breaking news
Govardhan Rao Devarakonda
-
నాన్నే... దేవర ఆయనే కొండ!
నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆనంద్ దేవరకొండ తన తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘ఆయన దేవుడిలాంటివాడు... మాకు కొండంత అండ’ అన్నట్లుగా చెప్పారు. ‘ఆయనే దేవర... ఆయనే కొండ’ అనే తరహాలో తన తండ్రి గురించి ఈ హీరో చెప్పిన విశేషాల్లో ఆసక్తికరమైనవి.‘తప్పు చేస్తేనే ఒప్పు ఏంటో తెలుస్తుంది’... తన పిల్లలకు గోవర్ధన్ రావు దేవరకొండ ఇచ్చిన స్వేచ్ఛ ఇది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ తండ్రి చెప్పిన మాటలు వింటూ జీవితాన్ని నేర్చుకున్నారు. విజయ్ దేవరకొండ ‘సెన్సేషనల్ స్టార్’, విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ‘స్పేస్’ సృష్టించుకున్న స్టార్ ఆనంద్ దేవరకొండ. → నాన్నతో ఫ్రెండ్షిప్చిన్నప్పటి నుంచే... అంటే నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. మా తల్లిదండ్రులు నెలకు ఒకటి లేదా రెండుసార్లు చూడ్డానికి వచ్చేవారు. సో... హాస్టల్లో గడిపిన ఆ పది నెలల సమయంలో మా అమ్మానాన్న వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించేది. అందుకే వేసవి సెలవుల్లో వారితో పూర్తిగా గడిపేవాడిని. అది ఎంతో విలువైన సమయం. ఆ సమయంలోనే స్నేహంలాంటి అనుబంధం బలపడింది. అలా మా నాన్నతో నా ఫ్రెండ్షిప్ మొదలైంది. మా ఇంటి ముందు క్రికెట్ ఆడిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఉదయం 7 గంటలకు నాన్నను లేపేవాణ్ణి. నేను బ్యాటింగ్ చేస్తుంటే ఆయన గంటల తరబడి బౌలింగ్ చేసేవారు. నా జీవితంలో ఒక దశలో నేనేం చేయాలనుకుంటున్నాననే విషయంపై నాకు స్పష్టత లేదు. అప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, తమ సామర్థ్యానికి మించిన మొత్తాన్ని సమకూర్చి మాస్టర్స్ చదవడానికి నన్ను అమెరికా పంపించారు. ఆ అనుభవాలు, అక్కడ గడిపిన కాలం నన్ను వ్యక్తిగా పూర్తిగా మార్చేశాయని నేను నమ్ముతాను.→ కొండంత ధైర్యంమా నాన్న అన్ని విషయాల్లోనూ నాకు కొండంత ధైర్యం ఇస్తుంటారు. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అవసరమైనప్పుడు తన సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లొచ్చనే నమ్మకాన్ని ఇచ్చారు. మా నాన్న ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి. ‘విజయాన్ని కాకుండా ఎదుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని ఆయన చెప్పిన మాటలు మా మనసులో నాటుకుపోయాయి. చిన్నప్పటి నుంచే మేము తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చారు. నేను, నా అన్న తప్పులు చేసినందుకు ఎప్పుడూ శిక్ష పడలేదు. కానీ ఆ తప్పు గురించి మా నాన్న మాతో మాట్లాడేవారు. ఆ మాటలు మమ్మల్ని బాగా ప్రభావితం చేసేవి. దాంతో ఎలాంటి సవాళ్లనైనా, ఎదురు దెబ్బలనైనా ఎలా అధిగమించాలనే విషయంలో మాకు అవగాహన వచ్చింది. మామూలుగా నాన్నంటే భయం ఉండటం సహజం. అయితే మా ఇద్దరిలో ఎవరికీ ఆయనంటే భయం లేదు. నాన్నపై అపారమైన గౌరవం, ప్రేమ మాత్రమే ఉన్నాయి.→ మా నాన్న మంచి విశ్లేషకుడుమా వర్క్ గురించి, సినిమా ఎడిట్స్ గురించి తరచూ మాట్లాడుకుంటుంటాం. ఒక సినిమా ఎలా వర్కవుట్ అవుతుంది? వర్కవుట్ కాదనే విషయాలను అంచనా వేయడంలో మా నాన్నకు మంచి అవగాహన ఉంది. అందుకే సినిమా ఎడిటింగ్ దశలో ఉన్నప్పుడు ఆయన అభి్రపాయాన్ని, విశ్లేషణను తప్పకుండా అడుగుతుంటాను.→ పెద్ద హగ్తల్లిదండ్రుల ప్రేమకు వెలకట్టలేం. వారు కనబరిచే ప్రేమకు ఏం చేసినా తక్కువే. మా నాన్న ఎంతో ఇష్టపడే ‘ఫార్మ్’ని, మా విలేజ్‌లో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నా ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బుతో కొనిచ్చే బహుమతులకన్నా ప్రేమతో ఇచ్చే ‘హగ్’ చాలా పెద్దది. అందుకే ఈ ఫాదర్స్ డేకి మా నాన్నకు ఒక పెద్ద హగ్ రూపంలో బహుమతి ఇవ్వబోతున్నాను. అలాగే ఈ ఏడాది చివర్లో కుటుంబంతో కలిసి ఒక ట్రిప్ ΄్లాన్ చేయాలనుకుంటున్నాను. ఆ విషయంలోఆయనే స్ఫూర్తిమా ఇంట్లో అందరం ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తాం. మా నాన్న కాస్త ఎక్కువ. నేను, అన్న ఏం చెప్పకుండానే తన వ్యాయామం, ఆహారం, జీవనశైలిని ఎంతో క్రమశిక్షణతో పాటి స్తారు. ఈ విషయంలోనూ ఆయన మాకు స్ఫూర్తిగా ఉంటారు.నా ఫస్ట్ హిట్‌కి హ్యాపీమా నాన్న సంతోషపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు, విదేశాల్లో ఉద్యోగం సంపాదించినప్పుడు, నా మొదటి లైవ్ థియేటర్ ప్రదర్శన సమయంలో, అలాగే నా ఫస్ట్ సినిమా ‘బేబి’ సక్సెస్ అయినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డారు. మా నాన్నకు చిరంజీవిగారంటే ఎంతో అభిమానం. ‘బేబి’ సినిమాలో నా నటన గురించి ఆయన ప్రశంసించినప్పుడు మా నాన్న గర్వంగా, ఆనందంగా ఫీలయ్యారు.గర్వంగా ఫీలవుతారు..అన్న పెళ్లి మా నాన్నకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. చిన్నప్పుడు ఆయనకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అయితే అది నెరవేరలేదు. అన్న, నేను యాక్టర్స్‌గా ఉన్నందుకు ఆయనకు ఆనందంగా, గర్వంగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురం (విజయ్ భార్య, హీరోయిన్ రష్మికని ఉద్దేశించి) సినీ పరిశ్రమలో ఉన్నాం. ఇంటికి వచ్చేవారికి ఆయన ఈ విషయం గర్వంగా చెబుతుంటారు. అంతేకాదు, వదినకు కూడా ఆయన ఫాదర్ ఫిగర్‌లా మారిపోయారు.– ఆనంద్ దేవరకొండ– డి.జి. భవాని -
నా కొడుకును బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గడ్డుకాలం నడుస్తోంది. గతకొంతకాలంగా సరైన హిట్ లేక నీరుగారిపోయిన అతడికి ఖుషి సినిమా సక్సెస్‌ను తెచ్చిపెట్టింది, కానీ దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. కారణం.. ఖుషి హిట్ కొట్టిన ఆనందంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు విజయ్. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, విజయ్ ప్రకటన చూసిందే ఆలస్యం ఓ నిర్మాణ సంస్థ కౌంటర్‌కు దిగింది. పబ్లిక్‌గా టార్గెట్ 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం' అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీంతో విజయ్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి సినిమా లాభనష్టాలనేది నిర్మాత- డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వ్యవహారం. కానీ ఇలా పబ్లిక్‌గా డబ్బులివ్వమని హీరో విజయ్ను టార్గెట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్ సగం వెనక్కు తాజాగా ఈ వ్యవహారంపై విజయ్ తండ్రి గోవర్దన్ రావు స్పందించాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆడనప్పుడు విజయ్ తన రెమ్యునరేషన్లో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్ చాలాకాలంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కు తెలియదు. అలాంటిది ఇప్పుడేకంగా సోషల్ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సింది. విజయ్ అతడితో సినిమాలు చేయడు అభిషేక్ నా కొడుకును బ్లాక్మెయిల్ చేయాలని చేస్తున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఓసారేమో విజయ్ మార్కెట్ పడిపోయిందంటాడు. మరోసారి విజయ్‌తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు పొంతన కుదరడం లేదు. అయినా ఇప్పటికే విజయ్.. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు. కాబట్టి అతడి డేట్స్ ఖాళీగా లేవు. అభిషేక్ నామాతో విజయ్ సినిమాలు చేయడు' అని చెప్పుకొచ్చాడు. Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 చదవండి: రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..


