వెంకన్న స్వర్ణరథం ట్రయల్ రన్
తిరుమల : తిరుమలేశుని కైంకర్యసేవకు కొత్త స్వర్ణరథం ఎట్టకేలకు సిద్ధమైంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు ... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు.
ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలిస్తున్న టీటీడీ అధికారులు రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది.