బిహార్ : మహాకూటమిని గెలిపిస్తే మళ్లీ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం బిహార్లోని గోపాల్గంజ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మహాకూటమి నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో కూటమి నేతలు నాపై ఆరోపణలు చేశారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా బిహార్ ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు.
నితీశ్ ప్రభుత్వం బిహార్ ప్రజలు చేసిందేమిటని ప్రజలను ప్రశ్నించారు. బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మూడు దశల ఎన్నికలు పూర్తి అయినాయి. నాలుగో దశ నవంబర్ 1వ తేదీన, ఐదో దశ.. తుది దశ నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.