ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అమలాపురం జో¯ŒS బాలికల గ్రిగ్స్ ప్రారంభం
పుల్లేటికుర్రు(అంబాజీపేట) :
పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో సోమవారం ప్రారంభమైన అమలాపురం బాలికల గ్రి గ్స్ ఆటల పోటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సా గాయి. మూడురోజులు జరిగే పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1000 మంది క్రీడాకారులు, 70 మం ది పీఈటీలు పాల్గొన్నారని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు, హెచ్ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజిం గ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలి పారు. మొదటి రోజు విజేతల వివరాలను ప్రకటించారు. మార్చ్‌పాస్ట్‌లో ముమ్మిడివరం, గోపవరం, పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూళ్లు, 800 మీ టర్ల రన్నింగ్ సీనియర్స్ విభాగంలో దొమ్మేటి మ నీషా (అంబాజీపేట), ఎ¯ŒSఎస్వవీ శరణ్య (భాష్యం, అమలాపురం), టి.ప్రియ (పాలగుమ్మి), హాకీ సీనియర్స్ విభాగంలో పి.లక్షి్మవాడ, ముని పల్లి, గొల్లవిల్లి స్కూళ్లు, టేబుల్ టెన్నిస్ సింగి ల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, జూనియర్స్ సింగిల్స్ విభాగంలో శానపల్లిలంక, వీరవల్లిపాలెం, జగన్నాథపురం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరి పట్నం పాఠశాలలు వరుసగా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. .
అలరించిన ఊఫింగ్ డ్రిల్
గ్రిగ్స్ ప్రారంభం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరం జెడ్పీ హైస్కూలుకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నిర్వహించిన ఊ ఫింగ్ డ్రిల్ ఆకట్టుకుంది. ఈ డ్రిల్‌లో వారికి ప్రధానోపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీవిశ్వనాథం, వ్యాయామ ఉపాధ్యాయు డు ఎ.ఉమామహేశ్వరరావు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అభినందించారు.