gouri shankar
-
పెన్సిల్ మొనపై చిత్రకళా రూపాలు
-
హరిప్రసాద్ నన్ను బెదిరించారు: గౌరీ శంకర్
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో వేమూరి హరిప్రసాద్ అవినీతి చేశారని ఫైబర్ నెట్ మాజీ ఈడీ గౌరీశంకర్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన ఆయన.. తనను బెదిరించారని, చెప్పినట్టు వినాలంటూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు రూ.333 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారని, ఇందుకు సంబంధించిన టెండర్‌కు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని చెప్పారు. కాగా ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అవకతవకల గురించి గౌరీ శంకర్ శుక్రవారం మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: ‘ఫైబర్ నెట్’లో భారీ అక్రమాలు) ఈ ప్రాజెక్టు మానటరింగ్ బాధ్యతలు జెమినీ కమ్యూనికేషన్‌కు అప్పగించారని, నెట్ ఇండియా కూడా హరిప్రసాద్‌దేనని చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్లలో క్వాలిటీ కేబుళ్లను ఉపయోగించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 12 లక్షల సెటప్ బాక్సుల్లో 8లక్షల 60 మాత్రమే కనెక్ట్ చేశారని.. వీళ్ల బాక్స్‌ల వల్ల ఇబ్బంది ఉందని.. దాసన్ అనే కంపెనీ నుంచి అప్పటి అధికారి అహ్మద్‌బాబు చెప్పారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నలుగురికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వేమూరి హరిప్రసాద్ గురించి చెబుతూ.. ‘‘ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఆంధ్రాబ్యాంకు రూ.4500 కోట్లు లోన్ ఇచ్చింది. కనుమూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి వేమూరి హరిప్రసాద్‌కు బినామీ. నేటప్స్ అనే కంపెనీ కనుమూరి కోటేశ్వరరావుది. ఈయనకు చెందిన మరో కంపెనీలో హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా చివరి రెండు వారాల్లో కొత్తగా ఆర్డర్ దక్కించుకున్న నేటాప్స్ కంపెనీకి సీఈవోగా హరిప్రసాద్ కూతురు వేమూరి అభిజ్ఞ ఉన్నారు. నేను ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు వస్తే అవకతవకలు బయట పడతాయని భావించారు. అందుకే జూన్ 1న నన్ను తొలగించారు. దీనిపై స్పషల్ చీఫ్ సెక్రటరీ విచారణ చేయించాలి. వీళ్లని కాపాడేందుకు రాజకీయ నేతలు కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. సిగ్నమ్లో ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్న నన్ను టార్చర్ పెట్టారు. నన్ను బాగా బెదిరించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు కాంట్రాక్టు ఇప్పించారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్‌బ్లాక్ చేశారు. నిజానికి సిగ్నమ్కి లైసెన్స్ బిజినెస్ ఉంది. నేను టేరాకు వెండర్‌ని కాదు’’ అని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు. రూ.1,500 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ ఇటీవల హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్! ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు అప్పట్లో మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్ గ్రిడ్ టెండర్లో ఎక్కువ ధర కోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్ఎఫ్ఎల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్ గ్రిడ్ టెండర్ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి. తద్వారా రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. -
పోలీసుల అదుపులో ఏడో నిందితుడు..
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్క్ సమీపంలో ఈ నెల 7న జరిగిన నవ వరుడు గౌరీశంకరరావు హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త గౌరీశంకరరావును (మేనమామ) కడతేర్చాలని తన ప్రియుడు శివ సహకారంతో విశాఖపట్నానికి చెందిన రౌడీమూకతో ఒప్పందం కుదుర్చుకున్న భార్య పథకం ప్రకారం భర్తను చంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి ఏఎస్పీ దీపిక పాటిల్ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి అయిన తర్వాత చంపించడానికి పథకం పన్నడమే కాకుండా పెళ్లికి ముందు కూడా బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో గౌరీశంకరరావును హత్య చేయించేందుకు సరస్వతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. ఈ వివరాలను ఏఎస్పీ దీపిక పాటిల్ శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే సరస్వతి విశాఖపట్నంలోని సాయిసుధ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నప్పుడు కల్యాణి అనే స్నేహితురాలు పరిచయమైంది. ఆమె సహకారంతో రాజాన శ్రీనివాసరావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని తన మేనమామ గౌరీశంకరరావును బెంగళూరులో హతమార్చేందుకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సరస్వతి తన ప్రియుడు శివ వద్ద రూ. 25 వేలు తీసుకొని శ్రీనివాసరావుకు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ తరువాత మరోసారి రూ. 11వేలు అందజేసింది. ఈ రెండు పేమెంట్లు ఆన్లైన్లో తేజ్ యాప్ ద్వారా శ్రీనివాసరావుకు చేరాయి. అనంతరం మరో 14 వేల రూపాయలను చేతికి నేరుగా అందజేసింది. అయితే డబ్బులు తీసుకున్న రాజాన శ్రీనివాసరావు తన తల్లికి బాగోలేకపోవడంతో పథకాన్ని అమలు చేయలేకపోయాడు. దీంతో సరస్వతికి తన మేనమామ గౌరీశంకరరావుతో వివాహం జరిగిపోయింది. ఎలాగైనా తన భర్తను చంపాలని ప్రియుడు శివతో చర్చించి విశాఖపట్నానికి చెందిన రౌడీషీటర్ రామకృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం ఈ నెల 7న తోటపల్లి ఐటీడీఏ పార్క్ వద్ద దాడి చేసి గౌరీశంకర్‌ను హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే సరస్వతితో పాటు హత్యకు పాల్పడిన శివ , గోపి, రామకృష్ణ, బంగార్రాజు, కిశోర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ముందుగా హత్యచేసేందుకు సుపారి తీసుకొని పథకం పన్నిన శ్రీనివాసరావును విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని 7వ నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, గరుగుబిల్లి ఎస్సై హరిబాబునాయుడులు పాల్గొన్నారు. -
మలుపు తిరుగుతున్న నవ వరుడు హత్యకేసు
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఐటీడీఏ పార్క్ సమీపంలో ఇటీవల జరిగిన నవ వరుడు హత్యకేసు ఉదంతం మలుపు తిరుగుతోంది. కట్టుకున్న భార్యే... భర్తను హతమార్చడానికి పన్నిన పన్నాగాన్ని పోలీసులు చేధించారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు మృతుడి భార్య సరస్వతి, ప్రియుడు శివకుమార్ కలిసి విశాఖకు చెందిన గుండాలతో హత్య చేయించినట్లు తెలిసింది. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మృతుడు గౌరీశంకర్ భార్య సరస్వతికి బెంగళూరులో ఒక స్నేహితురాలు ఉంది. సరస్వతి భర్త గౌరీశంకరరావు కూడా బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సరస్వతి తన స్నేహితురాలితో కలసి బెంగళూరులోనే తన భర్త గౌరీశంకర్‌ను హతమార్చేందుకు వివాహానికి ముందే పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో పార్వతీపురం ఏఎస్పీ ఆదేశాల మేరకు బెంగళూరులో ఉన్న సరస్వతి స్నేహితురాలిని కూడా విచారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరులో హత్య చేయడం కుదరకపోవడంతో విశాఖకు చెందిన రౌడీలతో జిల్లాలో హత్య చేయించారు. వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ఐటీడీఏ పార్క్ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'నారాయణ' విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లా హాలియ పట్టణానికి చెందిన గౌరీశంకర్ మాదాపూర్‌లోని నారాయణ సమతా క్యాంపస్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా గౌరీ శంకర్ కనిపించడం లేదు. అయినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు..విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదు. కాగా తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమారుడి ఆచూకీ తెలయజేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు.