global hunger index
-
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దేశంలో ఆకలి కేకలు ఆగాలంటే...
దేశానికి ‘స్వాతంత్య్రం’ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరించటంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి. కూడు, గూడు, గుడ్డ లేక పేదలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కోట్లాది మంది పేదలు ఆహారం కోసం హాహా కారాలు చేస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) భారత స్థానం దిగజారుతూ వస్తున్నది. 2021లో 101 స్థానంలో ఉండగా 2022లో 107వ స్థానానికి దిగజారింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 121 దేశాలు ఉన్నాయి. వీటిల్లో చైనా, టర్కీ, కువైట్ సహా 17 దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్‌కి చెందిన ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్త్ హంగర్ హైఫ్’ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఈ 121 దేశాల్లో ఆసియా ఖండంలో భారతదేశం కంటే అఫ్గానిస్తాన్ మాత్రమే వెనకబడి ఉంది. పాకిస్తాన్ 99, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, శ్రీలంక 64 స్థానాల్లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2020లో గ్లోబల్ ఇండెక్స్ స్కోర్ 38.8గా ఉండి నేడు 29.1గా నమోదు అయ్యింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ప్రపంచ స్థాయిలో, రీజనల్ స్థాయిలో ఆకలిస్థాయిని వెల్లడిస్తుంది. 29.17 స్కోర్‌తో భారతదేశం ‘అత్యంత సీరియస్’ అన్న లేబుల్ పొందింది. ఆసియా రీజియన్‌లోనూ, మొత్తం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆకలి స్థాయిలో భారత్ ఉందని నివేదిక వెల్లడించింది. జీహెచ్ఐ నివేదికను పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 100 పాయింట్ స్కేల్లో లెక్కిస్తారు. సున్నా వస్తే ఉత్తమ (ఆకలి లేదు) స్కోర్, 100 వస్తే చెత్త స్కోర్, అంటే ఆకలి బాగా ఎక్కువగా ఉండటంగా పరిగణిస్తారు. దేశంలో పోషకాహార లోపం 2018–20లో 140 శాతం ఉంటే 2019–21 నాటికి 163 శాతానికి పెరిగింది. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న జనాభా 828 మిలియన్లు ఉంటే, ఇండియాలోనే 224.3 మిలియన్ల మంది ఉన్నారు. 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన నివేదికలో భారతదేశంలో 22.4 కోట్ల మంది పోషకాహారం లభించక బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్ల లోపు వయస్సుగల మహిళలు 51 శాతం అని నివేదిక పేర్కొన్నది. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్ నివేదిక ప్రకారం 5 ఏళ్ల లోపు 69 శాతం పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 4.66 కోట్ల మంది వయస్సుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. 5 నుంచి 23 సంవత్సరాల లోపు పిల్లల్లో కేవలం 10 శాతం మందికే పోషక విలువలు గల ఆహారం లభిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా తెలుపుతున్నది. భారతదేశంలో 20 కోట్లకు పైగా వలస కార్మికులు ఉన్నారు. వీరు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మరో 20 కోట్ల మంది దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. కనీస ఆదాయం లేక 23 కోట్ల మంది రోజు వారీ కూలీలు, చిరు వ్యాపారులు... పస్తులు, అర్ధాకలితో జీవిస్తున్నారు. భారత ఆహార సంస్థ గోదాముల్లో ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నా పేదలకు, అన్నార్తులకు అందించకపోవటం ఏమిటని సుప్రీమ్ కోర్టు అనేక సార్లు ప్రశ్నించింది. గోదాముల్లో 7.10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో 40 వేల టన్నుల ఆహార ధాన్యాలు పాడై పోయాయి. దీన్ని గమనిస్తే ఆహార ధాన్యాలు పాడైనా ఫరవాలేదు, పేదలకు మాత్రం పంపిణీ చేయం అన్నదే పాలకుల విధానంగా ఉంది. దేశం అభివృద్ది బాటలో పయనిస్తున్నదనీ, ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా ఎగుమతి చేసే స్థాయిలో ఉందనీ మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేంద్రం చెబుతున్న దానికీ, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకూ పొంతన లేకుండా ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రైతాంగం అధిక సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు. కోటి 40 లక్షల మంది రైతులు వ్యవసాయం నుంచి ఎందుకు వైదొలిగారు? ఆహార ధాన్యాల ఎగు మతిదారుగా భారత్ ఉంటే రైతాంగం ఎందుకు వ్యవసాయం నుంచి వైదొలుగుతున్నారు? నేటికీ దేశంలో 27 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితుల ఎందుకు ఉన్నాయి? దేశంలో పండిన పంటలను దేశ అవసరాలకు ఉపయోగించినప్పుడే ఏ దేశమైనా స్వావలంబన సాధించినట్టు చెప్పవచ్చు. ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెడుతుంటే, వారి ఆకలి తీర్చకుండా ఎగుమతులు చేయటం స్వావలంబన సాధించటం కాదు. దేశ ప్రజల పేదరికానికీ, వారి ఆకలి ఆర్తనాదాలకూ దేశ పాలకులు అమలు జరిపిన విధానాలే కారణం. సామ్రాజ్యవాదం, బడా బూర్జువా, భూస్వామ్య వర్గంతో లాలూచి పడిన పాలక ప్రభుత్వాలన్నీ దేశ సహజ వనరులన్నిటినీ వారికి కట్టబెడుతూనే ఉన్నారు. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతూ వచ్చాయి. ఈ పరిస్థితి మారాలంటే... సహజ వనరులన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టాలి. పారిశ్రామిక అభివృద్ధిలో పాత్రధారులైన కార్మికులకూ పరిశ్రమల్లో హక్కు కల్పించాలి. అలాగే గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. అప్పుడే దేశంలో ఆకలి కేకలు ఆగిపోతాయి. (క్లిక్: సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (ఏపీ) -
Global Hunger Report 2022: ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి. నివేదిక ఏం చెప్పిందంటే... ► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది. ► జీహెచ్ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. ► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి. ► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది. ► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి. ► భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. విరుచుకుపడిన విపక్షాలు దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు. -
ఆకలి సూచీలో మరీ అధ్వాన్నంగా భారత్
న్యూఢిల్లీ: ఆకలి సూచీలో మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. 2022 ఏడాదికిగానూ భారత్ 107వ స్థానంలో నిలిచింది. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. మన పొరుగు దేశాలు శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మన దేశం కన్నా ముందు ఉండడం గమనార్హం. చైనా, టర్కీ, కువైట్.. జీహెచ్ఐ ఇండెక్స్‌లో అత్యంత మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. ఇక దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న ఆకలి కేకల ఘంటికలను ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. మన దేశంలో.. చైల్డ్ వేస్టింగ్ రేటు 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ► గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. ► ఐరిష్‌కు చెందిన ఎయిడ్ ఏజెన్సీ ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన సంస్థ ‘వెల్ట్ హంగర్ లైఫ్’లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ► పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్ వేస్టింగ్, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జీహెచ్ఐలో స్కోరు ఇస్తారు. ► ఈ స్కోర్లు ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. ► భారత్‌కు 29.1 శాతం స్కోరుతో తీవ్రమైన ప్రభావిత దేశాల జాబితాలో నిలిచింది. ► భారత్‌లో చైల్డ్ వేస్టింగ్ రేట్ (వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం) 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ఉంది. ► 2021లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థౠనంలో నిలిచింది. ఇప్పుడు 121 దేశాల జాబితాలో 107వ ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ► ఇక భారత్ GHI స్కోర్ కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 నుంచి 2014-2022 మధ్య 28.2 - 29.1 పరిధికి పడిపోయింది స్కోర్. -
హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
"అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాలు జాబితాలో భారత్ 101వ స్థానంకు పడిపోయింది. గతేడాది పాకిస్తాన్‌తో సహా ఇతర పొరుగు దేశాల కంటే మెరుగ్గా భారత్ 94వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్.. ప్రధాని నరేంద్ర మోదీ పై ధ్వజమెత్తారు. పేదరికం, ఆకలి నిర్మూలన కంటే కూడా భారతదేశాన్ని గొప్ప ప్రపంచ శక్తిగా మార్చే పనిలోనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") 'అభినందనలు మోదీజీ' భారత్ దేశం చాలా గొప్ప స్థాయిలో ఉందంటూ మోదీ పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఈ మేరకు భారత్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోరు కూడా పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ (76), బంగ్లాదేశ్ (76), మయన్మార్ (71) పాకిస్తాన్ (92) స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఆయా దేశాలు ఆందోళనకర స్థాయిలో ఆకలి ఉన్నట్లు వెల్లడించింది. అయితే భారత్ కోవిడ్ -19 దృష్ట్య తీసుకున్న కఠిన ఆంక్షల ఫలితంగా పిల్లల మరణాల రేటు తగ్గడమే కాక పోషకాహార లోపాన్ని కూడా మెరుగుపర్చిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ‘పీపీఈ’ డ్యాన్స్ చూశారా.. భలే ఉందే!) -
ఇదేనా పురోగతి!
గతంతో పోలిస్తే కొంత మెరుగయ్యామని సంతోషించాలో... చాలా వెనకబడిన దేశాలతో పోల్చినా మరింతగా వెనకబడ్డామని బాధపడాలో తెలియని స్థితి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో మన దేశం ఈసారి 94వ స్థానంలో వుంది. నిరుడు 102వ స్థానంలో వున్నాం గనుక ఇప్పుడున్న స్థితికి సంతోషించాలని కొందరు చెబుతున్నారు. కానీ ఆకలి సమస్య చాలా తీవ్రంగా వున్న దేశాల సరసనే ఇప్పటికీ మనం వున్నామని గుర్తుంచుకోవాలి. వివిధ అంశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం ఒక దేశం ఎలా వుందన్నదే ఈ ఆకలి సూచీకి ప్రాతిపదిక. అలా చూసుకుంటే నిరుడు మన స్కోరు 30.3 దగ్గరుంటే ఇప్పుడది 27.2కు దిగింది. అంటే ఎంతో కొంత మెరుగు పడ్డామని చెప్పుకోవాలి. కానీ ఆ స్కోరు తగ్గినంత మాత్రాన మనం ఆకలి సమస్య తీవ్రత పరిధి నుంచి బయటకు రాలేదు. పౌష్టికాహారలోపం, అయిదేళ్లలోపు పిల్లలు తగిన ఎత్తు లేకపోవడం లేదా ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే మరణాలు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ఆకలిసూచీని రూపొందిస్తున్నారు. ఇది వెల్లడైనప్పుడల్లా రాజకీయ పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, అధికారంలో వున్నవారిని విపక్షం విమర్శించడం... మీరుండగా ఏం చేశారని అధికార పక్షం ఎదురు ప్రశ్నించడం రివాజుగా మారింది. 2018లో 103వ స్థానంలో వున్న మనం నిరుడు 102కి, అక్కడినుంచి ఈ ఏడాది 94కు వచ్చామన్నది నిజమే. కానీ 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాలని ఐక్యరాజ్యసమితి 2015లో తీర్మానించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలి మంటల్ని ఆర్పడం ఒకటని మనం మర్చిపోకూడదు. ఇతర లక్ష్యాల మాటెలావున్నా ఆకలిని తరిమికొట్టడంలో మన పురోగతి మందకొడిగా వున్నదని ఏటా వెలువడుతున్న జీహెచ్ఐ నివేదికలు చాటుతున్నాయి. ఎంత మందకొడి అంటే... మన పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ల కన్నా కూడా మనం ఎంతో వెనకబడివున్నాం. అవి కూడా మనతోపాటు ఆకలి సమస్య తీవ్రంగా వున్న దేశాల వరసలోనే వున్నాయి. కానీ గతంతో పోలిస్తే వివిధ అంశాల్లో మెరుగయ్యాయి. మనమూ, సుడాన్ ఒకే స్థానంలో వున్నాం. కేవలం చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ దేశాలు మాత్రమే తాజా సూచీలో అన్నిటికన్నా ఉత్తమంగా నిలిచాయి. ప్రపంచంలో ఒకపక్క శ్రీమంతుల జాబితా ఏటా పెరుగుతోంది. దానికి సమాంతరంగా, సమానంగా ఇటు ఆకలిమంటలు కూడా విస్తరిస్తున్నాయి. 2017లో దాదాపు 9 లక్షల కోట్ల డాలర్లున్న ప్రపంచ కుబేరుల సంపద ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల డాలర్లకు చేరువవుతోందని స్విట్జర్లాండ్‌లోని సంస్థలు లెక్క చెబుతున్నాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే 2017లో 2,158మంది శ్రీమంతు లుంటే ఇప్పుడు ఆ సంఖ్య 2,189కి పెరిగింది. రంగాలవారీగా చూస్తే టెక్, హెల్త్‌కేర్, పారిశ్రామిక రంగాలు ఆ సంపదకు కారణమవుతున్నాయి. ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి పర్యవ సానంగా ఈ రంగాలే మున్ముందు కూడా కాసులు కురిపిస్తాయి. వారిని మరింత కుబేరుల్ని చేస్తాయి. ఇటీవలే వెలువడిన ప్రపంచ బ్యాంకు నివేదిక ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేదరికంలోకి జారుకునేవారి సంఖ్య బాగా పెరుగుతుందని ప్రకటించింది. కొత్తగా 11 కోట్ల 50 లక్షలమంది దారిద్య్ర రేఖకు దిగువన చేరతారని ఆ నివేదిక అంచనా వేస్తోంది. ఇదిగాక ఆదాయం తీవ్రంగా పడిపోవడం, అప్పులబారిన పడటం పర్య వసానంగా ఇప్పటికే అమలవుతున్న అనేక కార్యక్రమాలకు ప్రభుత్వాలు కేటాయింపుల్ని తగ్గించక తప్పదు. కనుక ఆ పరిధిలో వుంటూ పేదరికాన్ని జయిస్తున్నవారు కూడా చేయూత లేక చిక్కుల్లో పడతారు. ఏతావాతా ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో ఇప్పుడున్న ర్యాంకులు వచ్చే ఏడాది ఆకలి సూచీనాటికి మరింత దారుణంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఈ ఏడాది పేదరికం బాగా తగ్గి, అది 7.9 శాతానికి చేరుతుందని కరోనా వైరస్ పంజా విసరడానికి ముందు నిపుణులు లెక్కేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం అది 9.4 శాతం వుంటుందని వారు అంచనా వేస్తున్నారు. మన దేశంలో విధానాలకు కొదవలేదు. పథకాలు, వాటి పేర్లు కూడా ఘనంగా వుంటాయి. అమలుపరచడానికొచ్చేసరికి అంతా అస్తవ్యస్థమవుతోంది. కొన్ని అంశాల్లో దృష్టి కేంద్రీకరించి పనిచేయడం, ఫలితం సాధించడం సాధ్యమవుతున్నా... మరికొన్నిటిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన బడుతోంది. అలాగే సాధిస్తున్న ప్రగతి అంతటా ఒకేవిధంగా వుండటంలేదు. కొన్ని రాష్ట్రాలు ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి. వాటి లోపాలు సరిదిద్దడంలో, పరుగులెత్తించడంలో తగిన పర్య వేక్షణ కొరవడుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌వంటి అధిక జనాభావున్న పెద్ద రాష్ట్రాలు పనితీరును మెరుగుపరుచుకుంటే ప్రపంచ సూచీలో మన పరిస్థితిలో కాస్త పురోగతి కనబడే అవకాశం వుంటుంది. ఈ రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం తీవ్రత ఎక్కువుంది. దేశంలో పుట్టే ప్రతి అయి దుగురు శిశువుల్లోనూ ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కనుక పౌష్టికాహార లోపాన్ని ఆ రాష్ట్రం సరిచేసుకోనట్టయితే అది మొత్తం మన ర్యాంకును ప్రభావితం చేస్తుంది. పిల్లలకు సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం చవగ్గా అందించడం, మాతా శిశు సంరక్షణ పథకాలను బాగా అమలు చేస్తూ బిడ్డ కడుపులో పడినప్పటినుంచీ మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తల్లికి అందేలా చూడటం, పుట్టినప్పటినుంచి బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందించడం వగైరాలు చేస్తేనే తక్కువ బరువుండటం, ఎత్తు తక్కువగా వుండటం, పసి వయసులోనే మృత్యువాత పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే, అందుకు అనువుగా పథకాలు రూపకల్పనచేసి, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తేనే దేశం శక్తిమంతమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కదలాలి. -
భారత్‌లో ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్రతరమయ్యాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ఈ ఏడాది నివేదికను తన వెబ్సైట్లో ఉంచింది. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు. ► భారత్ (94 ర్యాంకు), బంగ్లాదేశ్ (75), మయన్మార్ (78), పాకిస్తాన్ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది ► నేపాల్ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి. ► గత ఏడాది 117 రాష్ట్రాలకు భారత్ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది. ► భారత్‌లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి. ► అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3% మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7%మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలో ఈ పరిస్థితికి కారణాలివీ.. ► అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు ► ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ► పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం ► ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ► నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు ఆ రాష్ట్రాలు దృష్టి పెట్టాలి భారత్‌లో ప్రీమెచ్యూర్ జననాలు, తక్కువ బరువుతో బిడ్డ జన్మించడం వంటివి అధికంగా జరుగుతున్నాయని, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారితేనే ప్రపంచ ఆకలి సూచీలో మన ర్యాంకు మెరుగుపడుతుందని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకి చెందిన సీనియర్ అధ్యయనకారిణి పూర్ణిమ మీనన్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మహిళల్లో విద్య, గర్భస్థ మహిళలకి పౌష్టికాహారం ఇవ్వడం, తల్లి కాబోయే మహిళల్లో పొగాకు తాగే అలవాటుని మానిపించడం వంటివి చేయాలని ఆమె చెప్పారు. -
ఆకలి భారతం
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి తీవ్రత పెరిగింది. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం అట్టడుగు స్థానానికి చేరువలో ఉన్న ట్టు అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. 2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 117 ప్రపంచ దేశాల్లో మన దేశం 102వ స్థానానికి దిగజారిందని వెల్లడించింది. మనకన్నా పేదరికంలో ఉన్న, అత్యంత వెనుకబడి ఉన్న దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకన్నా మనదేశం వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా తయారుచేసిన ఈ నివేదిక భారత్‌లో ఆకలి తీవ్రమైందని హెచ్చరించింది. దేశంలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరని, ఇతర దేశాలకంటే అతి తక్కువ బరువుతో ఉన్నారంది. 2008–12 మధ్య బరువు తక్కువ ఉన్న పిల్లల శాతం దేశంలో 16.5 శాతం ఉండగా, 2014–18కి మధ్య 20.8 శాతానికి దిగజారింది. 2030 కల్లా ఆకలిని జయించేవైపు దేశం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలో మొత్తం 113 దేశాల్లో భారత్ 83 స్థానంలో ఉండగా, 2018లో మొత్తం 119 దేశాల జాబితాలో 103 స్థానంలో ఉంది. నాలుగు అంశాల ఆధారంగా రేటింగ్... గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కేటగిరీలో మన దేశం 30.3 స్కోరుతో ఉంది. ఈ స్కోరుని నాలుగు సూచీలపై ఆధారపడి నిర్ణయిస్తారు. పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉండడం, వయసుకి తగ్గ ఎత్తు ఎదగకపోవడం, శిశు మరణాలు. నివేదిక ముఖ్యాంశాలు ► దేశంలో కేవలం 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న వారిలో 9.6 శాతం మందికి మాత్రమే ‘కనీస ఆహార అవసరాలు’తీరుతున్నాయి. ► భారత్‌లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందనీ, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయంది. ► బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ సహా మొత్తం 17 దేశాలు ఈ సూచీలో 5 కన్నా తక్కువ ర్యాంకుతో ఉన్నత స్థానంలో ఉన్నాయి. ► నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే, తీవ్రమైన వాతావరణ మార్పులతో సతమతమౌతోన్న యెమన్, జిబౌటి దేశాలు సైతం భారత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. ► పొరుగు దేశాలైన నేపాల్(73), శ్రీలంక(66), బంగ్లాదేశ్(88), మయన్మార్(69), పాకిస్తాన్ (94) స్థానంలో ఉండి ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. ► చివరకు చైనా (25) సైతం భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉంది. -
ఆకలి సూచీలో ఆఖరునే..
న్యూఢిల్లీ : అభివృద్ధిలో మున్ముందుకు సాగుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ఇంకా నేలచూపులు చూస్తూనే ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 117 దేశాలకు గాను భారత్ 102వ స్ధానంలో చిట్టచివరి దేశాల సరసన చేరింది. ఆకలి కేకలతో అలమటిస్తున్న 45 దేశాల్లో భారత్ ఒకటని ఈ నివేదిక తేల్చింది. ఈ సూచీలో భారత్ ర్యాంకింగ్ క్రమంగా దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా ర్యాంకింగ్‌తో దక్షిణాసియాలో పాకిస్తాన్ (94), బంగ్లాదేశ్ (88), శ్రీలంక (66)ల కన్నా భారత్ వెనుకబడింది. 2014లో హంగర్ ఇండెక్స్‌లో 77 దేశాల్లో భారత్ 55వ స్దానంలో నిలిచింది. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భారత్‌తో పోలిస్తే దక్షిణాసియాలో నేపాల్, బంగ్లాదేశ్‌లు మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. క్షుద్బాధను సమర్ధంగా తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఈ సూచీని రూపొందిస్తారు. ఆకలి సమస్య తీవ్రంగా పట్టిపీడిస్తున్న 45 దేశాల్లో భారత్ ఒకటని వెల్త్హంగర్లైఫ్ అండ్ కన్సన్ వర్డ్ల్వైడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఆరు నుంచి 23 నెలల చిన్నారుల్లో కేవలం 9.6 శాతం మందికే సరైన మోతాదులో ఆహారం అందుతోందని పేర్కొంది. 2015-16లో 90 శాతం గృహాలకు మెరుగైన తాగు నీరు లభించినా, 39 శాతం మంది గృహస్తులకు పారిశుద్ధ్య సదుపాయాలు లేవని నివేదిక వెల్లడించింది. మరోవైపు భారత్‌లో ఇంకా బహిరంగ మల విసర్జన ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొంది. -
ఆకలి అంతస్తులోనూ మనదే ముందు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆసియాలోనే బలమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకుపోతున్నామని, చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశంగా భారత్ గణతికెక్కుతుందని భావిస్తున్న తరుణంలో అత్యంత దారిద్య్ర దేశంగా అంటే ఆకలిగొన్న దేశంగా భారత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లో భారత్ వందవ స్థానాన్ని ఆక్రమించింది. పిల్లల ఆకలిని నిర్మూలించడంలో మన ఇరుగు, పొరగైన బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలకన్నా వెనకబడి ఉన్నాం. మనకన్నా పాకిస్తాన్ మరింత వెనకబడి ఉందనికొని సంతప్తి పడాలేమో! దేశంలో పిల్లల మరణాలు, వారిలో పౌష్టికాహార లోపాలు, ఎత్తుకుతగ్గ బరువు, వయస్సు తగ్గ పొడువు (ఎదుగుదల)అన్న నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ ఆకలి–సూచికను రూపొందించారు. మొత్తం 119 వర్ధమాన దేశాల్లో అధ్యయనం జరిపి ఈ సూచికను రూపొందించగా భారత్‌కు 100వ స్థానం లభించింది. అన్నింటికన్నా ఆనందించాల్సిన విషయం ఏమిటంటే 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలి శాతం తగ్గుతూ వచ్చింది. ఈ 17 ఏళ్ల ప్రపంచవ్యాప్తంగా సరాసరి 27 శాతం తక్కగా భారత్‌లో 18 శాతం తగ్గింది. 1992 నాటి నుంచి చూస్తే భారత్‌లో ఆకలి శాతం ఎక్కువ తగ్గిందని చెప్పవచ్చు. అప్పడు దేశంలో ఆకలి శాతం 46.2 శాతం ఉండగా, అది 2000 సంవత్సరం నాటికి 38.2 శాతానికి ఇప్పటికీ 31.4 శాతానికి తగ్గింది. 119 దేశాల్లో ఒక్క చైనాలోనే 71 శాతం ఆకలి తగ్గిపోయింది. పిల్లల పోషక విలువల్లో కూడా భారత్ ఇరుగు, పొరుగుకన్నా వెనకబడి పోయింది. -
భారత్‌ను ఉత్తర కొరియా కూడా దాటేసింది..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని చెప్పుకుంటున్నా దారిద్ర్యం మాత్రం భారత్ ప్రతిష్టను ప్రతిసారి మసకబారుస్తూనే ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకు ప్రకారం భారత్ ఉత్తర కొరియా, శ్రీలంక, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉంది. గురువారం అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) ఈ మేరకు ప్రపంచ ఆకలి సూచి పట్టికను ప్రకటించింది. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా పోషకాహారం లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆ నివేదిక పేర్కొంది. 21శాతం ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికహారలోపంతో బాధపడుతుండటంతోపాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది. గతంలో 2016లో 118 దేశాల్లో భారత్‌ది 97 ర్యాంకుకాగా, ఈ ఏడాది మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్‌లు భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి. ఇక ఉత్తర కొరియా కూడా గత ఏడాది కూడా భారత్‌కంటే కింద ఉండి ఈ ఏడాది మాత్రం ఏకంగా 93 ర్యాంకుకు దూసుకెళ్లింది. కాగా, గతంలో మాదిరిగా పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లు మాత్రం భారత్ వెనుకే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 31.4గా ఉంది. ఈ స్కోర్ 28.5కి చేరితే మాత్రం అత్యంత ఆందోళనకరమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. -
ఆకలి రాజ్యం
► భారత్‌లో ఆందోళనకరంగా ఆకలి ప్రపంచ ఆకలి సూచీ వెల్లడి ► దేశంలో 15 శాతం మంది చిన్నారుల అర్థాకలి ► ప్రతి 20 మంది పిల్లల్లో ఒకరు ఐదేళ్ల లోపే మృతి ► భారత్‌కన్నా బంగ్లా, శ్రీలంక, కెన్యా, ఇరాక్‌లే బెటర్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థికవ్యవస్థ భారతదేశం. ప్రపంచ వేదికలపై పాలకులు ఈ విషయాన్ని ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నారు. ఇండియా అతి త్వరలో ‘సూపర్‌పవర్’గా అవతరిస్తుందని ఎంతో ధీమాగా చెప్తున్నారు. కానీ.. అదే సమయంలో దేశంలో పేదల ఆకలి కేకలు పెద్దగా తగ్గుతున్న దాఖలాలు లేవు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పిఆర్ఐ) ఇటీవల విడుదల చేసిన 2016 ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్హంగర్ఇండెక్స్ జీహెచ్ఐ).. మొత్తం 118 దేశాల జాబితాలో భారతదేశం అట్టడుగున 97వ స్థానంలో ఉంది. దేశంలో ఆకలి ఆందోళనకర స్థాయిలో ఉందని ఈ సూచీ చెప్తోంది. ఐదేళ్ల లోపే అర్థంతర మరణం: భారతదేశంలో ఐదేళ్ల వయసు లోపున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పూర్తిగా ఎదగడం లేదు. ప్రతి 20 మందిలో ముగ్గురు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు పెరగడం లేదు. ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు ఐదేళ్లు నిండకముందే చనిపోతున్నారు. దీనికి కారణం వారికి తగినంత ఆహారం లభించకపోవడమే. పొరుగు దేశాలు ఎంతో మెరుగు: ఆకలి సూచీ సర్వే ప్రకారం.. భారత్‌కన్నా కెన్యా, మలావి, ఇరాక్వంటి దేశాల్లో మెరుగైన పరిస్థితి ఉంది. పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్లు కూడా భారత్‌కన్నా మెరుగుగానే ఉంటే.. ఒక్క పాకిస్తాన్మాత్రమే భారత్‌కన్నా కొంత వెనుకబడి ఉంది. ఇక చైనాలో ఆకలి నామమాత్రంగానే ఉంది. భారతదేశం శిశు మరణాల రేటులో కనీసం శ్రీలంక స్థాయిని చేరుకోగలిగితే.. 2016లో జన్మించిన శిశువుల్లో సుమారు 9 లక్షల మంది 2021 లోపే చనిపోకుండా కాపాడవచ్చు. పేదల ఆకలికి లేదు ప్రాధాన్యం దేశంలో పేదల ఆకలి, ప్రజారోగ్యం అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో కానీ, ప్రచారంలో కానీ, పార్లమెంటు లోపల కానీ, వెలుపల కానీ, రాజకీయ పార్టీల విధానాల్లో కానీ, వాదనల్లో కానీ, ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకునే విషయాల్లో కానీ.. పొరుగుదేశంతో సంబంధాలు, ఉగ్రవాదం, అభివృద్ధి, అవినీతి, నల్లధనం వంటి అంశాల స్థాయిలో.. ఈ కీలకాంశాలకు పెద్దగా చోటు లభించడం లేదని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఆదివాసీలు, దళితులే అధికం: ఆహార లోపంతో అలమటిస్తున్న, అర్థంతరంగా చనిపోతున్న చిన్నారుల్లో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, ఇతర వెనుకబడ్డ కులాల వారేనని ఎకానమిక్అండ్పొలిటికల్వీక్లీ 2011లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది. దాని ప్రకారం.. అగ్ర కులాల చిన్నారులతో పోలిస్తే.. ఎదుగుదల లోపం ఆదివాసీ చిన్నారుల్లో 69 శాతం, దళిత చిన్నారుల్లో 53 శాతం, ఇతర వెనుకబడిన కులాల వారిలో 35 శాతం అధికంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: ఇదే ఆకలి సూచీలో 2000 సంవత్సరంలో భారత్‌కన్నా బంగ్లాదేశ్ఒక స్థానం దిగువనే ఉంది. కేవలం 15 సంవత్సరాల్లో భారత్‌ను బంగ్లా ఏడు స్థానాలు అధిగమించి ముందుకు సాగింది. 2000 సూచీలో భారత్‌కన్నా కేవలం ఆరు స్థానాలు మెరుగుగా ఉన్న నేపాల్ఇప్పుడు ఏకంగా 25 స్థానాలు మెరుగుపడింది. కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘భారతదేశపు పోషకాహార సవాళ్లపై ప్రధానమంత్రి మండలి’ని ఏర్పాటు చేసింది. ఆ మండలి దేశంలో పోషకాహారం పరిస్థితిపై పీఎంఓకు త్రైమాసిక నివేదికలు అందించాల్సి ఉంది. కానీ అది ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్కసారి సమావేశమైంది. నాలుగు దశాబ్దాలుగా ఉన్న జాతీయ పోషకాహార పర్యవేక్షణ బ్యూరో (ఎన్‌ఎన్‌ఎంబి)ని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. ఆ సంస్థ పోషకాహార సర్వేలు నిర్వహించినా ఆ నివేదికలను ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలున్నాయి. అన్నార్తుల్లో అగ్రస్థానం... 2015లో ఐక్యరాజ్యసమితి సంస్థలు విడుదల చేసిన ఆహార అభద్రత నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అర్థాకలితో అలమటిస్తున్న వారు అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నారు. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో పాకిస్తాన్ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 79.46 కోట్ల మంది అర్థాకలితో జీవిస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 11 శాతం. సాక్షి నాలెడ్జ్సెంటర్