good for health
-
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !
నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నాడు మనసు కవి ఆత్రేయ. జైవిక భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటి. ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినా వెంటనే కళ్ళలోంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. అయితే బాధతో వచ్చే కన్నీళ్లనే ఏడుపు అనడం పరిపాటి. ఏడుపంటే బాధకు చిహ్నం అనుకుంటాం కానీ, ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివద్ధి చెందుతుందో మనిషి కూడా అంతేవేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈక్రమంలో ఉరుకులుపరుగుల జీవనంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. కాస్త స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు వ్యాయామం, లాఫర్ యోగా వంటివి ప్రయత్నించి సేదతీరుతున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడవడం వల్ల లాభలేంటో చూద్దాం.. ఎక్కువ సమయం మనం దేనిగురించైనా బాధపడుతూ ఏడిస్తే మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. దీంతో మనం సమన్వయంతో ఆలోచించగలుగుతాం ∙అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బి.పి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏవీ దరిచేరవు. కళ్ల నుంచి నీరు కారడం వల్ల కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోగొడతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు .. క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి. కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనల వైపు దృష్టి మరులుతుంది. కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది: బాసల్ టియర్స్... నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అయ్యే ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రెండోది: రెప్లెక్స్ టియర్స్..ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లల్లో దుమ్మూధూళి పడ్డప్పుడు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. మూడోది: ఎమోషనల్ టియర్స్..ఇది ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్లనుంచి నీరు ఉబికి వస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఇదండీ కన్నీళ్ల కథ! -
మట్టికుండ.. ఆరోగ్యానికి అండ
సాక్షి, మెదక్ రూరల్: వేసవిలో చల్లటి నీరు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అందుకు ధనవంతులు రిఫ్రిజిరేటర్లో నీటి తాగితే మధ్య తరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలోకూడా కుండలను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి కుండలను తయారు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు ఎంత సాంకేతికంగా అందుబాటులో ఉన్నా కుండలకు సాటిరావని కొనుగోలు దారుల అభిప్రాయం. మట్టితో తయారు చేసిన రంజన్లు, కుండలకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గటం లేదు. జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రధాన రహదారుల వెంట మట్టి కుండలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. వేసవి ఆరంభం కావడంతో ప్రజలు చల్లటి నీటిని తాగేందుకు కుండలను, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తయారుచేసిన రిఫ్రిజిరేటర్లో చల్లటి నీటిని తాగితే ఆనారోగ్య సమస్యలున్నవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుండటంతో ఆనీటిని తాగేందుకు ఇష్టపడటంలేదు. ఇక మట్టి కుండలో నీరు అన్ని విధాలుగా మంచిదని వైద్యులే చెబుతుండటంతో వీటి ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. ఆదిలాబాద్, కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రా నుంచి కుండలు, రంజన్లను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ఒక్కో కుండ, «రంజన్ ధర రూ.250 నుండి రూ.800 వరకు పలుకుతు మట్టి వాటర్ బాటిల్స్ వచ్చాయి – మంజుల, వ్యాపారి, మెదక్ మట్టితో తయారు చేసిన కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరిగాయి. వివిద రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ సైతం మార్కెట్లోకి వచ్చాయి. సైజును బట్టి ధర ఉంటుంది. -
స్పైసీ ఫుడ్ అంటే మీ కిష్టమా..
సాక్షి: కొందరికి ఘాటైన మసాలా ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలాంటి మసాలా ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొందరు నిపుణల సూచన. అయితే మసాలా ఫుడ్ తినడం వల్ల ప్రయోజనం కూడా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. తరచూ ఇలాంటి ఆహారం తీసుకునే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని అధ్యయన సారాంశం. మసాలా ఫుడ్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చైనీస్ అకాడెమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన పరిశోధకులు అన్నారు. 'ఇంతకు ముందు జరిపిన అనేక అధ్యయనాల ప్రకారం కొన్ని రకాల మసాలా దినుసులకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఔషధ గుణాలున్నాయి. ఎర్ర మిరియాలు, క్యాప్సైసిన్ (మిరప) వంటి దినుసులు బయో యాక్టివ్ ఏజెంట్లుగా పనిచేయడంతో పాటు స్థూలకాయం, హృద్రోగాలు, మధుమేహంలాంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతాయి. ఇవి మాత్రమే కాకుండా అనేక దినుసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వాటిపై ప్రజల్లో ఉన్న అవగాహన తక్కువే. వ్యాధుల నివారణలో, మరణాల రేటు తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి' అని అధ్యయన వేత్తలు తెలిపారు. 30-79 ఏళ్ల వయస్సున్న దాదాపు ఐదు లక్షల మందిని 2004-2008 వరకు అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లు, మసాలా ఫుడ్ ఇష్టపడే అంశాలు, ఆరోగ్యం, తదితర అంశాలను అధ్యయనం చేశారు. వారానికి మూడు కంటే ఎక్కువ రోజులు మసాలా ఫుడ్ తినే వారు మిగతావారితో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు, వీరిలో మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. -
యోగాతో మేలు జరుగుతుంది:రాధిక