'జీవో 123పై అప్పీల్ చేస్తే మేమూ ఇంప్లీడ్'
రాష్ర్టప్రభుత్వం జీవో 123 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూసేకరణ జీవోను కొట్టేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఆ తీర్పుపై అప్పీల్ చేస్తామని మంత్రి హరీష్రావు చెబుతున్నారన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రి హరీష్రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించడం, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. అయినా పేదలకు తాము వ్యతిరేకమన్న విధంగా ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదన్నారు.