global meet
-
ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా?
ఢిల్లీలో జరిగిన ఏపీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ మీట్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ చేసిన స్పీచ్ కాని, అక్కడ పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాని గమనిస్తే ఏపీకి ఆశాజనక పరిస్థితులు ఏర్పడుతున్నాయనిపిస్తుంది. జగన్ ముఖ్యంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని బాగా పెంచిందని చెప్పవచ్చు. గతంలో ఇలాంటి సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చీరాని ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటే వినేవారికి చాలా ఇబ్బందిగా ఉండేది. భాష పరిపూర్ణంగా రాకపోవడం తప్పుకాదు. కాని దానికి ప్రత్యామ్నాయంగా ఆయన రిటెన్ స్పీచ్ చదువుతుంటే సరిపోయేది. ఆయన అలా చేయకపోవడమే కాక, సుదీర్ఘంగా మాట్లాడుతుండేవారు. అది పెద్ద,పెద్ద పారిశ్రామికవేత్తలకు విసుగు తెప్పించేదని అంటారు. కాకపోతే మర్యాద కోసం భరించేవారని చెబుతారు. చంద్రబాబు తనకు అన్ని తెలుసునన్నట్లుగా వ్యవహరించేవారు. కాని జగన్ అలా కాకుండా చక్కటి ఆంగ్లంలో అందరిని ఆకట్టుకునేలా మాట్లాడారు. అది ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పారు. ఏపీలో ఉన్న అపార వనరులు, అవకాశాలు, ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వపరంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి వాటిలో నంబర్ వన్‌గా ఉండడం తదితర అంశాలను ఆయన ప్రస్తావించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాను అందుబాటులో ఉంటానని ఆయన అన్ని చోట్ల చెబుతున్నట్లుగానే ఇక్కడా చెప్పారు. మార్చి మొదటివారంలో విశాఖలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అంతా రావాలని ఆయన ఆహ్వానించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి కూడా ఆయన కృతజ్ఞత చెప్పడం ద్వారా తన మెచ్యూరిటీని ప్రదర్శించారు. తద్వారా కేంద్రంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న సంకేతం పంపించారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక సంఘాల ప్రముఖులతో పాటు పలువురు దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత రాకూడదన్న దురుద్దేశంతో తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు వంటి పత్రికలు కాని సీఎం ఢిల్లీ టూర్‌ను వక్రీకరించడానికి యత్నించాయి. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం చేశారు. జగన్ తన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి వెనక్కి వచ్చి, మళ్లీ వెంటనే మరో విమానంలో ఢిల్లీ వెళ్లి, అక్కడ పూర్తి సమయం పారిశ్రామికవేత్తలతో గడిపారు. అదే కనుక ఈ సదస్సుతో పాటు జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్రధాని మోదీని కలిసి ఉంటే, ఇంకేముంది సీబీఐ కేసు గురించే అని విపరీత ప్రచారం చేసేవారు. కాని ఆయన ఎవరిని కలవకుండా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సదస్సులో జగన్‌ను ఆయా ప్రముఖులు ప్రశంసించిన తీరును గమనించండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడమే ఏపీకి పెద్ద ఆస్తి అని ఆసోచామ్ అధ్యక్షుడు సుమంత్ సిన్హా వ్యాఖ్యానించారంటేనే ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఏ రకమైన బాటలు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. అదే చంద్రబాబును కనుక ఇలా మెచ్చుకుని ఉంటే టీడీపీ పత్రికలు బానర్ కథనాలు ఇచ్చి ఉండేవి. వ్యాపార విస్తరణలో ఏపీ ఉత్తమంగా ఉందని క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తమ సంస్థ ఇక్కడ విస్తరణ చేస్తుందని కూడా ఆయన తెలిపారు. తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామని టోరే ఇండస్ట్రీస్ ఎండి ప్రకటించడం కూడా హర్షదాయకం. ఇలా ఒకరు కాదు.. అనేక మంది ప్రముఖులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని జగన్ వివరించారు. ఇలా ఆయా రంగాలకు సంబంధించి విశాఖలో పెట్టుబడుల సద్సులో అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అప్పట్లో టీడీపీ పాలనలో విశాఖలో జరిగిన కొన్ని సదస్సులలో ఎవరిని పడితే వారితో ఒప్పందాలు చేసుకున్నట్లు చూపించారు. తీరా పరిశీలిస్తే అవన్ని ఉత్తిత్తి ఒప్పందాలుగా తేలాయి. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాబోతున్నాయని ఊదరగొట్టారు.. కాని వాటిలో వచ్చినవి అతి స్వల్పం అని చెప్పాలి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని కూడా ప్రచారం చేసేవారు. అవన్ని భ్రమలేనని ఆ తర్వాత అందరికి అవగాహన అయింది. అందువల్లే టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్దతిలో పరిశ్రమల స్థాపనకు యత్నిస్తున్నారు. అందువల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వరసగా మూడేళ్లు నెంబర్ ఒన్ స్థానంలో రాష్ట్రం ఉంది. టీడీపీ మీడియా ఎంతగా అడ్డుపడుతున్నా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. పోర్టుల ఏర్పాటు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, కొప్పర్తి పారిశ్రామికవాడ, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు, సెంచురి ప్లైవుడ్ ప్లాంట్, కాకినాడ వద్ద ఫార్మా హబ్ తదితర పలు పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ సమ్మిట్ కు నాందీగా జరిగిన ఈ సన్నాహక సదస్సు సఫలం అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటిని గమనిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టబడులు వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం కలుగుతోంది. వియ్ విష్ ఆంద్రప్రదేశ్ ఆల్ ద బెస్ట్ ! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
వచ్చెనెల ఎన్నారై గ్లోబల్ మీట్.. ఎక్కడంటే?
ప్రవాస భారతీయుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చే లక్ష్యంతో ఇండో అరబ్ కాన్ఫడరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. డిసెంబరు 4న కర్నాటకలోని బెంగళూరు వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ ఎన్నారై మీట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రి రామ్‌థాస్ అథవాలే, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైలతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గతేడాది ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ గ్లోబల్ మీట్‌కి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎజెండా - వివిధ దేశాల్లో వర్క్ పర్మిట్లు, వీసాలు పొందడంలో ఎన్నారైలు పడుతున్న ఇబ్బందులు - స్వదేశానికి తిరిగొచ్చిన ఎన్నారైలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడం - భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన - క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ఎన్నారైల సన్మాన కార్యక్రమం 40 ఏళ్లుగా 1980లో కేరళలోని కోజికోడ్ కేంద్రంగా ఏర్పాటైన ఐఏసీసీ అసోసియేషన్.. 2014లో ఛారిటబుల్ ట్రస్ట్‌గా మారింది. ఈ అసోసియేషన్‌కు భారత్‌లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు యూఎస్, యూకే, అరబ్ దేశాల్లో శాఖలున్నాయి. ఈ అసోసియేషన్ స్ఫూర్తితోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎన్నారై సంక్షేమ సంఘాలు పని చేస్తున్నాయి. -
స్టార్టప్ ఇండియాను వాడుకోండి..
న్యూయార్క్: ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లకు ‘స్టార్టప్ ఇండియా’ను ఒక పరిష్కార వేదికగా ఉపయోగించుకోవాలని గ్లోబల్, అమెరికా దిగ్గజ సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా పోషకాహారం, వర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నెలకొన్న సవాళ్లకు స్టార్టప్ ఇండియా నుంచి వస్తున్న నవకల్పనలు చేదోడునందిస్తాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో పొల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్న మోదీ... బుధవారమిక్కడ 20 రంగాలకు చెందిన 42 మంది గ్లోబల్ సీఈఓలతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇప్పుడు రాజకీయ స్థిరత్వం కొనసాగుతోంది. స్థిరమైన పన్నుల విధానం, అభివృద్ధి కాంక్షతో కూడిన సర్కారు కొలువైఉంది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను చేపడుతున్నాం. పర్యాటకాభివృద్ధి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణతో పాటు చిన్న,మధ్యతరహా వ్యాపార సంస్థలకు దన్నుగా నిలుస్తున్నాం. ప్రధానంగా రైతులు, వ్యవసాయ రంగాల్లో మరిన్ని అవకాశాలను సృష్టించే సంస్థలను ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ వివరించారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వివరించడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు చేపట్టే చర్యలపై కార్పొరేట్ దిగ్గజాలతో మోదీ సమాలోచనలు జరిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం... భారత్ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలకమైన పాలసీ చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ సీఈఓలకు తెలియజేశారు. భారత్ వృద్థి పథంపై ప్రపంచ కార్పొరేట్ రంగం చాలా సానుకూల దృక్పథంతో ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కల్పించడంలో భారత్ చర్యలను గ్లోబల్ సీఈఓలు ప్రశంసించారు. మోదీ సర్కారు అమలు చేసిన చాలా సంస్కరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయని కూడా సీఈఓలు మోదీకి కితాబిచ్చాని పీఎంఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ‘భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం. మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తాం’ అని కార్పొరేట్ దిగ్గజాలు స్పష్టం చేసినట్లు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, అందరికీ ఆర్థిక ఫలాలు, పర్యావరణానుకూల ఇంధనాలు వంటి రంగాలకు చేయూతనందించే విషయంలో కీలక సూచనలను కూడా ఇచ్చారని పేర్కొంది. ఎవరెవరు పాల్గొన్నారంటే... గ్లోబల్ సీఈఓల రౌండ్‌టేబుల్‌లో ఐబీఎం చైర్మన్, సీఈఓ గినీ రోమెటీ; వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్; కోకకోలా చైర్మన్, సీఈఓ జేమ్స్ క్విన్సీ; లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్; జేపీ మోర్గాన్ చైర్మన్, సీఈఓ జేమీ డైమన్; అమెరికన్ టవర్ కార్పొరేషన్ సీఈఓ, ఇండియా–యూఎస్ సీఈఓ ఫోరం కో–చెయిర్ జేమ్స్ టైక్లెట్; మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు యాపిల్, గూగుల్, మారియట్, వీసా, 3ఎం, వార్బర్గ్ పింకస్, ఏకామ్, రేథియాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్, పెప్సీ కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న కంపెనీల మొత్తం విలువ(నెట్‌వర్త్) 16.4 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత్‌లో వాటి కార్యకలాపాల విలువ 50 బిలియన్ డాలర్లుగా అంచనా. భారత్ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ విజన్ చాలా గొప్పగా ఉంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా చేపట్టిన వ్యాపార సానుకూల విధానాలు, ఇతరత్రా సంస్కరణలను మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు మేం కూడా మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. భారత్ గురించి మా క్లయింట్లు, కస్టమర్ల నుంచి వస్తున్న సానుకూలతను చూస్తుంటే... కచ్చితంగా దేశం పురోగమిస్తుందన్న విశ్వాసం కలుగుతోంది. – బ్రియాన్ మోనిహన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ భారత్ మాకు ప్రపంచంలో ఐదో ముఖ్య మార్కెట్‌గా ఉంది. రానున్న కాలంలో ఇది మూడో స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ విషయంలో మోదీ ప్రభుత్వ వృద్ధి ఎజెండాకు మద్దతుగా నిలుస్తాం. – జేమ్స్ క్విన్సీ, కోకకోలా చైర్మన్, సీఈఓ ఇన్వెస్టర్లను భారత్‌కు ఆహ్వానించే విధంగా ప్రధాని మోదీ... సమర్థవంతంగా, హృదయపూర్వకంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మకత.. ఈ నాలుగు అంశాలు(ఫోర్ డీ) పెట్టుబడుల విషయంలో భారత్‌కున్న బలానికి నిదర్శనం అంటూ ప్రధాని చాలా సమర్థంగా తన వాణిని వినిపించారు. ఈ విషయాన్ని మేం ఎప్పుడో విశ్వసించాం. అంతేకాదు మా కంపెనీ వృద్ధికి భారత్ చాలా కీలకం కూడా. అందుకే ఇక్కడ పెట్టుబడులను కొనసాగిస్తాం. – బెన్ వాన్ బీర్డన్, షెల్ సీఈఓ ప్రధాని నరేంద్ర మోదీతో రౌండ్‌టేబుల్ భేటీ అత్యద్భుతంగా జరిగింది. భారత్ విషయంలో చాలా ఆశావహ దృక్పథంతో ఈ సమావేశానికి హాజరయ్యా. భేటీ తర్వాత ఆశావాదం మరింత పెరిగింది. ప్రతిఒక్కరి సలహాలు, సూచనలను ఎంతో సుహృద్భావంతో మోదీ విన్నారు. వ్యాపార సానుకూలతకు చేస్తున్న చర్యలు ఇరువర్గాలకూ మేలు చేకూరుస్తాయి. ఆయన ఒక నిజమైన నాయకుడు. – గినీ రోమెటీ, ఐబీఎం సీఈఓ సీఈఓలతో చర్చలకు ప్రధాని మోదీ అత్యంత ఆసక్తి కనబరిచారు. సమావేశం చాలా బాగా జరిగింది. భారత్ అనుసరిస్తున్న వృద్ధి ప్రోత్సాహక విధానాలను అభినందిస్తున్నా. భారత్‌లో ప్రాజెక్టుల విషయంలో మేం చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాం. పెట్టుబడులకు చాలా అనుకూల వాతావరణం నెలకొందని భావిస్తున్నా. – మారిలిన్ హ్యూసన్,లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ -
‘బ్రిక్స్’లో భిన్నాభిప్రాయాలు
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ దేశాల మూడో పట్టణీకరణ ఫోరం సదస్సులో పట్టణాభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గురువారం నాలుగు అంశాలపై ప్లీనరీ జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు రోజంతా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండో ప్లీనరీ ‘బ్రిక్స్ స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్’ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వలవన్ మాట్లాడుతూ పట్టణ పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. దక్షిణాఫ్రికా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఫిలిప్ హారిసన్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలతో కీడే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల పల్లెలు, నగరాల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో ప్లీనరీలో ‘ఫైనాన్సింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అంశంపై చర్చించారు. రాజధాని అమరావతికి రూ.500 కోట్ల నిధులు మంజూరవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి బి.ఆనంద్ తెలిపారు. త్వరలో ప్రకటించబోయే 27 స్మార్ట్ సిటీల్లో అమరావతి ఉందన్నారు.