Goa Assembly polls
-
13 పాయింట్ల ఎజెండాతో గోవా అభివృద్ధి
-
గోవా బరిలో 250 మంది
పణజీ: ఫిబ్రవరి 4న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో 250 మంది అభ్యర్థులు 40 స్థానాల కోసం పోటీపడుతున్నారు. వీరిలో దక్షిణ గోవా నుంచి 131 మంది, ఉత్తర గోవా నుంచి 119 మంది ఉన్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. 2012 ఎన్నికల్లో 202 మంది బరిలో ఉన్నారు. అత్యధిక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ–కాంగ్రెస్–ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. -
ఏసీబీ ఎదుట హాజరైన సీఎం అభ్యర్థి
పణజి: త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన ఎల్విస్ గోమ్స్ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ల్యాండ్ కన్వర్షన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 53 ఏళ్ల ఎల్విస్ గోమ్స్ దక్షిణ గోవాలోని కన్ కోలిన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనపై విచారణకు ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు. -
'వచ్చే ఎన్నికల్లో 35 స్థానాలు గెలుస్తాం'
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం రెండు చోట్ల అధికారం కైవసం చేసుకునే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పంజాబ్ లో ఆప్ గాలి వీస్తున్నట్లు ముందస్తు సర్వేలు చెబుతుండగా, చిన్నరాష్ట్రం గోవాలోనూ సత్తాచాటాలని చీపురు పార్టీ భావిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల గోవా పర్యటనకు వచ్చారు. మంగళవారం ఉదయం పణజి విమానాశ్రయంలో ఆప్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి కేజ్రీవాల్ నేరుగా మత్స్యకారులు నివసించే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయనకు అరుదైన స్వాగతం లభించింది. తాము సాంప్రదాయంగా భావించే పూల కిరీటంతో మత్స్యకారులు కేజ్రీవాల్ ను సన్మానించారు. పూలవెలుగులో మెరిసిపోతూ ఆయన మీడియాతో మాట్లాడారు. 'గోవాలో బీజేపీ పాలన వల్లే అవినీతి పెరిగిపోయింది. ఆ కుళ్లును చీపుర్లతో కడిగేయడానికే సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 35 స్థానాలను గెలుచుకుంటాం'అని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి 2017 మార్చితో గడువుతీరనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ ల అసెంబ్లీ ఎన్నికలతోపాటే గోవా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. గత లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.