
కానిస్టేబుల్ లోకేశ్
దొడ్డబళ్లాపురం : రామనగర ట్రాఫిక్ డీఆర్ కానిస్టేబుల్ లోకేశ్ పరాయి స్త్రీతో జరిపిన రాసలీలల వీడియో ఒకటి రామనగరలో వైరల్‌గా మారింది. ఇదే కానిస్టేబుల్ గతంలో చిత్రదుర్గలో విధులు నిర్వహిస్తుండగా వీడియోలో ఉన్న యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడు. అయితే గత నెలలో యువతికి వేరే యువకుడితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా కానిస్టేబుల్ లోకేశ్ యువతి నివసిస్తున్న హిరియూరు తాలూకా కేకే హట్టి గ్రామానికి వెళ్లి యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు.
దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు లోకేశ్‌ను చితకబాదారు. తన్నులు తిన్న వీడియో సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమయింది. ఈ సంఘటనతో లోకేశ్‌ను రామనగరకు ట్రాన్స్‌ఫర్ చేసారు. అయితే కొద్ది రోజుల్లోనే లోకేశ్ కేకేహట్టి యువతితో జరిపిన రాసలీలల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులకు అవమానకరంగా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌పీ రమేశ్‌బానోత్ మాట్లాడుతూ... చిత్రదుర్గ ఎస్పీ నుండి నివేదిక అడిగామని,, అది అందగానే లోకేశ్‌పై చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment