వారణాసి: ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. వర్సిటీలో విద్యార్థినులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రాంగణంలో గురువారం ఓ విద్యార్థినిపై యువకుడు వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది.
వర్సిటీలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు సైన్స్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఛాంబర్‌కు వెళుతుండగా ఎస్‌ఎస్ గోండ్ అనే పీజీ విద్యార్థి అడ్డగించి తోసివేశాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాంపస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై వర్సిటీ ప్రొక్టోరల్ బోర్డుకు విద్యార్థిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment