Glass House
-
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్‌లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటక జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్, స్కూలు బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో పాటు అది పాత భవనం కావడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
గ్లాస్ హౌస్ సెంటర్లో అగ్నిప్ర్రమాదం
-
గ్లాస్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
రాజాం సిటీ: పట్టణంలోని శ్రీనివాస కాంప్లెక్స్ వద్ద గ్లాస్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాపు యజమాని, ఇద్దరు వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాంలోని శ్రీనివాస థియేటర్ రోడ్డులో శ్రీనివాస కాంప్లెక్స్‌లో సాయిరాం గ్లాస్‌హౌస్‌ను రాజాంకు చెందిన బూరాడ బాలకృష్ణ నడుపుతున్నారు. ఈ షాపులో అన్ని రకాల ప్లేవుడ్, హార్డ్‌వేర్, పెయింటింగ్ సామగ్రి, గ్లాస్ వస్తువులు విక్రయిస్తుంటారు. ఆర్డర్ల ప్రకారం కొత్తవస్తువులను గాజుతో తయారుచేస్తుంటారు. శనివారం రాత్రి షాపు యజమానితోపాటు వర్కర్లు పైల రామ్మోహన్, పైల జగన్నాథలు షాపు షట్టర్లు వేసి లోపల పనిలో నిమగ్నమయ్యారు. రాత్రి రెండు గంటల తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి దాటిన సమయం కావడంతో ప్రమాద తీవ్రతను ఇతరులు గుర్తించలేకపోయారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు బయటకు రాలేక ఆర్తనాదాలు పెట్టారు. ఓ వైపు మంటలు అధికమవడంతో గ్లాస్ సామగ్రి, పెయింటింగ్ సామగ్రి కాలిపోయి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మూసి ఉన్న షట్టరు ఎగిరిపడి ఎదురుగా మరోషాపు షట్టర్‌ను బలంగా ఢీకొట్టింది. భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కలవారు భయభ్రాంతులకు గురయ్యారు. కాసేపటికి తేరుకొని శ్రీనివాస కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. ఇంతలో షాపులో ఉన్న బాధితులు బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే బాధితులు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. బయటకు వస్తూనే వీరు 108 వాహనానికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సపర్యలు చేయడంతోపాటు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత 108 అంబులెన్సులో బాధితులను రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నా పూర్తి వివరాలు మాత్రం బయట పడలేదు. ఈ ఘటనలో రూ. 20 లక్షలు మేర ఆస్తినష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి గురైన ముగ్గురూ స్థానికంగానే నివాసం ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ సుగుణాకరరావు తెలిపారు. -
‘గ్లాస్‌హౌస్’ను కూల్చేశామని కోర్టుకు చెప్పిన ఎన్‌ఎంఎంసీ
ముంబై: నవీముంబైలోని సిడ్కో ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ‘గ్లాస్‌హౌస్’ను కూల్చివేశామని నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌ఎంఎంసీ) కమిషనర్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. సిడ్కో నో డెవలప్మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి గణేశ్ నాయక్ అల్లుడు సంతోష్ తాండేల్ బేలాపూర్‌లో ఓ గ్లాస్‌హౌస్‌ను అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గతంలో స్పందించిన కోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాల్సిందిగా ఎన్‌ఎంఎంసీని ఆదేశించింది. కాగా గ్లాస్ హౌస్‌ను కూల్చివేయడంలో ఎన్‌ఎంఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సందీప్ ఠాకూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలకు ఎన్‌ఎంఎంసీ కమిషనర్ అబాసాహెబ్ లింబాజీ జర్హాద్ సమాధానమిస్తూ.. సదరు బంగ్లాను కూల్చివేశామని, నో డెవలప్ మెంట్ జోన్‌గా ప్రకటించిన స్థలంలో ప్రస్తుతం ఎటువంటి నిర్మాణం లేదని కోర్టుకు తెలిపారు. -
‘గ్లాస్‌హౌస్’ను కూల్చేశామని కోర్టుకు చెప్పిన ఎన్‌ఎంఎంసీ
ముంబై: నవీముంబైలోని సిడ్కో ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ‘గ్లాస్‌హౌస్’ను కూల్చివేశామని నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌ఎంఎంసీ) కమిషనర్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. సిడ్కో నో డెవలప్మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి గణేశ్ నాయక్ అల్లుడు సంతోష్ తాండేల్ బేలాపూర్‌లో ఓ గ్లాస్‌హౌస్‌ను అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గతంలో స్పందించిన కోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాల్సిందిగా ఎన్‌ఎంఎంసీని ఆదేశించింది. కాగా గ్లాస్ హౌస్‌ను కూల్చివేయడంలో ఎన్‌ఎంఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సందీప్ ఠాకూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలకు ఎన్‌ఎంఎంసీ కమిషనర్ అబాసాహెబ్ లింబాజీ జర్హాద్ సమాధానమిస్తూ.. సదరు బంగ్లాను కూల్చివేశామని, నో డెవలప్ మెంట్ జోన్‌గా ప్రకటించిన స్థలంలో ప్రస్తుతం ఎటువంటి నిర్మాణం లేదని కోర్టుకు తెలిపారు.