National Girl Child Day 2023: History, Significance - Sakshi
Sakshi News home page

నేడు జాతీయ బాలికల దినోత్సవం

Published Tue, Jan 24 2023 8:06 AM | Last Updated on Tue, Jan 24 2023 10:38 AM

National Girl Child Day - Sakshi

అనంతపురం /అనంతపురం కల్చరల్‌: బాలికల అక్రమ రవాణాపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతూ జిల్లాకు చెందిన భావనసాయి..  చత్తీస్‌ఘడ్‌కు 25 రోజుల సైకిల్‌ యాత్ర చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనపరచిన ఆ అమ్మాయిని ఉన్నత విద్యామండలి కమిషనర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేకంగా పిలిపించుకుని సత్కరించారు.  ఈ ఘటన నేటి తరం అమ్మాయిల స్వేచ్ఛకు, ఆకాంక్షకు అద్దం పడుతోంది. ఒక్క భావనసాయినే కాదు.. నేటి సమాజంలో ఎందరో బాలికలు... పురుషులతో దీటుగా అన్ని రంగాల్లో పోటీ పడి ప్రతిభ చాటుతున్నారు. ‘అమ్మో కూతురా!’ అనే స్థితి నుంచి ‘కంటే కూతుర్నే కనాలి’ అనే పరిస్థితి వచ్చేలా ప్రజల్లో మార్పు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో బాలికల ప్రాధాన్యతను తెలిపేలా ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికాదినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  

తొలగిన ఆంక్షలు 
లింగ వివక్ష, నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితులు వెరసి బాలికల అభ్యున్నతిని అడ్డుకుంటూ వచ్చాయి. వారిని వంటింటికే పరిమితం చేసేలా ఆంక్షలు విధించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అన్నింటా బాలికలు రాణిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో సరికొత్త చరిత్రను బాలికలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్తమాన పరిస్థితులు బాలికలకు పటిష్టమైన భద్రతను కలి్పంచే దిశగా సాగుతున్నాయి.  

భద్రత దిశగా కీలక నిర్ణయాలు  
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బాలికల భద్రతకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. అంతేకాక నగర, పట్టణ ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేస్తూ ప్రత్యేకంగా స్కూటర్లు, స్కారి్పయో వాహనాలను  సమకూర్చారు.
►మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్న వారిని జియో ట్యాగింగ్‌ చేసి వారిపై నిఘా పెంచారు.

► దాడులు, వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాల మ్యాపింగ్‌ చేశారు.  

కేంద్ర పథకాల భరోసా 
బాలికల సంరక్షణ, వారి చదువులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలను అమలు చేస్తోంది. బేటీ పడావో–బేటీ బచావో కార్యక్రమంతో భ్రూణహత్యల నివారణతో పాటు బాలికావిద్యాభివృద్ధికి బాటలు వేసింది. బాలికల భవిష్య నిధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పాఠశాలల్లో చదువుతున్న విద్యారి్థనుల మెరుగైన ఆరోగ్యం కోసం పీఎం బాలికా సురక్ష యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రిడ్జ్‌ కోర్సులను ఏర్పాటు చేసి వయసుకు తగ్గ తరగతిలో డ్రాపౌట్‌ బాలికలు చదువుకునేందుకు అవకాశం కలి్పంచింది. అర్ధంతరంగా చదువు మానేసిన బాలికలకు కస్తూర్బా పాఠశాలలు (కేజీబీవీ) వరంగా మారాయి.   

పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఒకప్పటితో పోల్చుకుంటే తల్లిదండ్రుల్లోనూ బాలికల పట్ల స్పష్టమైన మార్పు వచ్చింది. ఆడపిల్లల పట్ల ఎక్కువ అభిమానం చూపించే స్థితికి చేరుకున్నారు. ఆడపిల్లలతో తండ్రికి విడదీయలేని బంధం ఏర్పడుతోంది. చదువు విషయంలో బాలికలు చూపుతున్న శ్రద్ధ, తెలివితేటలేనని ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువెందుకంటూ ఇంటికే పరిమితమైన పరిస్థితి నుంచి నేడు సంపూర్ణ ఆధిపత్యం సాధించే దిశగా బాలికలు పట్టు సాధించారు. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో బాలికల జైతయాత్ర కొనసాగుతూ వస్తోంది.  

బాలికలకు మరింత భద్రత  
గత చట్టాల కన్నా దిశ చట్టం ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఇది చట్టబద్ధత పొందే అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతోంది. దీంతో గతంతో పోలిస్తే బాలికలు, మహిళల పట్ల వేధింపులు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి పాఠశౠల, కళాశాలల్లో చదుతున్న బాలికల చేత దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, వినియోగంపై అవగాహన కలి్పంచాం.  
– ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement