GK
-
భారతదేశంలోనే మొట్టమొదటిగా..! (ఫోటోలు)
-
మీకు తెలుసా..?
-
జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్.. పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్ఆర్బీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స సంస్థలు, సబ్ ఇన్స్పెక్టర్స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం. ఏ సబ్జెక్ట్‌కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్‌సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్‌సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పూర్వాపరాలు తెలుసుకోండి కరెంట్ అఫైర్సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం.. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది. బ్యాంక్ పరీక్షల కోసం.. బ్యాంక్ పీవో, క్లర్క, ఆర్బీఐ, నాబార్డ, ఇన్సూరెన్స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్‌ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జాతీయ అంశాలు దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి. ఆర్థిక అంశాలు కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్‌బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకే కోసం.. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది. - ఎన్. విజయేందర్‌రెడ్డి కరెంట్ అఫైర్స నిపుణులు,హైదరాబాద్ -
జీకే సన్నాఫ్ పీకే
‘‘డాడీ... నేను మీలాగే భూగ్రహానికి వెళ్లాలనుకుంటున్నాను. నన్ను దీవించండి’’ అన్నాడు జీకే. ‘‘నేను వెళ్లి నానా చావు చచ్చాను కదా సన్. మళ్లీ నువ్వు వెళ్లడం ఎందుకు?’’ అడిగాడు పీకే. ‘‘మీరు 2014లో వెళ్లారు. భూ గోళంలో ప్రతి నెలకూ ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయని చెప్పారుగా. ఇన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. అక్కడి సరికొత్త విశేషాలను మన గ్రహవాసులతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు జీకే. ‘‘అయితే ఓకే’’ ఆశీర్వదించాడు పీకే. గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి పీకేని. ‘‘డియర్ సన్. నువ్వు ఎక్కడికైనా వెళ్లుగానీ ఆ రాజస్థాన్ ఎడారుల్లోకి మాత్రం వెళ్లకు. అక్కడే ఒక దొంగోడు నా మెడలో ఉన్న స్పేస్‌షిప్ రిమోట్ కంట్రోల్ దొబ్బేశాడు. ఆ భూమి మీద ఉండలేక, మన గ్రహానికి రాలేక ఎన్నెన్ని కష్టాలు పడ్డానో మీకు చెప్పాను కదా’’ అని వారించాడు పీకే. ‘‘రిమోట్‌ను మీలాగా అందరికీ కని పించేలా మెడలో వేసుకుంటానా ఏంటి? చక్కగా నడుముకు కట్టుకొని, మీరు భూ గోళం నుంచి తెచ్చిన షర్ట్ వేసుకుంటాను. ఇక అది ఎవరికీ కనబడదు. ఎవరూ దాన్ని కొట్టుకెళ్లే చాన్స్ లేదు’’.. ధీమాగా చెప్పాడు జీకే. ‘‘అయితే ఓకే!’’ అన్నాడు పీకే. ఆ మరుసటి రోజు స్పేస్‌షిప్ ఎక్కాడు జీకే. ‘‘డియర్ సన్... క్షేమంగా వెళ్లి లాభంగా రాకపోయినా ఫరవాలేదు గానీ... లబోదిబోమని మాత్రం రాకు’’ అంటూ వీడ్కోలు పలికాడు పీకే. స్పేస్‌షిప్ ఒక అర్ధరాత్రి హైదరా బాద్‌లోని చింతల్‌బస్తీ క్రికెట్ గ్రౌండ్లో దిగింది. ‘‘వారం రోజుల్లో వచ్చేయాలి. రిమోట్ గానీ పోగొట్టుకున్నావంటే శాశ్వతంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది జాగ్రత్త’’ అని హెచ్చరించి వెళ్లిపోయారు స్పేస్‌షిప్ డ్రైవర్లు.తెల్లారిపోయింది. రోడ్లమీద తిరగడం ప్రారంభించాడు జీకే. మధ్యాహ్నమైంది. నోరు పిడచకట్టింది. అమీర్‌పేట్‌లోని ఒక సందులో ‘శ్రీ మహంకాళి కల్లు కాంపౌండ్’ అనే బోర్డ్‌తో ఒక రేకుల షెడ్డు కని పించింది. అందులో నుంచి వస్తున్నవాళ్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం జీకేను ఆశ్చర్యపరిచింది. ఆసక్తితో లోనికి వెళ్లాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పక్క నున్న వ్యక్తి జీకే భుజం మీద చేయివేసి ‘‘తమ్ముడూ... నాపేరు తోటరాముడు. నాకు ఒక బుల్లి చెల్లి ఉంది అనే కవిత రాసింది నేనే. నిన్ను చూస్తే నా సొంత తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు. నీకు కల్లు తాగించాలని డిసైడ్ చేసిన’’ అని, ‘‘రెండు సీసాల కల్లు’’ అంటూ అరిచాడు. దాహంతో ఉన్న జీకే రెండు కాదు, ఏకంగా ఇరవై సీసాల కల్లు తాగేశాడు. ‘‘గాడ గూసోని కల్లు తాగుతున్నది నా కజిన్ బ్రదరే. వాడే నా బిల్లు, వాడి బిల్లు రెండూ కడతడు’’ అని క్యాషియర్‌కి చెప్పి మాయమైపోయాడు తోటరాముడు. ‘‘దుకాణం బంద్ చేస్తున్నాం. లేచి బిల్లు కట్టు’’ అన్నాడు క్యాషియర్. జీకేకు అర్థం కాలేదు. ‘ఆకాశం నుంచి కిందికి వచ్చాను’ అని సైగలు చేశాడు. ‘‘బిల్లు అడిగితే చుక్కలు చూపెడుతున్నడు. వీడి బట్టలు విప్పి బజారు పాలు చేయండి’’ అని అరిచాడు క్యాషియర్. ఇద్దరు వచ్చి జీకే చొక్కా చించేశారు. వెంటనే ఇద్దరూ గట్టిగా అరిచారు, ‘‘అన్నా వీడి నడుము మీద ఏదో మెరుస్తుంది’’ అని. క్యాషియర్ పరిగెత్తుకు వచ్చాడు.‘‘ఇది డైమండ్ వడ్డాణం. దాన్ని నొక్కేసి వీడిని గప్‌చుప్‌గా ఎక్కడైనా పడేసి రండి’’ అన్నాడు. మరుసటి రోజు: సత్యం థియేటర్ ముందు ఉన్న మురికికాలువ పక్కన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు జీకే. చుర్రుమని ఎండ తగలడంతో లేచి చూచాడు. తలంతా భారంగా ఉంది. కళ్లు మండు తున్నాయి. ‘వామ్మో... ఈ భూగ్రహం మీద ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రిమోట్ నొక్కి వెంటనే మా గ్రహానికి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి’ అనుకుంటూ నడుం తడుముకున్నాడు. ఖాళీ!!! ‘ఓరి నాయనో’ అని అరుస్తూ ఆకాశం కేసి చూశాడు జీకే. కన్నపేగు కదిలి గాఢ నిద్రలో ఉన్న పీకే టక్కుని లేచాడు. ‘నా సన్... నాయనో అని పిలిచినట్లు వినిపించింది. నాలాగే రిమోట్ పోగొట్టు కుని ఉంటాడు’ అనుకుంటూ కొడుకు జాడ కోసం స్పేస్‌షిప్ ఎక్కి అర్జంటుగా భూగ్రహానికి పయనమాయ్యడు పీకే! - యాకూబ్ పాషా -
మాడ్రిడ్ నగర దత్తపుత్రుడెవరు?
మాదిరి ప్రశ్నలు 1. 2014 అక్టోబర్ 17న భారతదేశం ప్రయోగించిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి? 1) బ్రహ్మోస్ 2) అస్త్ర 3) శౌర్య 4) నిర్భయ్ 2. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం పొందిన స్టీఫాన్ హెల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? 1) నార్వే 2) జర్మనీ 3) యూకే 4) యూఎస్ఏ 3. సీఎమ్సీ ఏ సంస్థలో విలీనం కానుంది? 1) ఇన్ఫోసిస్ 2) విప్రో 3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4) హెచ్‌సీఎల్ 4. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఎవరు నియమితులయ్యారు? 1) కౌశిక్ బసు 2) రాకేష్ మోహన్ 3) అరవింద్ మాయారం 4) అరవింద్ సుబ్రమణియన్ 5. 2014 అక్టోబర్‌లో జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు? 1) పూర్వాషా షిండే 2) జాను 3) జ్యోతి సురేఖ 4) సుప్రియ 6. 2014 అక్టోబర్‌లో ఖలేద్ బాహా ఏ దేశానికి ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు? 1) యెమెన్ 2) సిరియా 3) టర్కీ 4) బహ్రేన్ 7. సుల్తాన్ జొహార్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? 1) ఫుట్‌బాల్ 2) హాకి 3) బ్యాడ్మింటన్ 4) ఆర్చరీ 8. {పపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) అక్టోబర్ 14 2) అక్టోబర్ 15 3) అక్టోబర్ 16 4) అక్టోబర్ 17 9. రిజర్వ బ్యాంక్ ఇటీవల జారీ చేసిన మార్గ దర్శక సూత్రాల ప్రకారం ఎన్నేళ్లు నిండిన బాలబాలికలు సేవింగ్స బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు? 1) 10 2) 12 3) 15 4) 16 10. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) జెనీవా 2) ప్యారిస్ 3) వాషింగ్టన్ 4) వియన్నా 11. ఏ దేశ రాజ్యాంగ కోర్టు ఇంగ్లక్ షినవత్రాను ప్రధాని పదవి నుంచి తొలగించింది? 1) సింగపూర్ 2) మలేషియా 3) జపాన్ 4) థాయ్‌లాండ్ 12. భారతీయ మహిళా బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైంది? 1) 1,000 కోట్లు 2) 500 కోట్లు 3) 2,000 కోట్లు 4) 1,500 కోట్లు 13. థామస్ కప్ ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని ఇటీవల ఏ నగరంలో నిర్వ హించారు? 1) హైదరాబాద్ 2) కోల్‌కతా 3) ముంబై 4) న్యూఢిల్లీ 14. భారతదేశ ప్రప్రథమ ఓటర్ శ్యాం శరణ్ నేగి ఏ రాష్ట్రానికి చెందినవారు? 1) హర్యానా 2) ఉత్తరప్రదేశ్ 3) హిమాచల్ ప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్ 15. ఫోర్బ్స మ్యాగజీన్ ‘గ్లోబల్ 2000’ జాబితా ప్రకారం భారత్‌లో అతి శక్తివంతమైన కంపెనీ? 1) రిలయన్స ఇండస్ట్రీస్ 2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3) టాటా మోటార్స 4) కోల్ ఇండియా లిమిటెడ్ 16. 2014 మేలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ? 1) డెమోక్రటిక్ అలయన్స 2) ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 3) ద ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స పార్టీ 4) ఏదీకాదు 17. 2014 మే 3న మరణించిన గ్యారీ బెకర్‌కు 1992లో ఏ విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది? 1) భౌతిక శాస్త్రం 2) రసాయన శాస్త్రం 3) ఆర్థిక శాస్త్రం 4) సాహిత్యం 18. 2014 మే 8న లూయీ గిలెర్మో సోలిస్ ఏ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు? 1) చిలీ 2) కోస్టారికా 3) పెరూ 4) పరాగ్వే 19. మాడ్రిడ్ నగరం ఇటీవల ఏ టెన్నిస్ క్రీడాకారుడిని తన దత్తపుత్రుడిగా ప్రకటించింది? 1) నోవాక్ జొకొవిచ్ 2) రఫెల్ నాదల్ 3) రోజర్ ఫెదరర్ 4) ఆండీ ముర్రే 20. 2014 మే 6న లలిత్ మోడీ ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? 1) రాజస్థాన్ 2) హర్యానా 3) గుజరాత్ 4) పంజాబ్ 21. అబూజా ఏ ఆఫ్రికా దేశానికి రాజధాని? 1) అల్జీరియా 2) సెనెగల్ 3) నైజీరియా 4) సోమాలియా 22. ఫెడరల్ పార్లమెంట్ అని ఏ దేశ పార్లమెంట్‌ను పిలుస్తారు? 1) ఆస్ట్రేలియా 2) పాకిస్థాన్ 3) బ్రెజిల్ 4) రష్యా 23. జకార్తా నగరానికి పాతపేరు? 1) పర్షియా 2) బటావియా 3) మలయా 4) సైగోన్ 24. రియో డి ల ప్లాటా నది ఏ ఖండంలో ప్రవహిస్తుంది? 1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా 3) ఆస్ట్రేలియా 4) యూరప్ 25. చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఉత్తరాఖండ్ 3) మహారాష్ట్ర 4) ఉత్తర ప్రదేశ్ 26. 1915లో ‘గీతా రహస్య’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) మహాత్మాగాంధీ 2) గోపాలకృష్ణ గోఖలే 3) బాల గంగాధర్ తిలక్ 4) అరబిందో ఘోష్ 27. వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1) జూలై 1 2) జూన్ 4 3) జూన్ 21 4) మే 18 28. అంజద్ అలీఖాన్‌కు ఏ సంగీత వాయిద్యంతో సంబంధం ఉంది? 1) వీణ 2) వయోలిన్ 3) సరోద్ 4) తబలా 29. రోలాండ్ గారోస్ స్టేడియం ఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు సంబంధించింది? 1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) ఫ్రెంచ్ ఓపెన్ 3) వింబుల్డన్ 4) మొనాకో ఓపెన్ 30. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? 1) కర్ణాటక 2) గుజరాత్ 3) మహారాష్ట్ర 4) ఉత్తరప్రదేశ్ 31. 2014 గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతికి ఎంపికైన రమేష్ అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందిన పర్యావరణ కార్యకర్త? 1) ఒడిశా 2) జార్ఖండ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) గుజరాత్ 32. ఇప్పటివరకూ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా పనిచేయలేదు? 1) స్వీడన్ 2) ఆస్ట్రియా 3) ఈజిప్ట్ 4) అమెరికా 33. టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో లేని భారతీయుడు? 1) నరేంద్ర మోడీ 2) అరవింద్ కేజ్రీవాల్ 3) అరుంధతీ రాయ్ 4) అన్నా హజారే 34. ఇంగ్లండ్‌కు చెందిన ఎమ్మా బొన్నీ ఏ క్రీడలో మహిళల విభాగంలో ప్రపంచ ఛాంపియన్? 1) స్క్వాష్ 2) బిలియర్డ్స 3) రెజ్లింగ్ 4) టేబుల్ టెన్నిస్ 35. 15వ ఐఫా అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైంది? 1) కరణ్ జోహర్ 2) ఫరాఖాన్ 3) రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా 4) రోహిత్ శెట్టి -
జీకే, వర్తమాన వ్యవహారాలు
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే స్టాక్ జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి. జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు: భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్నాలు, పుష్పాలు, జంతువులు, భౌగోళిక మారుపేర్లు, నదీ తీరాన వెలసిన నగరాలు, అత్యున్నత అంశాలు, ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, కూటములు వంటి వాటిని చదవాలి. గ్రంథాలు-రచయితలు; ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు; ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, వివిధ అధ్యయన శాస్త్రాలు, కల్చర్స్, జాతీయ, అంతర్జాతీయ దినాలు, ప్రపంచ సంస్థల ప్రధాన కార్యాలయాలు, వాటి ప్రస్తుత అధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, భౌగోళిక విషయాలను చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి. కరెంట్ అఫైర్స్- ప్రధాన అంశాలు: రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు వాణిజ్య వ్యవహారాలు శాస్త్ర, సాంకేతిక అంశాలు పర్యావరణం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సంబంధించిన పోటీలు, విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం అంతర్జాతీయ సదస్సులు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆర్థిక సర్వేలు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ర్ట బడ్జెట్ సన్నద్ధత ఎలా? గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధంకావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు. ఇటీవల కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. ఈ అంశం నుంచి వేటిని చదవాలో పరిశీలిస్తే.. కామన్వెల్త్ క్రీడలు తొలిసారి 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. అప్పటి నుంచి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. భారతదేశం తొలిసారిగా 1934లో లండన్‌లో జరిగిన క్రీడల్లో పాల్గొంది. మనదేశం 2010లో క్రీడలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. దాదాపు 4,950 మంది క్రీడాకారులు 18 క్రీడలలో 261 అంశాల్లో పాల్గొన్నారు. మొత్తం 71 జట్లు పాల్గొన్నాయి. భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు పాల్గొఇంగ్లండ్ జట్టు 58 బంగారు, 59 రజత, 57 కాంస్య పతకాలతో మొత్తం 174 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్ 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. మన దేశం 64 పతకాలు సాధించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. వీటిలో 15 స్వర్ణ పతకాలు, 30 వెండి, 19 కంచు పతకాలు ఉన్నాయి. భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో సంజితా చాను సాధించిపెట్టింది. మన దేశానికి బంగారు పతకాలు లభించిన విభాగాలు.. రెజ్లింగ్ (5), షూటింగ్ (4), వెయిట్ లిఫ్టింగ్ (3), స్క్వాష్ (1), బ్యాడ్మింటన్ (1), అథ్లెటిక్స్ (1).అభినవ్ బింద్రా, అపూర్వి చందేలా జీతురాయ్, రాహి సర్నోబత్ షూటింగ్లో స్వర్ణాలు సాధించగా, సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ రెజ్లింగ్‌లో, వికాస్ గౌడ్ డిస్కస్ త్రోలో పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాలు సాధించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ మారే అవకాశం ఉందా? ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వెలువడొచ్చు? -కిరణ్, షాద్‌నగర్. ప్రస్తుతానికి మాత్రం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉండొచ్చు. గతంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మూడు వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇందులో కొన్ని డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ హైదరాబాద్‌లో పరిధిలోనివి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం లభిస్తుంది. కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన ఎత్తు ఎంత? -శ్రీను, మహబూబ్‌నగర్. సాధారణంగా కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ రెండేళ్ల పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది. వయసు: 22ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. ఎత్తు విషయానికొస్తే.. పురుషులు-167.6 సెం.మీ., మహిళలు-152.5 సెం.మీ. ఉండాలి. అదేవిధంగా పురుషుల ఛాతీ 81.3 సెం.మీ. ఉండి గాలి పీలిస్తే-5 సెం.మీ. పెరగాలి. ఎంపిక ప్రక్రియలో ఉండే రెండో దశ.. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు ఉన్న వారిని మాత్రమే తర్వాతి దశకు అనుమతిస్తారు. పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధించి అర్హత ఈవెంట్ అయిన 5 కి .మీ.ను ఏవిధంగా ప్రాక్టీస్ చేయాలి? -రవీందర్, మెదక్. పోలీస్ కానిస్టేబుల్ ఎంపికప్రక్రియలో కీలకమైంది. 5 కి.మీ. పరుగు. దీన్ని ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్‌గా పేర్కొంటారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే రెండో దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిర్దేశించిన దూరాన్ని.. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ.ల దూరాన్ని 16 నిమిషాల్లో చేరుకోవాలి. ఈ ఈవెంట్‌ను ప్రాక్టీస్ చేసేటప్పడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవి..పరుగెత్తేటప్పుడు స్పోర్ట్స్ షూ, కాన్వాస్ షూ వాడాలి. పలుచని కాటన్ సాక్స్ ధరించాలి. బూట్లు లేకుంటే కాలివేళ్లకు, పాదాలకు కాటన్ ప్లాస్టర్ చుట్టాలి. ప్రతిరోజు 5 కి.మీ. లేదా కనీసం 2 కి.మీ. అయిన పరుగెత్తాలి. వారానికి ఒకసారి 5 కి.మీ. స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఎన్ని సెకన్లలో పూర్తిచేశారో రికార్డు చేసుకుని 5 కి.మీ. పరుగుకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు పెట్టుకోవడం సరికాదు. ఆక్సిజన్ అవసరం కాబట్టి కేవలం ముక్కుతోపాటు నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. కాలి అంగలు ఎలా వీలైతే అలా వేయాలి. పరుగులో కండరాలను, పిడికిలిని గట్టిగా బిగించకూడదు. ఉపరితలం మెత్తగా ఉన్న దారిలోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. పోటికి రెండు రోజుల ముందు రెస్ట్ తీసుకోవాలి. లైట్ ఎక్సర్సైజ్లకు మాత్రమే పరిమితం కావాలి. ఇన్పుట్స్: ఉపేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.