Golf clubs
-
Goల్స్ ఆడేద్దాం
ఒకప్పుడు సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన గోల్ఫ్.. క్రమంగా కామన్ మ్యాన్‌కు చేరువవుతోంది. నగరంలో ఏకంగా గోల్ఫ్ కోర్స్‌లు, క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇదొక ఆటగా కాకుండా జీవనశైలిగా మారిపోతోంది. గోల్ఫ్ కోర్స్ ప్రాపర్టీ ఉన్నా.. ఆడటం వచి్చనా స్టేటస్ సింబల్‌గా భావిస్తుండటంతో దశాబ్ద కాలంగా హైదరాబాద్‌లో గోల్ఫ్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నగర శివారులో గోల్ఫ్ కోర్స్ థీమ్ ఆధారిత విల్లాలు, టౌన్‌షిప్‌లు, కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ప్రయోజనాలివీ.. ⇒ గోల్ఫ్ శిక్షణతో ప్రశాంతత, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. ఒత్తిడి తగ్గి మనసు, శరీరం సమన్వయంతో పనిచేస్తాయి. ⇒ గోల్ఫ్ ఆటకు సగటున 4–5 గంటల సమయం పడుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. దీంతో మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది.⇒ వాటర్ ఫ్రంట్ సెట్టింగ్‌లు, అద్భుతమైన వ్యూ, విలాసవంతమైన వసతులు, పచ్చటి వాతావరణం వంటి రకరకాల కారణాలతో గోల్ఫ్ కోర్స్ ప్రాపరీ్టల విలువ త్వరితగతిన పెరుగుతుంది. పునఃవిక్రయం సులువుగా ఉంటుంది.⇒ ఈ ప్రాపరీ్టల్లో భూమి విలువ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.⇒ ఒకే రకమైన ఆలోచనా ధోరణులు, భావాలు, ఆసక్తులు ఉన్న వ్యక్తులు ఒకే చోట ఉండటంతో కమ్యూనిటీ బంధాలు బలపడతాయి.బ్రిటిష్ కాలంలో గోల్ఫ్ క్లబ్‌లకు బయట ‘కుక్కలు, భారతీయులకు అనుమతి లేదు’ అని రాసి ఉండేదట. మన దేశంలో గోల్ఫ్ రిచ్ గేమ్‌గా మారడానికి ఇదే కారణం. అప్పట్లో ఆంగ్లేయులు భారతీయులకు క్రీడలు నేర్పించేవారు కాదు. గోల్ఫ్ శిక్షణ కోసం ఏకంగా ఇంగ్లండ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే కాలక్రమేణా మన దేశంలో గోల్ఫ్ క్లబ్‌లు, సంఘాలు ఏర్పడటంతో అనతికాలంలో ప్రజాదరణ పొందింది. బ్యూరోక్రాట్స్, సీ–లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు, యువ వ్యాపారస్తులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థాయి ఉద్యోగులు గోల్ఫ్ కోర్స్ ప్రాపరీ్టల్లో నివాసం ఉండేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఉన్నత, ఎగువ మధ్య తరగతి..సాధారణంగా గోల్ఫ్ కోర్టులకు ఎక్కువ స్థలం కావాలి. నగరాల్లో భూమి కొరత, ఖరీదు కారణంగా డెవలపర్లు గోల్ఫ్ ప్రాపర్టీను లాభదాయకమైన రియల్ ఎస్టేట్ ఫార్మాట్లుగా అభివృద్ధి చేస్తుంటారు. 18 హోల్స్ గోల్ఫ్ కోర్స్ ప్రాపర్టీని అభివృద్ధి చేయాలంటే కనిష్టంగా 100–120 ఎకరాల భూమి కావాలి. ఇందులో డ్రైవింగ్, ఆధునిక క్లబ్ హౌస్, రిసార్ట్స్ కూడా ఉంటాయి. సాధారణ లే–అవుట్లో గజం ధర రూ.10 వేలుగా ఉంటే.. గోల్ఫ్ ప్రాపర్టీల్లో రూ.20–25 వేలు ఉంటుంది. కాబట్టి డెవలపర్‌కు, యజమానికీ లాభదాయకంగా ఉంటుంది. పైగా ప్లాట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి విక్రయం సులువవుతుంది.తొలి, ఏకైక పీపీపీ గోల్ఫ్ క్లబ్ ఇక్కడే..తెలంగాణలో 1992లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్జీఏ) ఏర్పాటైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటైన తొలి, ఏకైక క్లబ్ ఇదే. గోల్ఫ్‌ను ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ, హెచ్జీఏ గోల్కొండ వద్ద వంద ఎకరాల్లో 18 హోల్స్ గోల్ఫ్ కోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వార్షిక రుసుము రూ.10 వేలు. ప్రస్తుతం హెచ్జీఏలో 2,500 మంది సభ్యులున్నారని హెచ్జీఏ కెపె్టన్ టీ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.తల్లిదండ్రులు ప్రోత్సహించాలిగోల్ఫ్తో రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాగే గోల్ఫ్ కూడా అంతర్జాతీయ ఆట. ఇటీవలే ఒలింపిక్స్‌లో కూడా దీన్ని పెట్టారు. విద్యార్థులు గోల్ఫ్ నేర్చుకునేందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి.– కె.లక్ష్మారెడ్డి, గోల్ఫ్ ప్లేయర్, మాజీ ఎమ్మెల్యేకోర్స్ పేరే ల్యాండ్ మార్క్గోల్ఫ్ కోర్స్ ప్రాపరీ్టలు వచ్చాక ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. ఆ కోర్స్ పేరే ల్యాండ్‌మార్క్‌గా మారుతుంది. పైగా ఆయా ప్రాపరీ్టల్లోని క్లబ్‌హౌస్, రిసార్ట్‌ల నిర్వహణతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. – కె.సంతోష్‌రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్శివారులో గోల్ఫ్ ప్రాపరీ్టలు.. మెట్రో నగరాల్లోని స్థిరాస్తి రంగంలో గోల్ఫ్ ప్రాపర్టీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. ఎక్కువగా విల్లాలు, టౌన్‌షిప్‌లు, వాణిజ్య సముదాయాల్లో గోల్ఫ్ కోర్స్ ప్రాప రీ్టలకు ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం నగరం మ్యాక్, డ్రీమ్ వ్యాలీ, గిరిధారి, వర్టెక్స్, అపర్ణా వంటి పలు నిర్మాణ సంస్థలు వికారాబాద్, మోమిన్‌పేట్, తూప్రాన్, మన్నెగూడ, చేవెళ్ల, తుక్కుగూడ, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్స్ ప్రాప రీ్టలను అభివృద్ధి చేస్తున్నాయి. వీకెండ్లో కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇక్కడే క్లబ్‌హౌస్, రిసార్ట్, హోటల్, వసతులు ఉంటాయి. -
ఆశాజనకమైన కెరీర్‌కు.. గోల్ఫ్ కోచ్!
గోల్ఫ్.. ప్రాచీన క్రీడల్లో ఒకటి. ఇది 15వ శతాబ్దంలో స్కాట్లాండ్లో పుట్టినట్లు ఆధారాలున్నాయి. ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఈ క్రీడ గత కొన్నేళ్లుగా భారత్‌లోనూ ఆదరణ పొందుతోంది. సంపన్నుల ఆటగా పేరొందిన గోల్ఫ్ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోంది. జనం దీనిపై ఆసక్తి చూపుతుండడంతో కొత్తకొత్త గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. దీంతో గోల్ఫింగ్ శిక్షకులకు డిమాండ్ పెరుగుతోంది. కోచ్‌గా మారి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయంగా పోటీల్లో పాల్గొంటే మంచి ఆదాయం, పేరు ప్రఖ్యాతలు లభిస్తున్నాయి. 2016 ఒలింపిక్ క్రీడల్లో గోల్ఫ్ పోటీలను కూడా చేరుస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. కాబట్టి గోల్ఫ్ కోచ్ కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తులో అవకాశా లు ఆశాజనకంగా ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు. అవకాశాలు, ఆదాయం.. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారులకు ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఈ రంగంలో క్రీడాకారుడిగా, కోచ్‌గా.. రెండు విధాలుగా పనిచేసుకోవచ్చు. ఆటలో ప్రతిభ చూపితే క్లబ్, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. నగరాల్లోనూ గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో కోచ్‌గా ఉద్యోగం, ఉపాధి పొందొచ్చు. కార్పొరేట్ పాఠశాలల్లో ఈ క్రీడకు చోటు కల్పిస్తున్నారు. మంచి వేతనం ఆఫర్ చేస్తూ కోచ్‌లను నియమిస్తున్నారు. అంతేకాకుండా వనరులను సమీకరించుకొని, సొంతంగా గోల్ఫ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆదాయానికి లోటు ఉండదు. రిసార్ట్‌ల లోనూ గోల్ఫ్ కోచ్‌లకు అవకాశాలున్నాయి. గోల్ఫ్ ట్రైనర్లు తమ వీలును బట్టి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ పనిచేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: గోల్ఫ్.. శరీరం, మనసును సమన్వయం చేసుకుంటూ ఆడాల్సిన ఆట. కఠోరమైన సాధనతోనే ఎవరైనా ఉత్తమ ట్రైనర్‌గా గుర్తింపు పొందగలుగుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం నాలుగైదు గంటలు గోల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఏకాగ్రత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. ఆటపై అంకితభావం అవసరం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సాన పెట్టుకుంటూ ముందుకు సాగాలి. క్రీడలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే స్పోర్టివ్‌నెస్ అవసరం. కోచ్‌గా కెరీర్లో రాణించాలంటే ఓపిక, సహనం ఉండాల్సిందే. అర్హతలు: గోల్ఫ్ శిక్షకులకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. ఆటపై వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులో రాణించొచ్చు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. పూర్తిస్థాయి కోచ్‌గా కెరీర్ లో స్థిరపడాలనుకునేవారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గోల్ఫ్‌పై దృష్టి పెడితే మంచిది. ఆటపై పట్టు సాధించి, కొన్ని పోటీల్లో పాల్గొన్న తర్వాత కోచ్‌గా మారొచ్చు. వేతనాలు: నిపుణులైన కోచ్‌లకు ఆదాయం అధికంగా ఉంటుంది. కేవలం అరగంట శిక్షణకు రూ.150 నుంచి రూ.850 వరకు రుసుం వసూలు చేసే కోచ్‌లు ఉన్నారు. గోల్ఫ్ ప్రొఫెషనల్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. అనుభవం పెంచుకుంటే నెలకు రూ.25 వేల నుంచి రూ.45 వేలు పొందొచ్చు. సీనియర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగానే సంపాదించుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.thehyderabadgolfclub.com/ నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా. వెబ్సైట్: www.ngai.org.in/ డీఎల్ ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ వెబ్సైట్: http://dlfgolfclub.golfgaga.com/ ఢిల్లీ గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.delhigolfclub.org/ నోయిడా గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.noidagolfcourse.com/ ఇది కార్పొరేట్ కెరీర్ ‘‘గోల్ఫ్ గతంలో కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన క్రీడ. కార్పొరేట్ కల్చర్‌లో ఇది స్టేటస్ సింబల్‌గా మారింది. వ్యాయామంగా ఉపకరించే ఆటగా సాధారణ ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్స్ వరకూ గోల్ఫ్‌పై ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో దీనికి క్రేజ్ పెరిగింది. దానికి తగినట్లుగానే శిక్షకులకూ మంచి కెరీర్‌గా మారింది. నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా తోపాటు పలు చోట్ల శిక్షణ లభిస్తోంది. కేవలం ఉద్యోగంగా భావించకుండా మైదానం పట్ల అంకితభావం ఉంటే ఎవరైనా ఈ రంగంలో రాణించవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏకాగ్రత, పట్టుదల.. కావాల్సిన లక్షణాలు. సర్టిఫికేషన్ కోర్సుల్లో పలు విభాగాలుంటాయి. అర్హత సాధించాక దేశ, విదేశాల్లో శిక్షకులుగా చేరొచ్చు. టోర్నమెంట్ల నిర్వహణలో పాల్గొనవచ్చు. ఫుల్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. పార్ట్‌టైంగా వ్యాపకంగా కోచ్‌గా మారవచ్చు. కెరీర్ మొదట్లో రూ.20 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది. సీనియార్టీ, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. ఉన్నత హోదా లభిస్తుంది’’. -ప్రకాశ్ ఎం. పక్కీ, ట్రైనర్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ‘రైట్స్’లో జూనియర్ మేనేజర్లు రైట్స్ లిమిటెడ్... జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్). పోస్టుల సంఖ్య: 2 అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 12. వెబ్సైట్: http://rites.com/ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ సెంటర్ భువనేశ్వర్.. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ పోస్టుల సంఖ్య: 4 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 14 వెబ్సైట్: http://www.ctcri.org/ నిట్-తిరుచిరాపల్లి తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా చివరి తేది: అక్టోబర్ 8. వెబ్సైట్: www.nitt.edu సీడీఆర్ఐలో పీహెచ్డీ సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ).. వివిధ విభాగాల్లో కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కోర్సు: పీహెచ్డీ ప్రోగ్రామ్. అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ను చూడొచ్చు. దరఖాస్తు: ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 30 దరఖాస్తులను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: www.cdriindia.org