందిన రెడ్డెప్పతో 15 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెడ్డెప్ప ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గాయత్రి పిల్లలను తీసుకుని తెట్టులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పిల్లలను అక్కడే ఉంచి మదనపల్లె టమాటా మార్కెట్లో కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు మార్కెట్లో కూలి పనులు చేస్తున్న తెట్టుకు చెందిన యానాది శ్రీనివాసులు (40)తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అతనికి పెళ్లి కాలేదు. ఏడాదిన్నరగా వీరు నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్లుగా గాయత్రి వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని శ్రీనవాసులు అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమె మండలంలోని అంగళ్లు సమీపంలోని కోల్డ్ స్టోరేజి వెనుక మైదానంలో చెట్టు కింద దారుణ హత్యకు గురైంది. అదే రోజు శ్రీనివాసులు కూడా తెట్టులోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయత్రిని హత్య చేసిన తర్వాత శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రికి, శ్రీనివాసులుకు నయం కాని జబ్బు ఉందని, వివాహేతర సంబంధాలతో ఇది ఇతరులకు కూడా వ్యాపిస్తుందన్న కారణంగా ఆమెను హత్య చేసినట్లు యానాది శ్రీనివాసులు పేరుతో ఉన్న సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. లెటర్ రాసిందెవరు? గాయత్రి హత్యకు గురైన స్థలంలో బయట పడ్డ లెటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయత్రికి గాని, ఆమె ప్రియుడు యానాది శ్రీనివాసులుకు గాని చదువు రాదు. ఈ క్రమంలో లెటర్ రాయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు తనకు తెలిసిన వారి వద్ద ముందుగా రాయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రియురాలి హత్య.. ప్రియుడి అరెస్టు
కేకేనగర్: తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి తెచ్చిన ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి సమీపంలోని కోటకుప్పం ప్రాంతానికి చెందిన షహీరా(19) ట్యూటోరియల్లో ప్లస్‌టూ పూర్తి చేసింది. గత నెల 18న ఈమె అదృశ్యమైంది. షహీరా సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. విచారణలో పుదుచ్చేరి తనత్తుమేటైకు చెందిన విజి అలియాస్ విజయన్(19) అనే యువకుడితో షహీరా తరచు ఫోన్లో మట్లాడేదని తెలిసింది. సంఘటన రోజు షహీరా తన ప్రియుడు విజితో వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పుదుచ్చేరి అరుంపార్తపురం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో విజి, షహీరాను సెంజికోటకు తీసుకెళ్లి అక్కడ హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో గత 23న సెంజికోటలో కుళ్లినస్థితిలో లభించిన యువతి మృతదేహం షహీరాదని తెలిసింది. పోలీసులకు విజయన్ ఇచ్చిన వాంగ్మూళంలో తాను షహీరా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నామని గత 23న సెంజికోటలో తాము ఏకాంతంగా ఉన్నామని తెలిపారు. ఆ సమయంలో తనను వివాహం చేసుకొమ్మని షహీరా ఒత్తిడి చేయడంతో తాను నిరాకరించానని తెలిపారు. ఈ విషయమై ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఆగ్రహంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విజి అంగీకరించాడు. విజయన్ను పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రియురాలి హత్య
మరుగుదొడ్డిలో మృతదేహం టీనగర్: ప్రియురాలిని హత్య చేసి శవాన్ని మరుగుదొడ్డిలో దాచిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, తురైపాక్కంకు చెందిన వినోదిని(23) బీకాం పట్టభద్రురాలు. ఈమె తల్లిదండ్రులు ఇదివరకే మృతి చెందారు. వినోదిని తరమణిలో ఉన్న ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈమె సంస్థ సమీపంలోని కంపెనీలో తాంబరం, నన్మంగళంకు చెందిన తమిళ్‌సెల్వన్ (18) పనిచేస్తున్నాడు . వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం వినోదిని బంధువులకు తెలియడంతో వారు మందలించారు. వినోదినిని ఉద్యోగాని కి పంపకుండా నిలిపివేశారు. దీంతో తమిళ్‌సెల్వన్ తురైపాక్కం వెళ్లి నేరుగా వినోదినిని కలిసేవాడు. దీంతో వినోదినిని బంధువులు మన్నడిలోగల ఆమె బామ్మ ఇంటికి పంపారు. అక్కడ కూడా తమిళ్‌సెల్వన్ ఆమెను కలిసేవాడు. ఇలావుండగా హఠాత్తుగా వీరి ప్రేమకు అడ్డంకి ఏర్పడింది. నువ్వు నాకంటే చిన్నవాడివి, నన్ను చూసేందుకు రావొద్దని వినోదిని తమిళ్సెల్వన్తో కరాఖండిగా చెప్పింది. ఆదివారం సాయంత్రం టైలర్ దుకాణానికి వెళ్లి వస్తాన ని చెప్పిన వినోదిని తర్వాత ఇంటికి రాలేదు. అనేక చోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు నార్ బీచ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్డిలో మృతదేహం: సోమవారం మధ్యాహ్నం అంగప్పనాయకన్ వీధిలోని టైలర్ దుకాణం వద్ద ఉన్న కాంప్లెక్స్ మరుగుదొడ్డిలో వినోదిని మృతదేహం కనిపించింది. ఇన్స్పెక్టర్ బాబు చంద్రబోస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినోది ని సెల్‌ఫోన్ పరిశీలించగా తమిళ్‌సెల్వన్ అనేక సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించా రు. తురైపాక్కంలో దాక్కున్న తమిళ్‌సెల్వన్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. నిందితుని వాంగ్మూలం: పోలీసుల విచారణలో తాము ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నామని, హఠాత్తుగా వినోదిని తనను కలుసుకోవడం మానేసిందని తెలిపాడు, దీని గురించి ఫోన్లో ప్రశ్నించగా ‘నువ్వు నాకంటే చిన్న వా డివి. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు’’ అని చెప్పింది. ప్రేమించినప్పుడు ఈ విషయం తెలియలేదా? అని తాను ప్రశ్నించానన్నాడు. తర్వాత ఆమెను షా పింగ్ కాంప్లెక్స్‌కు రప్పించి ప్రశ్నించగా చులకనగా మాట్లాడిందని, దీంతో ఆ గ్రహించి ఆమెపై దాడి చేశానన్నాడు. ఆమె కింద పడగానే గొంతు నులిమి హత్యచేసి మరుగుదొడ్డిలో దాచానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.