బాలికలపై అఘాయిత్యం.. కానిస్టేబుల్ అరెస్టు | uttar pradesh constable arrested for molesting girls after video goes viral | Sakshi
Sakshi News home page

బాలికలపై అఘాయిత్యం.. కానిస్టేబుల్ అరెస్టు

Published Mon, Jun 5 2017 11:23 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

బాలికలపై అఘాయిత్యం.. కానిస్టేబుల్ అరెస్టు - Sakshi

బాలికలపై అఘాయిత్యం.. కానిస్టేబుల్ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేస్తూ వీడియోకు దొరికేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. తమ మీద అఘాయిత్యం జరిగిందని ఫిర్యాదు చేయడానికి అక్కాచెల్లెళ్లు అయిన ఆ బాలికలిద్దరూ పోలీసు పోస్ట్‌కు వెళ్లారు. అక్కడే అతడు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒకవైపు యాంటీ రోమియో స్క్వాడ్‌ల ఏర్పాటుతో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు కొంతమంది పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు. పోలీసు పోస్టులో కానిస్టేబుల్ ఒక మంచం మీద పడుకుని, బాలికలను అసభ్యంగా తాకుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జిల్లా ఎస్పీ ఎస్ రాజేష్ తెలిపారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను కానిస్టేబుల్ ఈశ్వరీ ప్రసాద్ ఖండించాడు. వాళ్లను ఇంటికి వెళ్లమని చెప్పేందుకే ఇద్దరిలో ఒకరి చేయి ముట్టుకున్నానని, అంతేతప్ప వారిపట్ల ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నాడు. మార్చి నెలలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతల పరిస్థితిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు కూడా గతంలోలాగే జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement