goddess Bhadrakali
-
భద్రకాళి చెంత సీఎం కేసీఆర్ అబద్ధాలు
♦ వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం ♦ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ♦ 31 జిల్లాలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భద్రకాళి అమ్మ వారి దగ్గర పచ్చి అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వర్షాలు పడి, చెరువులు నిండి రైతులు సంబరాలు చేసుకుంటున్నారని సీఎం చెప్పడం ఆయన స్థాయికి తగినది కాదని పేర్కొంది. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగక, బ్యాంకు రుణాలు దొరకక అధిక వడ్డీతో వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని చెల్లించలేక, నకిలీ విత్తనాలతో వేసిన పంటలు నష్టపోయి ైరె తాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే సంతోషంగా ఉన్నారంటూ పేర్కొనడం వాస్తవ దూరమని విమర్శించింది. సోమవారం ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలతో రైతుల పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారమివ్వాలని, అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి సహాయం చేయాలంటూ ఒకవైపు కేంద్రానికి మంత్రుల బృందం వినతిపత్రాన్ని సమర్పిస్తే, మరోవైపు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై ఎందుకింత గోప్యత? తాము మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని కేసీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు 31కి పెంచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనితో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఎస్సీలతో పాటు ఎస్టీలకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టు పీజీ తదితర పథకాల అమలు ఏమైందని నిలదీశారు. జిల్లాల ఏర్పాటుపై కమిటీల మీద కమిటీలు వీస్తున్నారని, మరి అఖిలపక్షభేటీలో మరో రెండు సమావేశాలను ఏర్పాటు చేస్తామని ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఇంత హడావుడిగా, అత్యంత గోప్యంగా ఉంచి ఆదరాబాదరాగా ప్రకటించడం ఏమిటని నిలదీశారు. చివరి నిమిషంలో సైతం కరీంనగర్ జిల్లాలోని మంత్రి హరీశ్‌రావు సొంతూరును చీల్చి సిిద్దిపేట జిల్లాలో కలపడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గుళ్లు, గోపురాలు తిరగడాన్ని తాము తప్పుబట్టడం లేదని, అయితే గుళ్లలో ధూప, దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకటించిన రూ.రెండున్నరవేల మొత్తాన్ని ఎందుకు నిలిపేశారని నిలదీశారు. -
భద్రకాళీ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు
వరంగల్ : ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మ వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మొక్కును చెల్లించుకున్నారు. రూ.3.70కోట్ల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆదివారం ఉదయం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయాధికారులు, వేద పండితులు సీఎంకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పలు ఆలయాల్లో దేవుళ్లకు నగలు సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. -
భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు
-
భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు
సాక్షి, హైదరాబాద్: భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని సీఎం పరిశీలించారు. 11 కిలోల 700 గ్రాముల బంగారంతో జీఆర్టీ జువెల్లర్స్ ఈ కిరీటం తయారు చేశారు. రూ.3.70 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని ఆదివారం ముఖ్యమంత్రి సతీ సమేతంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తారు. శనివారం రాత్రికే సీఎం వరంగల్‌కు వెళ్లేలా ప్రణాళిక ఖరారైంది. కిరీటాన్ని పరిశీలించిన వారిలో సీఎం సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ముఖ్యమంత్రి సలహాదారు కేవీ రమణాచారి తదితరులు ఉన్నారు. -
సీఎం మొక్కులు: 3 కోట్లతో 'భద్రకాళి'కి స్వర్ణ కిరీటం
హైదరాబాద్ : వరంగల్‌లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. రూ.3కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే అందుకు సంబంధించి బంగారు కిరీటం కోసం కొలతలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. అలాగే వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు,తిరుమల వెంకన్న, విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవార్లకు ముక్కుపుడకలు రాష్ట్ర ప్రభుత్వం చేయించనుంది. వీటికోసం దేవాదాయశాఖ నిధులను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నగలను సిద్ధం చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని.. దాదాపు రెండు కిలోల బరువుతో వజ్రవైఢూర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. దీనికి దాదాపు రూ.5.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు.