Gita contest
-
'ప్లీజ్.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'
సాక్షి, మీరట్ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్ అనే ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత శ్లోకాలు చెప్పడం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను కృష్ణుడు వేషం వేసి, భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన ఇస్లాం బలహీనమైనదని అర్ధం కాదు. అలా అనుకునే వారితో నేను ఏకీభవించను. ముస్లిం మత పెద్దలు నాకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశారు. అందుకే ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు' అని అలియా వేడుకుంది. గతంలో కూడా తాను చేసిన పని ఏ ఒక్క మత విశ్వాసాన్నిగానీ, గుర్తింపునకుగానీ హానీ కలిగించదని చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది (2017) డిసెంబర్ 30న జరిగిన ఓ కార్యక్రమంలో అలియా కృష్ణుడి వేషం వేసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు కూడా చదివింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. -
భగవద్గీతపై ముస్లిం బాలికకు ఫస్ట్ ప్రైజ్
ముంబయి: భగవద్గీతపై నిర్వహించిన పరీక్ష పోటీలో ముస్లిం విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది. 3000 మంది పాల్గొన్న ఈ పోటీలో మిగితావారందరిని వెనుకకు నెట్టి ఆ బాలిక తొలిస్థానంలో నిల్చుని బహుమతి అందుకుంది. గత జనవరిలో ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) సంస్థ 'గీతా చాంపియన్స్ లీగ్' అనే అంశంపై పరీక్ష పోటీ నిర్వహించింది. ఇందులో పలు పాఠశాలలనుంచి విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బహులైఛ్చిక ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్షలో ఆరోతరగతి చదువుతున్న పన్నెండేళ్ల మర్యామ్ సిద్ధిఖీ తొలి బహుమతిని అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా మర్యామ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఖాళీగా ఉన్న సమయాల్లో మతాలకు సంబంధించిన పుస్తక పఠనం చదువుతానని, ఎప్పుడైతే ఈ కాంపిటేషన్ గురించి విన్నానో అప్పుడే భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఆలోచించి చదవడం నేర్చుకున్నానని తెలిపింది. ఆ ప్రిపరేషనే తనకు మొదటి బహుమతి రావడానికి కారణమైందని వివరించింది. ముంబైలోని మీరా రోడ్డులోగల కాస్మోపాలిటన్ రోడ్డులో ఈ బాలిక చదువుతుంది. పరీక్షకు నెల రోజుల ముందుగా ఇస్కాన్ సంస్థ వాళ్లే సంబంధిత మెటీరియల్ ఇచ్చారు.