ప్రమాదవశాత్తూ కత్తిపీటపై పడ్డ విద్యార్థి
ఆత్మకూర్(మహబూబ్నగర్): ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కత్తిపీటపై పడి గొంతు దగ్గర కాస్త తెగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన గొల్లశేఖర్(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పక్కనే ఉన్న కత్తిపీటపై పడటంతో గొంతుభాగం కొద్ది వరకు తెగింది. కుటుంబసభ్యులు అతడిని మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.