govenment hospital
-
ప్రవాసాంధ్రుల దాతృత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కట్టడి చర్యలకు ప్రవాసాంధ్రులు సాయం అందించారు. సుమారు రూ.4,28, 08,885 విలువైన వైద్య పరికరాలను ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు అందించారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి, సీఈవో కె.దినేష్‌కుమార్, భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన వైద్య పరికరాల వివరాలను స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వాటిని సేకరించడంలో ఏపీఎన్ఆర్టీఎస్ విశేష కృషి చేస్తోందంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ పనిచేస్తోందని వెంకట్ మేడపాటి అన్నారు. ఏపీకి వైద్య పరికరాలను పంపాలనుకునే వారికి వివిధ దేశాల్లో ఉన్న తమ కోఆర్డినేటర్లు సాయం అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 70 ఏరియా, పెద్దాస్పత్రులకు వైద్య సామగ్రి పంపిణీ జరిగిందన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీలకు చెందిన పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. చదవండి : ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా
-
డాక్టరమ్మ.. లేదమ్మా!
సాక్షి, నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రాస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక గర్భిణులు, బాలింతలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతకాలం ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇద్దరు గైనకాలజిస్ట్లు బదిలీపై వచ్చారు. కోర్సు ముగియడంతో వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు కొత్తవారిని నియమించకపోవడంతో ఆ ప్రభావం గర్భిణులపై పడుతోంది. పురిటినొప్పులతో కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చినవారికి నర్సులే దిక్కవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆస్పత్రులను మార్చాయలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే 102 అంబులెన్స్, కేసీఆర్ కిట్‌ను తీసుకొచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను విడతల వారీగా ఇవ్వడంతో సామాన్యులు సైతం ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి వస్తున్నారు. ఈ కారణంగా ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టు ఏరియా ఆస్పత్రిని జి ల్లా ఆస్పత్రిగా మార్చినా దానికి అనుగుణంగా వై ద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ వి ఫలమైంది. దీనికి కారణాలేమైనా గర్భిణులు పు రిటి నొప్పులతో వచ్చి గైనకాలజిస్టు లేదని తెలిసి ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కార్పొరేట్ వైద్యం ఎక్కడా? ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరుగుతాయని ఆశించి ప్రతినెలా చెకప్‌లు చేయించుకోవడానికి సైతం సర్కారు దవాఖానాలకే వస్తున్నారు పేదలు, సామాన్యులు. సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా గైనకాలజిస్టులు, అనస్థీషియన్, పీడియాట్రిస్ట్‌లు, స్టాఫ్‌నర్స్‌లను నియమించక పోవడంతో కొర్పొరేట్ వైద్యం సరికదా సాదాసీదా వైద్యం కూడా అందడంలేదు. కంటి తుడుపు చర్యగా రోజుకు రెండు, మూడు చొప్పున ప్రసవాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బుధవారం నుంచి కోర్సుపై పనిచేస్తున్న గైనకాలజిస్ట్లు సైతం వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రి మొత్తానికి గైనకాలజిస్ట్ లేకుండా పోయారు. అన్నింటా ఇదే సమస్య జిల్లా ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్సీల్లోనూ వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఎక్కడ చూసినా వైద్యులు లేక ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సైతం ఇన్చార్జి అధికారే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేందుకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ గైనకాలజిస్ట్‌పై ఆధారపడి ఉండటంతో అవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రితో పాటు 178 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఏఎన్ఎంలు 88 మంది ఉండగా, 16 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. సెకండ్ ఏఎన్ఎంలు 178 మంది ఉండాల్సి ఉండగా 162 మంది ఉన్నారు. వారితోపాటు యురోపియన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఏఎన్ఎంలు 39మందికి 25మందే ఉన్నారు. అలాగే 944 మంది ఆశా కార్యకర్తలు అవసరం కాగా 921 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా డీఎంహెచ్ఓ పరిధిలో 62మంది ఎంబీబీఎస్ వైద్యులకు గానూ 48 మంది ఉండగా వీరిలో 12మంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. మరో 14 ఖాళీలు ఉన్నాయి. ఫార్మాసిస్టులు 31మందికి గానూ 19మంది రెగ్యులర్, ఆరుగురు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. నలుగురు డెంటల్ వైద్యులు ఉన్నారు. ఇవీ చేయాల్సినవి.. ప్రతి పీహెచ్సీలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రతి సీహెచ్‌సీలో ఒక మత్తు డాక్టర్‌తో పాటు ఇద్దరు చొప్పున డీజీఓ (స్త్రీల వైద్య నిపుణులు) అవసరం. అలాగే ఇద్దరు మత్తు డాక్టర్లు, నలుగురు డీజీఓలు ఉండాలి. ప్రతీ సీహెచ్‌సీ కేంద్రాల్లో చిన్నపిల్లల వైద్యులు ఒకరు అవసరం. ముఖ్యంగా డీఎంహెచ్ఓ పోస్టు రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తే ప్రజలకు వైద్య సేవలు చేరువవుతాయి. జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు 20మంది ఉండాలి. హెడ్ నర్సులు ముగ్గురు ఉండాలి. అన్ని విభాగాల్లో కనీసం 9 మంది వైద్యులు, ఐదుగురు సర్జన్లు, మత్తు వైద్యుడు ఉండాలి. ప్రతిపాదనలు పంపించాం జిల్లా ఆస్పత్రిలోని సమస్యలు, పరిష్కారాలపై ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను పంపాం. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు, డయాలసిస్ కేంద్రాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఇదే స్థాయిలో గర్భిణులకు సైతం నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించనున్నాం. ప్రస్తుతం గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా ఓ డాక్టర్‌ను నియమించాం. త్వరలోనే గైనకాలజిస్ట్ పోస్టులు భర్తీ చేయిస్తాం. – డాక్టర్ రాకేష్‌చంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
జ్వరమా..! అయితే లైన్లో నిలబడు..!!
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. మందులమాట పక్కన పెడితే కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఆపత్కాలంలో ఇక్కడికొచ్చే నిరుపేద రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే వైద్యులు ఇష్టానుసారం డ్యూటీలు చేస్తుండడంతో నిరుపేదలకు హౌస్ సర్జన్లే దిక్కవుతున్నారు. ఇక జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ ఎంఆర్ఐ, ఆల్ట్రాసౌండ్ సేవలు అందుబాటులో లేవు. మందుల కొరత పట్టిపీడిస్తుండగా..రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. అధునాతన యంత్రాలుదిష్టిబొమ్మలుగా మారడంతో రోగులంతా అప్పులు చేసి మరీ ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: అనంతపురంలోని సర్వజనాస్పత్రి జిల్లాకే పెద్దదిక్కుగా ఉంది. జిల్లాలోని నిరుపేదలంతా ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా ఇక్కడికే పరుగుల వస్తారు. కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. మందుల్లేవ్ ఆస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఈ మూడు నెలల కాలానికి సంబంధించి 600 రకాల మందులు ఇంత వరకు సరఫరా కాలేదు. గతంలో వచ్చిన మందులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు కాటన్, సర్జికల్ గ్లౌస్ పూర్తిస్థాయిలో లేవు. దీంతో గైనిక్, సర్జికల్, మెడిసిన్, ఏఎంసీ, ఆర్థో, తదితర విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. స్కానింగ్ సేవలు బంద్ ఆస్పత్రిలో 14 రోజులుగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు బంద్ అయ్యాయి. అందుబాటులో ఉన్న ఒక్క రేడియాలజిస్టు లేకపోవడంతో స్కాన్ సెంటర్‌ను మూసి వేశారు. దీంతో రోజూ 50 స్కాన్ జాప్యం జరుగుతోంది. ఎంఆర్ఐ ఊసే లేదు సర్వజనాస్పత్రికి ఎంఆర్ఐ మంజూరైనా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో ఎంఆర్ఐ ఏర్పాటుకి నిర్మాణ పనులు చేపట్టారు. ఎప్పటిలోపు పనులు పూర్తవుతాయో తెలియడం లేదు. అత్యవసర కేసులను మాత్రం ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్‌గా చేయిస్తోంది. గంటపాటు క్యూలోనే స్ట్రెచర్‌పై ఉన్న వ్యక్తి పేరు శ్రీనివాసులు.యాడికి మండలం బోరెడ్డిపల్లి. ఛాతి నొప్పి రావడంతో కుటుంబీకులు ఉదయం 10.14 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకు వెళితే ఓపీకి వెళ్లమన్నారు. గంటపాటు క్యూలో నిలుచుని ఓపీ నంబర్ 15కి వెళ్లగా.. అక్కడి వైద్యురాలు పరీక్షించకుండానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లమన్నారు. దీంతో కుటుంబీకులు 11.25కు మళ్లీ ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఏఎంసీకి అడ్మిషన్ రాయగా, అడ్మిషన్ కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరకు 1.25 గంటలకు ఆస్పత్రిలో అడ్మిషన్ చేశారు. కటికనేలపైనే నగరానికి చెందిన లక్ష్మి ఈ నెల 17 ఆస్పత్రిలో అడ్మిషన్ కాగా అబార్షన్ అయ్యింది. గైనిక్ వార్డులోనే వైద్యులు అడ్మిట్ చేశారు. మంచ లేకపోవడంతో నేలపైనే పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని లేబర్, పోస్టునేటల్, మెడిసిన్, ఆర్థో, ఎంఎస్ 1, 2, ఎఫ్ఎస్ 1,2 వార్డుల్లో నెలకొంది. సర్వజనాస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా నమోదైనా ఆ స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పురంలో వెరీపూర్ హిందూపురం అర్బన్: జిల్లా ఆస్పత్రిగా హిందూపురంలో వైద్యసేవలు వెరీపూర్గా ఉన్నాయి. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా సేవలు మాత్రం ఆ మేరకు అందడం లేదు. రోజూ 1,500 మంది దాకా ఓపీ ఉన్నప్పటికీ ఆ మేరకు వైద్యులు, సిబ్బంది లేరు. ఈ కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. మందుల కొరత వేధిస్తుండడంతో జనం బయట కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రిలో రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండడంతో వ్యాధి నిర్ధారణ కష్టంగా మారింది. అందువల్లే ఇక్కడి వైద్యులు అన్ని రోగాలకు ఒకే రకంగా వైద్యం చేస్తున్నారు. దీంతో డిశ్చార్జి అయిన రెండు, మూడు రోజుల్లోనే జనం మళ్లీ రోగాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. మూలనపడ్డ పరికరాలు ఆస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), సర్జికల్, చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు మూలపడ్డాయి. నూతనంగా వెంటిలేటర్లు రావడంతో పాత వాటిని మరమ్మత్తులు చేయించడం లేదు. ఇక ఆర్థో, సీఎస్ఎస్డీ విభాగాల్లో ఆటోక్లేవ్ మిషన్ ఒకటి పనిచేయడం లేదు. దీంతో కాటన్ తదితర వాటిని స్టెరిలైజ్ పూర్తి స్థాయిలో చేయడం లేదని సిబ్బందే చెబుతున్నారు. నూతనంగా వచ్చిన ఆటోక్లేవ్‌లను వాడకుండా మూలకుపెట్టారు. ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదు. హౌస్సర్జన్లే దిక్కు సర్వజనాస్పత్రి రెగ్యులర్ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న హౌస్సర్జన్లే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. సోమవారం గైనిక్, లేబర్ ఓపీలతో పాటు లేబర్ వార్డులోనూ హౌస్సర్జన్లే సేవలందించారు. అలాగే చిన్నపిల్లల విభాగంలోని ఎస్ఎన్సీయూలోనూ హౌస్ సర్జనే చిన్నారులను చూసి మందులు రాశారు. అరకొర సేవలు గుంతకల్లు: పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి అరకొర వైద్యసేవలతో నెట్టుకొస్తోంది. గుంతకల్లు మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు మండలాల వారే కాకుండా సరిహద్దులోని కర్నూలు జిల్లా మద్దికెర, చిప్పగిరి మండలాల వారంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే వస్తుంటారు. దీంతో రోజూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య 50 కిపైగానే ఉంటుంది. గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండడం లేదు. సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. తగినంత సిబ్బంది లేక అటెండర్ల వైద్యం చేస్తున్నారు. బ్లడ్ స్టోరేజీ ఫ్రిడ్జ్ కాలిపోవడంతో రక్తం నిల్వచేయడం లేదు. దీంతో అత్యవసరంలో రక్తం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని ఓ ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడంతో జనం ప్రైవేటుకు వెళ్తున్నారు. -
చనిపోయినా పట్టించుకోలేదు
• అనంతపురం సర్వజనాస్పత్రిలోని టీబీ వార్డులో చికిత్స పొందుతూ మహిళ మృతి • గంట వరకూ పట్టించుకోని వైద్య సిబ్బంది • భయభ్రాంతులకు గురైన ఇతర రోగులు అనంతపురం సిటీ : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బందికి అలవాటుగా మారిపోయింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వీరి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మరో సంఘటనను పరిశీలిస్తే.. స్థానిక పెద్దాస్పత్రిలోని టీబీ వార్డులో చికిత్స పొందుతూ అనంతపురం రూరల్ మండలం నారాయణరెడ్డి(ఎన్ఆర్) కాలనీకి చెందిన అంజినమ్మ(50) ఆదివారం రాత్రి 7 గంటలకు మృతి చెందింది. ఆయాసంతో బాధపడుతూ రెండ్రోజుల కిందట ఆమె ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చేరిన రోజు మాత్రం పెద్ద డాక్టర్ ఒకరు ఏమైందని అడిగి చూసి వెళ్లారన్నారు. ఆ తరువాత ఎవరూ రాలేదని చెప్పారు. పైగా ఆయాసం ఎక్కువైనా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని నర్సులకు చెబితే.. ఏం కాదులేమ్మా.. అంటూ చెప్పుకొచ్చారన్నారు. ఆదివారం కావడంతో ఏ ఒక్క డాక్టర్ ఇటువైపు తొంగి చూసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరకు డాక్టర్లు ఎవరూ రారని చెప్పడంతో తామంతా ఇంటికెళ్లామని, అంతలోనే అంజినమ్మ చనిపోయిందంటూ ఫోన్ వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో చికిత్స చేసి ఉన్నట్లైతే ఒక నిండుప్రాణం పోయేది కాదని వాపోయారు. కాగా అంజినమ్మ మృతి చెందిన గంటకు గానీ సిబ్బంది ఎవరూ స్పందించకపోవడంతో అదే వార్డులోని ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోగా, మీడియా వారు ఫొటోలు తీసి, బాధితులతో మాట్లాడుతుండడం చూసిన సిబ్బంది అప్పటికప్పుడు నానా హడావుడి చేస్తూ కనిపించారు.