మరుగుదొడ్డిలో మృతదేహం
టీనగర్: ప్రియురాలిని హత్య చేసి శవాన్ని మరుగుదొడ్డిలో దాచిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, తురైపాక్కంకు చెందిన వినోదిని(23) బీకాం పట్టభద్రురాలు. ఈమె తల్లిదండ్రులు ఇదివరకే మృతి చెందారు. వినోదిని తరమణిలో ఉన్న ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈమె సంస్థ సమీపంలోని కంపెనీలో తాంబరం, నన్మంగళంకు చెందిన తమిళ్‌సెల్వన్ (18) పనిచేస్తున్నాడు . వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం వినోదిని బంధువులకు తెలియడంతో వారు మందలించారు. వినోదినిని ఉద్యోగాని కి పంపకుండా నిలిపివేశారు. దీంతో తమిళ్‌సెల్వన్ తురైపాక్కం వెళ్లి నేరుగా వినోదినిని కలిసేవాడు.
దీంతో వినోదినిని బంధువులు మన్నడిలోగల ఆమె బామ్మ ఇంటికి పంపారు. అక్కడ కూడా తమిళ్‌సెల్వన్ ఆమెను కలిసేవాడు. ఇలావుండగా హఠాత్తుగా వీరి ప్రేమకు అడ్డంకి ఏర్పడింది. నువ్వు నాకంటే చిన్నవాడివి, నన్ను చూసేందుకు రావొద్దని వినోదిని తమిళ్‌సెల్వన్‌తో కరాఖండిగా చెప్పింది. ఆదివారం సాయంత్రం టైలర్ దుకాణానికి వెళ్లి వస్తాన ని చెప్పిన వినోదిని తర్వాత ఇంటికి రాలేదు. అనేక చోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు నార్ బీచ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మరుగుదొడ్డిలో మృతదేహం: సోమవారం మధ్యాహ్నం అంగప్పనాయకన్ వీధిలోని టైలర్ దుకాణం వద్ద ఉన్న కాంప్లెక్స్ మరుగుదొడ్డిలో వినోదిని మృతదేహం కనిపించింది. ఇన్‌స్పెక్టర్ బాబు చంద్రబోస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినోది ని సెల్‌ఫోన్ పరిశీలించగా తమిళ్‌సెల్వన్ అనేక సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించా రు. తురైపాక్కంలో దాక్కున్న తమిళ్‌సెల్వన్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు.
నిందితుని వాంగ్మూలం: పోలీసుల విచారణలో తాము ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నామని, హఠాత్తుగా వినోదిని తనను కలుసుకోవడం మానేసిందని తెలిపాడు, దీని గురించి ఫోన్‌లో ప్రశ్నించగా ‘నువ్వు నాకంటే చిన్న వా డివి. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు’’ అని చెప్పింది. ప్రేమించినప్పుడు ఈ విషయం తెలియలేదా? అని తాను ప్రశ్నించానన్నాడు. తర్వాత ఆమెను షా పింగ్ కాంప్లెక్స్‌కు రప్పించి ప్రశ్నించగా చులకనగా మాట్లాడిందని, దీంతో ఆ గ్రహించి ఆమెపై దాడి చేశానన్నాడు. ఆమె కింద పడగానే గొంతు నులిమి హత్యచేసి మరుగుదొడ్డిలో దాచానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలి హత్య
Published Wed, Apr 13 2016 4:34 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement