తీరు మారకుంటే చంపేస్తాం
కరీంనగర్ : పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్న గొల్ల మల్లారెడ్డి, అనిల్ తీరు మార్చుకోవాలని మావోయిస్టులు సూచించారు. తీరు మారకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని వారికి మావోయిస్టులు హెచ్చరించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీ పేటలో ఈ మేరకు శనివారం వాల్ పోస్టర్లు వెలిశాయి.