మొగల్తూరు ఆక్వా ప్లాంట్ ఘటనపై విచారణ
మొగల్తూరు : మొగల్తూరు ఆనంద రొయ్యల పరిశ్రమలో ఐదుగురి మృతికి కారణమైన ఘటనపై విచారణ నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామని చీఫ్ ఎన్విరా న్ మెంటల్ ఇంజినీర్ రామచంద్ తెలిపారు. గత నెల 30న మొగల్తూరు నల్లంవారితోటలోని ఆనంద రొయ్యల పరిశ్రమలో విషరసాయనాలు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్, ఏలూరుకు చెందిన ఎన్విరా న్ మెంటల్, పొల్యూష న్ బోర్డు, మత్య్సశాఖ, పరిశ్రమల శాఖ అధికారులు ప్రమాదానికి కారణమైన విష రసాయనాల ట్యాంక్‌ను పరిశీలించారు. ట్యాంక్ నుంచి గొంతేరు డ్రెయి న్ లోకి వేసిన పైప్‌లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీజ్ చేసిన పరిశ్రమ ఆవరణలోనూ కలియతిరిగారు. అనంతరం ఎన్విరా న్ మెంటల్ చీఫ్ ఇంజినీర్ రామచంద్ మాట్లాడుతూ ప్రమాదానికి జరిగిన కారణాలను పరిశీలించేందుకు వచ్చామని, తాము సమర్పించే నివేదికలోని విషయాలను బహిరంగ పర్చకూడదన్నారు. నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ఎన్విరా న్ మెంటల్ శాఖ జేడీ భాస్కర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామ్మోహనరావు, మత్య్సశాఖ డీడీ భాస్కరరావు, ఏడీ నాగలింగాచార్యులు, బాషా, మేరీ, డీఎస్పీ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.