పనిచేయకపోతే జీతంలేదు:177 జీఓ ప్రయోగం
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం జీవో 177ని ప్రయోగించింది. దీని ప్రకారం నో వర్క్ నో పే అమల్లోకి వస్తుందని తెలిపింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు చోటు లేదని, ఎలాంటి ఆందోళనకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
సచివాలయం, కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఒక సర్క్యులర్ ద్వారా తెలిపింది. జీవో 177 ప్రకారం కేవలం విధులు నిర్వర్తించిన వారికే వేతనం ఇస్తామని తెలిపింది. కార్యాలయాలకు వచ్చి సంతకం పెట్టి పని చేయకుండా ఉండే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.