
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటక జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సూపర్ మార్కెట్‌లో ప్లాస్టిక్, స్కూలు బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో పాటు అది పాత భవనం కావడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment