girls molested
-
బీహెచ్‌యూలో ఆగని లైంగిక వేధింపులు
వారణాసి: ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. వర్సిటీలో విద్యార్థినులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రాంగణంలో గురువారం ఓ విద్యార్థినిపై యువకుడు వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. వర్సిటీలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు సైన్స్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఛాంబర్‌కు వెళుతుండగా ఎస్ఎస్ గోండ్ అనే పీజీ విద్యార్థి అడ్డగించి తోసివేశాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాంపస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై వర్సిటీ ప్రొక్టోరల్ బోర్డుకు విద్యార్థిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికలపై అఘాయిత్యం.. కానిస్టేబుల్ అరెస్టు
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేస్తూ వీడియోకు దొరికేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. తమ మీద అఘాయిత్యం జరిగిందని ఫిర్యాదు చేయడానికి అక్కాచెల్లెళ్లు అయిన ఆ బాలికలిద్దరూ పోలీసు పోస్ట్‌కు వెళ్లారు. అక్కడే అతడు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒకవైపు యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటుతో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు కొంతమంది పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు. పోలీసు పోస్టులో కానిస్టేబుల్ ఒక మంచం మీద పడుకుని, బాలికలను అసభ్యంగా తాకుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జిల్లా ఎస్పీ ఎస్ రాజేష్ తెలిపారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కానిస్టేబుల్ ఈశ్వరీ ప్రసాద్ ఖండించాడు. వాళ్లను ఇంటికి వెళ్లమని చెప్పేందుకే ఇద్దరిలో ఒకరి చేయి ముట్టుకున్నానని, అంతేతప్ప వారిపట్ల ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నాడు. మార్చి నెలలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతల పరిస్థితిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు కూడా గతంలోలాగే జంగిల్‌రాజ్ కొనసాగుతోందని అంటున్నాయి. -
హాస్టల్ బాలికలపై వార్డెన్ భర్త అత్యాచారం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మాయిల హాస్టల్ సూపరింటెండెంట్ భర్త అదే హాస్టల్లో ఉంటున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో సూపరింటెండెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హాస్టల్ ధనోరా గ్రామంలో ఉందని, అసలైన నిందితుడు వినోద్ నాగ్ పరారీలో ఉండటంతో అతడి భార్య, హాస్టల్ సూపరింటెండెంట్ నీతా నాగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తికేయ గోయల్ తెలిపారు. వినోద్ నాగ్ తమపై అత్యాచారం చేసినట్లు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారని, వాళ్లు ఎంత చెప్పినా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోకపోగా.. వీలైనంతవరకు కేసును తొక్కేయడానికి ఆమె ప్రయత్నించారని కలెక్టర్ తెలిపారు. దాంతో విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదుచేఏశామన్నారు.