ప్రియురాలి హత్య.. ప్రియుడి అరెస్టు | Boyfriend murder by Girlfriend | Sakshi
Sakshi News home page

ప్రియురాలి హత్య.. ప్రియుడి అరెస్టు

Published Tue, Aug 16 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

ప్రియురాలి హత్య.. ప్రియుడి అరెస్టు

ప్రియురాలి హత్య.. ప్రియుడి అరెస్టు

కేకేనగర్: తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి తెచ్చిన ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి సమీపంలోని కోటకుప్పం ప్రాంతానికి చెందిన షహీరా(19) ట్యూటోరియల్‌లో ప్లస్‌టూ పూర్తి చేసింది. గత నెల 18న ఈమె అదృశ్యమైంది. షహీరా సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. విచారణలో పుదుచ్చేరి తనత్తుమేటైకు చెందిన విజి అలియాస్ విజయన్(19) అనే యువకుడితో షహీరా తరచు ఫోన్‌లో మట్లాడేదని తెలిసింది.
 
 సంఘటన రోజు షహీరా తన ప్రియుడు విజితో వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పుదుచ్చేరి అరుంపార్తపురం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో విజి, షహీరాను సెంజికోటకు తీసుకెళ్లి అక్కడ హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో గత 23న సెంజికోటలో కుళ్లినస్థితిలో లభించిన యువతి మృతదేహం షహీరాదని తెలిసింది.
 
 పోలీసులకు విజయన్ ఇచ్చిన వాంగ్మూళంలో తాను షహీరా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నామని గత 23న సెంజికోటలో తాము ఏకాంతంగా ఉన్నామని తెలిపారు.  ఆ సమయంలో తనను వివాహం చేసుకొమ్మని షహీరా ఒత్తిడి చేయడంతో తాను నిరాకరించానని తెలిపారు. ఈ విషయమై ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఆగ్రహంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విజి అంగీకరించాడు. విజయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement