Girls care
-
నేడు జాతీయ బాలికల దినోత్సవం
అనంతపురం /అనంతపురం కల్చరల్: బాలికల అక్రమ రవాణాపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతూ జిల్లాకు చెందిన భావనసాయి.. చత్తీస్‌ఘడ్‌కు 25 రోజుల సైకిల్ యాత్ర చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనపరచిన ఆ అమ్మాయిని ఉన్నత విద్యామండలి కమిషనర్ పోలా భాస్కర్ ప్రత్యేకంగా పిలిపించుకుని సత్కరించారు. ఈ ఘటన నేటి తరం అమ్మాయిల స్వేచ్ఛకు, ఆకాంక్షకు అద్దం పడుతోంది. ఒక్క భావనసాయినే కాదు.. నేటి సమాజంలో ఎందరో బాలికలు... పురుషులతో దీటుగా అన్ని రంగాల్లో పోటీ పడి ప్రతిభ చాటుతున్నారు. ‘అమ్మో కూతురా!’ అనే స్థితి నుంచి ‘కంటే కూతుర్నే కనాలి’ అనే పరిస్థితి వచ్చేలా ప్రజల్లో మార్పు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో బాలికల ప్రాధాన్యతను తెలిపేలా ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికాదినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తొలగిన ఆంక్షలు లింగ వివక్ష, నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితులు వెరసి బాలికల అభ్యున్నతిని అడ్డుకుంటూ వచ్చాయి. వారిని వంటింటికే పరిమితం చేసేలా ఆంక్షలు విధించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అన్నింటా బాలికలు రాణిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో సరికొత్త చరిత్రను బాలికలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్తమాన పరిస్థితులు బాలికలకు పటిష్టమైన భద్రతను కలి్పంచే దిశగా సాగుతున్నాయి. భద్రత దిశగా కీలక నిర్ణయాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బాలికల భద్రతకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. అంతేకాక నగర, పట్టణ ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేస్తూ ప్రత్యేకంగా స్కూటర్లు, స్కారి్పయో వాహనాలను సమకూర్చారు. ►మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్న వారిని జియో ట్యాగింగ్ చేసి వారిపై నిఘా పెంచారు. ► దాడులు, వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాల మ్యాపింగ్ చేశారు. కేంద్ర పథకాల భరోసా బాలికల సంరక్షణ, వారి చదువులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలను అమలు చేస్తోంది. బేటీ పడావో–బేటీ బచావో కార్యక్రమంతో భ్రూణహత్యల నివారణతో పాటు బాలికావిద్యాభివృద్ధికి బాటలు వేసింది. బాలికల భవిష్య నిధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పాఠశాలల్లో చదువుతున్న విద్యారి్థనుల మెరుగైన ఆరోగ్యం కోసం పీఎం బాలికా సురక్ష యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రిడ్జ్ కోర్సులను ఏర్పాటు చేసి వయసుకు తగ్గ తరగతిలో డ్రాపౌట్ బాలికలు చదువుకునేందుకు అవకాశం కలి్పంచింది. అర్ధంతరంగా చదువు మానేసిన బాలికలకు కస్తూర్బా పాఠశాలలు (కేజీబీవీ) వరంగా మారాయి. పెరిగిన ఉత్తీర్ణత శాతం ఒకప్పటితో పోల్చుకుంటే తల్లిదండ్రుల్లోనూ బాలికల పట్ల స్పష్టమైన మార్పు వచ్చింది. ఆడపిల్లల పట్ల ఎక్కువ అభిమానం చూపించే స్థితికి చేరుకున్నారు. ఆడపిల్లలతో తండ్రికి విడదీయలేని బంధం ఏర్పడుతోంది. చదువు విషయంలో బాలికలు చూపుతున్న శ్రద్ధ, తెలివితేటలేనని ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువెందుకంటూ ఇంటికే పరిమితమైన పరిస్థితి నుంచి నేడు సంపూర్ణ ఆధిపత్యం సాధించే దిశగా బాలికలు పట్టు సాధించారు. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికల జైతయాత్ర కొనసాగుతూ వస్తోంది. బాలికలకు మరింత భద్రత గత చట్టాల కన్నా దిశ చట్టం ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఇది చట్టబద్ధత పొందే అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతోంది. దీంతో గతంతో పోలిస్తే బాలికలు, మహిళల పట్ల వేధింపులు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి పాఠశౠల, కళాశాలల్లో చదుతున్న బాలికల చేత దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించి, వినియోగంపై అవగాహన కలి్పంచాం. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ -
ఆడపిల్లలకు చెబుదాం
9 నుంచి 13 ఏళ్ల వయసులో ఉండే అమ్మాయిలకు ఎన్నో సందేహాలు. తమ శరీర మార్పుల గురించి. వాటికి సమాధానం మనం చెప్పం. వారే తెలుసుకోవాలి. ఆ వయసు తర్వాత వాళ్లు ‘ఆడపిల్లలు’ గా సమాజం నుంచి ప్రత్యేకం కాబడతారు. ఎందుకు అలా? వారిని వారికి తెలియచేద్దాం... వారిని సమాజంలో ఒక భాగం చేద్దాం అంటున్నారు నటి టిస్కా చోప్రా. తొమ్మిదేళ్ల కూతురు ఉన్న టిస్కా బాలికల కోసమే ‘వాట్స్ అప్ విత్ మీ’ పుస్తకం రాసి వెలువరించారు. ‘వాట్స్ అప్ విత్ మీ’ అనేది టిస్కా చోప్రా రాసిన పుస్తకం పేరు. దాని కింద ప్యూబర్టీ, పిరియడ్స్, పింపుల్స్, పీపుల్, ప్రాబ్లమ్స్ అండ్ మోర్ అనే ట్యాగ్‌లైన్. దీనిని బట్టి ఆ పుస్తకం ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. 47 ఏళ్ల టిస్కా ‘తారే జమీన్ పర్’ నటిగా దేశానికి తెలుసు. ఆమె చేసిన ‘చట్నీ’ అనే లాంగ్ షార్ట్‌ఫిల్మ్ ఆమెకు విపరీతమైన ఖ్యాతి తెచ్చి పెట్టింది. బాలీవుడ్లో, టెలివిజన్‌లో, నాటక రంగంలో టిస్కా చాలా భిన్నమైన పాత్రలనే చేయడానికి ఇష్టపడుతుంది. అదీగాక ఆమె రచయిత్రి కూడా గతంలో ఆమె ‘యాక్టింగ్ స్మార్ట్: యువర్ టికెట్ టు షోబిజ్’ పుస్తకం రాసింది. ‘వాట్స్ అప్ విత్ మీ’ ఆమె రెండోపుస్తకం. కూతురి కోసం ‘ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు. ‘రెడ్ పాండా’ పబ్లికేషన్స్ ఎడిటర్ విధి భార్గవ నా బుర్రలో వేసింది. లాక్డౌన్లో నేను ఇంట్లో ఉండటం కూడా ఈ ఆలోచన పెరగడానికి కారణమైంది. ఇక తొమ్మిదేళ్ల నా కూతురు మరో ముఖ్యకారణం. నా చిన్నప్పుడు పిరియడ్స్ గురించి అడిగితే అదొక అసహ్యకరమైన విషయంగా మా పెద్దలు ఆ విషయాన్ని చర్చించేవారు కాదు. దాని గురించి రకరకాలుగా సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా కన్ఫ్యూజన్ని, ఆందోళనని కలిగించేది. నా కూతురును మాత్రం అలా నేను చేయదలుచుకోలేదు. మా ఇంట్లో లైంగిక అవయవాలను సంకేతపదాలతో మాట్లాడము నేను కాని నా భర్త కాని. వాటికి సంకేత పదాలు వాడటం వల్ల వాటి చుట్టూ నిగూఢత ఏర్పడుతుంది. దాని నుంచే సందేహాలు అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయిలకు అమ్మాయిల గురించి, అబ్బాయిలకు అబ్బాయిల గురించి ఇద్దరికీ పరస్పరం సమాచారం ఉండాలి. దాని గురించి మనమంతా ఆలోచించాలి. నా పుస్తకం ఒక మేరకు జరిగిన ప్రయత్నంగా భావిస్తాను’ అంటోంది టిస్కా. సరదాగా సమచారం ‘నా పుస్తకంలో సమాచారాన్ని సరదాగా ఉండేలా చూశాను. చాలా బొమ్మలు ఉంటాయి. వాటి ద్వారా ఆడపిల్లలకు తమ శరీరాల్లో జరిగే మార్పులు, తద్వారా వచ్చే ఆందోళనల గురించి తెలుస్తుంది. పిరియడ్స్ గురించి జరిగే షేమింగ్ తెలుస్తుంది. దాని గురించి భయపడేది సిగ్గుపడేదీ ఏమీ లేదని చెబుతాను. అవి వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ప్యాడ్స్ గురించి కప్స్ గురించి సమాచారం ఉంటుంది. అసలు ఆడపిల్లలు ధైర్యంగా మెడికల్ షాప్‌కు వచ్చి ప్యాడ్స్‌ని కొనే, అలాగే మెడికల్ షాప్ వాడు దానిని న్యూస్‌పేపర్ లో చుట్టకుండా ఇచ్చే రోజులు రావాలి. ఆడపిల్లల తండ్రులు తమ కుమార్తెల కోసం శానిటరీ పాడ్ కొనగలగాలి. నా పుస్తకం తండ్రులకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆడపిల్లల తండ్రులు కూడా తమ కుమార్తెల మనసుల్లో ఏముందో ఏం సందేహాలున్నాయో తెలుసుకుని వారిని తేలిక పరచాలి. మన ఇళ్లల్లో తల్లికి ఈ బాధ్యత అప్పజెబుతారు. తల్లి వాటికి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు’ అంటారు టిస్కా. నిపుణుల సహాయంతో... టిస్కా ఈ పుస్తకం టీనేజ్‌ను దాటిన ఒక స్త్రీ అవగాహనతో రాసినా, నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా అరోరా (గైనకాలజిస్ట్), కెనడాలో ఉంటున్న మాళవిక వర్మ (సైకాలజిస్ట్) తమ ఇన్పుట్స్ ఇచ్చి బాలికల భౌతిక, మానసిక మార్పులకు సంబంధించి వారికి వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ‘టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు సరైన అవగాహన కల్పించడం వల్ల మెన్స్ట్రువల్ హైజీన్ తెలుస్తుంది. లైంగిక అవయవాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోగలుగుతారు. టీనేజ్ ప్రెగ్నెన్సీల బారిన పడకుండా ఉంటారు’ అని డాక్టర్ మాలా అరోరా అంటారు. ఏమైనా టిస్కా అరోరా రాసిన ఈ పుస్తకం లాంటి పుస్తకాల అవసరం చాలా ఉంది. తెలుగులో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి... స్కూల్ పిల్లలకు చదువుకునే విధంగా వారికి ఏ మేరకు అందుతున్నాయన్నది సందేహాస్పదం. మన సెలబ్రిటీలు ఇలాంటి ఆలోచనలు చేస్తే వారి స్టేటస్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ పుస్తకాలను చేరవేయవచ్చు. సమాజంలో జరుగుతున్న దుష్పరిమాణాలు చూసినప్పుడు బాలికల శారీరక, లైంగిక చైతన్యం గురించి ఎంతో పని సాగాలని తెలుస్తోంది. ఆ పని టిస్కా చేసినందుకు ఆమెకు తప్పకుండా అభినందనలు తెలిపి తీరాల్సిందే. – సాక్షి ఫ్యామిలీ -
బంగారుతల్లిపై నీలిమేఘాలు
- కొద్ది మందికే అందిన ఆర్థిక సాయం - బాండ్లు పంపిణీ నిలిపివేత పిఠాపురం: బాలికా సంరక్షణకు గత రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన బంగారుతల్లి పథకం అమలుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఏడాదిపాటైనా పూర్తి స్థాయిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఆపథకం పేరుతో ఆడపిల్ల పుడితే వారింట బంగారమే అనుకున్న లబ్ధిదారులకు బాండ్లే బంగారంగా కనిపిస్తున్నాయి తప్ప ఆర్థిక సహాయం మాత్రం అంద లేదు. అధికారులు బాండ్ల పంపిణీని సైతం నిలిపివేయడంతో ఈపథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈపథకం కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 19,682 మంది దరఖాస్తు చేసుకోగా 9,722 మందిని అర్హులుగా గుర్తించి ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడత ఆర్థిక సహాయం కింద రూ. 2,43,5000 విడుదల చేశారు. అలాగే జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీల్లో 1,250 మంది దరఖాస్తు చేసుకోగా 456 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి కూడా అప్పట్లో బాండ్లను పంపిణీ చేశారు. ఆ బాండ్లపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండడంతో వాటిని నిలిపి వేసిన అధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక పోవడంతో కొత్త బాండ్లు డిజైన్ చేసే వరకు కేవలం ఎన్రోల్ మెంటు మాత్రమే చేస్తున్నారు. బంగారు తల్లి పథకంలో సాయం అందేదిలా... ఈపధకంలో బాగంగా పుట్టిన నాటినుంచి ఆస్పత్రిలో ప్రసవం ఇతర ఖర్చుల కోసం రూ, 2500 ఆతరువాత, టీకాల కోసం రూ, వెయ్యి, అంగన్వాడీ చదువులకు ఏడాదికి రూ, 1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ, 2 వేలు ఆర్దిక సహాయం అందించాలి.అలాగే ఆరు నుంచి ఏడో తరగతి వరకు ఏడాదికి రూ, 2500, ఎనిమిదోతరగతి వరకు ఏడాదికి రూ, 2500, తొమ్మిది నుంచి పదోతరగతి వరకు ఏడాదికి రూ, 3వేలు, ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ, 3500 , గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ, 4వేలు దశల వారీగా అందించడం ఈపథకం లక్ష్యం. అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్మీడియట్ తరువాత రూ. 55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ. లక్ష కలిపి రూ. 1.55 లక్షలు ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. సాధారణంగా ఈపధకంలో ఎంపికైన లబ్దిదారుల పిల్లలకు సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కోక్కరికి రూ, 2500 చొప్పున నిధులు వారివారి బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే బాండ్లు పంపిణీ చేసి నెలలు కావస్తున్నా జిల్లాలో ఇప్పటికి 10,500 మంది ఖాతాలో డబ్బు జమకాకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పధకం ప్రారంభించి ఏడాది పూర్తవ్వడంతో ప్పటికే తొలి విడత పొమ్ము జమైన వారికి మలి విడతగా టీకాల కోసం ఇవ్వాల్సిన సొమ్ము ఇప్పటి జమకాక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.