ఆధార్ లింక్‌పై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో దీనిపై ఉన్న రెండు కీలక అంశాలపై మధ్యాహ్నం రెండుగంటలకు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. ప్రభుత్వ పథకాల్లో అర్హతకు ఆధార్ కార్డు అనేది ఒక అప్షన్‌గా ఉండాలా లేదా అనే దానిపై ఈ విచారణలో తేల్చనున్నారు.
దీంతోపాటు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింపుపైనా కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆధార్ కార్డును వివిధ ప్రభుత్వ పథకాలకు అనుసంధానించడాన్ని సవాల్ చేస్తూ పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.