Gopalganj
-
దుర్గా పూజ మండపం వద్ద తొక్కిసలాట.. అయిదేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతి
పాట్నా: బిహార్‌లో విషాదం నెలకొంది. దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాట ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. దేవి నవరాత్రుల సందర్భంగా రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడటంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8.30 గంటలకు రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి పోవడంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు సైతం కిందపడిపోయారన్నారు. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. దీంతో ముగ్గురికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని,, ఆసుపత్రికి తరలించేలోపు ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించినట్లు చెప్పారు. మరో 10కి పైగా గాయపడగా.. వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు మండపం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు. చదవండి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
25 మంది పోలీసులపై వేటు
బిహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో 16 మంది వ్యక్తులు అక్రమ మద్యానికి బలైన ఘటనలో 25 మంది పోలీసులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. ఘటనకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా 14 మందిపై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. పూర్తిగా మద్యం అమ్మకాల నిషేధం ఉన్న ఈ రాష్ట్రంలో, పోలీసుల నిర్లక్ష్యపూరిత వ్యవహారానికి అక్రమమద్య వ్యాపారం కొన్ని ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోపాల్‌గంజ్ జిల్లా స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం అక్రమ మద్యం సేవించి 16 మంది వ్యక్తులు ప్రాణాలు వదిలిన ఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్య వ్యాపారాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పట్టించుకోని స్థానిక ఖజుర్వాని గ్రామ పోలీసుస్టేషన్ పరిధిలోని పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. అక్రమమద్యం సేవించడం వల్లనే వీరు మృతిచెందారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు వాపోయారు. ముందస్తు రిపోర్టులు సైతం అక్రమ మద్యానికే వీరు బలైనట్టు వెల్లడించాయి. కానీ స్థానిక పోలీసులు, అధికారులు మాత్రం తమ నిర్లక్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఖండించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో టీమ్ ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం, అక్రమ మద్య వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ ఖజుర్వాని గ్రామంలోని స్థానిక పోలీసు స్టేషన్ పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తేల్చింది. వెంటనే 15 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ సైతం తీవ్రంగా స్పందించారు. ఘటనకు దోహదం చేసిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు. తరుచు దాడులు నిర్వహిస్తూ అక్రమ మద్యాలను అరికడుతున్నామని పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతుండగా.. మద్య నిషేధం చేపట్టినప్పటినుంచి ఎలాంటి రైడ్స్ తమ ప్రాంతాల్లో జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా పోలీసులే మద్యం సేవిస్తూ ఊగులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని ఆరు గ్రామాలకు నితీష్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ నెల మొదట్లోనే స్టేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో తమ ప్రాంతాల్లో మద్యాన్ని రికవరీ చేయడం లేదని 11 ఎస్హెచ్ఓలు సస్పెండ్ అయ్యారు. -
'వాళ్లని గెలిపిస్తే మళ్లీ జంగిల్ రాజ్యం వస్తుంది'
బిహార్ : మహాకూటమిని గెలిపిస్తే మళ్లీ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మహాకూటమి నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో కూటమి నేతలు నాపై ఆరోపణలు చేశారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా బిహార్ ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. నితీశ్ ప్రభుత్వం బిహార్ ప్రజలు చేసిందేమిటని ప్రజలను ప్రశ్నించారు. బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మూడు దశల ఎన్నికలు పూర్తి అయినాయి. నాలుగో దశ నవంబర్ 1వ తేదీన, ఐదో దశ.. తుది దశ నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.