government high schools
-
సబ్జెక్టు టీచర్లుగా అర్హులైన ఎస్జీటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ హైస్కూళ్లు, ఇతర ప్రీ హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. నూతన విధానంలోని స్కూళ్లలో 3వ తరగతి నుంచి సబ్జెక్టుల బోధనకు సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీలు)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భావించింది. దీనికోసం తగిన అర్హతలున్న 2,095 మంది ఎస్జీటీలతోపాటు మరో 3,714 మంది మొత్తం 5,809 మంది ఎస్జీటీలకు పదోన్నతి ఇవ్వడానికి జీవో నంబర్లు 117, 128 ను విడుదల చేసింది. వీటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. కోర్టు ఆదేశాలతో పదోన్నతుల ప్రక్రియ పూర్తికాలేదు. అయితే విద్యార్థులకు సబ్జెక్టు బోధనకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 5,809 మందినీ తాత్కాలికంగా సబ్జెక్టు బోధన చేసేలా చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమై, వీరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే వరకు సబ్జెక్టు బోధన చేస్తారు. ఇందుకు వీరికి నెలకు రూ. 2,500 చొప్పున సబ్జెక్టు టీచర్ అలవెన్స్ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మెమో జారీచేశారు. -
ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి
‘చదువుల మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. నిజమైన ఆస్తి అదే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా బతకగలిగే శక్తి చదువు ద్వారానే సమకూరుతుంది. అలాంటి నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ వెల్లివిరియాలి’ – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించలేని పరిస్థితి ఎవరికీ రాకూడదనే సంకల్పంతో విద్యార్థుల చదువులకు అడుగడుగునా అండగా నిలుస్తూ మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాగుండాలనే తపనతో నాణ్యమైన విద్యా బోధన దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తల్లులు తమ పిల్లల చదువులను ఒక తపస్సులా భావించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో వరుసగా మూడో ఏడాది అమ్మ ఒడి పథకం కింద రూ.6,595 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. చదువొక హక్కుగా.. విద్యాధికులున్న దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఎక్కువగా ఉండటానికి కారణం చదువులే. ఏ ప్రభుత్వమైనా చదువుల మీద వెచ్చించే ఒక్క పైసా కూడా వృథా చేస్తున్నట్లు కాదు. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే గొప్ప పెట్టుబడిని విమర్శించడం సరికాదు. రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ మంచి చదువులను ఒక హక్కుగా, బాధ్యతగా అందిస్తున్నాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ మూడో ఏడాదీ అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి నాకెంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం. ఇవాళ మూడో విడత కింద రూ.6,595 కోట్లు అందజేస్తున్నాం. దీని ద్వారా 43,96,402 మంది తల్లులకు, దాదాపు 80 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఒక్క అమ్మ ఒడి ద్వారానే మూడేళ్లలో రూ.19,618 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని స్కూల్ ఏదైనా.. పిల్లలను బాగా చదివించండి. మీకు తోడుగా నేనున్నా. బడికి పంపితే చాలు. అది ప్రైవేట్ స్కూల్ అయినా, ఎయిడెడ్ అయినా, ప్రభుత్వ స్కూలైనా.. ఎక్కడ చదివించినా జగన్ మామకు అభ్యంతరం ఉండదు. పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యం. బడికి పంపితే ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి ద్వారా అందిస్తాం. ఎంత ఎక్కువ మంది తల్లులకు అమ్మ ఒడి అందితే నాకు అంత ఆనందం. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది. అందుకే కనీసం 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని జీవో ఇచ్చే రోజే నిబంధన పొందుపరిచాం. కోవిడ్ తదితర కారణాలతో రెండేళ్లు మినహాయింపు ఇచ్చినా గత సెప్టెంబర్ నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తున్నందున హాజరు నిబంధన అమల్లోకి వచ్చింది. బాధాకరమైనా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా.. 2021–22లో దాదాపు 51 వేల మంది తల్లులు అమ్మ ఒడి లబ్ధి అందుకోలేకపోయారు. 44,47,402 మంది తల్లులకు గాను ఒక్క 51 వేల మంది తల్లులకు మాత్రం ఇవ్వలేకపోయాం. దీన్ని మరోరకంగా చెప్పాలంటే 43,96,402 మంది తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అందించగలిగా>ం. 1.14 శాతం మందికి మాత్రమే ఇవ్వలేకపోయాం. ఆ తల్లులకు ఇవ్వలేకపోవడం చాలా బా«ధాకరమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 75 శాతం హాజరుతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఇక్కడొక బృహత్తర యజ్ఞం జరుగుతోంది. పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపే బాధ్యతను అక్కచెల్లెమ్మలు తీసుకోవాలని కోరుతున్నా. ఎప్పటికీ అలాగే ఉండేలా... నాడు – నేడుతో రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు ఎప్పటికీ అలాగే ఉండేందుకు, పరిశుభ్రమైన టాయిలెట్ల కోసం టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ (టీఎంఎఫ్) ఏర్పాటు చేసి అమ్మ ఒడిలో కాస్త సొమ్ము కేటాయిస్తున్నాం. పాఠశాలలు నిరంతరం బాగుండాలంటే మరమ్మతులు ఎప్పటికప్పుడు వెంటనే చేపట్టాలి. అందుకనే అమ్మ ఒడి సొమ్ములో కాస్త సొమ్మును స్కూళ్ల నిర్వహణ కోసం ఎస్ఎంఎఫ్ కింద కేటాయిస్తున్నాం. స్కూళ్ల బాగోగుల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2 వేలు కేటాయించడం వల్ల ప్రశ్నించే అవకాశం వారికి ఒక హక్కుగా వస్తుంది. దీనిపై విమర్శలు చేసే ఏ ఒక్కరైనా చదివించే తల్లికి ఒక్క రూపాయైనా ఇచ్చారా? ఏనాడూ రూపాయి ఇవ్వనివారు ఇవాళ సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎగ్గొట్టే ప్రభుత్వమైతే ఇంత చేస్తుందా? ఇది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేస్తామా? మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావిస్తూ ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. డబ్బులు ఎగ్గొట్టాలనుకుంటే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపిస్తామా? దేశంలో అతి పెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటామా? ఏటా రూ.24 వేలు ఖర్చు కానీ అందుబాటులోకి రాని బైజూస్ యాప్ ఇవాళ పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి వస్తున్న విషయం వాస్తవం కాదా? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు 8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఈ సెప్టెంబర్ నుంచే రూ.12 వేల ఖరీదైన ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తాం. రూ.500 కోట్లతో 4.7 లక్షల ట్యాబ్‌లను అందచేస్తాం. విద్యా కానుకతో పాటు ట్యాబ్ అందిస్తాం. వీరంతా 2025లో పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ నమూనాలో రాస్తారు. ప్రతి తరగతి గదిలోటీవీ లేదా డిజిటల్ బోర్డు నాడు – నేడు ద్వారా సమకూరుస్తున్నాం. బైజూస్ యాప్ ద్వారా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ కంటెంట్ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఇదే కంటెంట్‌ను పాఠ్యపుస్తకాల్లో అనుసంధానిస్తున్నాం. ఇవన్నీ మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలని, తలరాతలు, బతుకులు మారాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. విద్యారంగంపై రూ.55 కోట్ల వ్యయం విద్యా రంగంపై మూడేళ్లలో పెద్ద ఎత్తున వ్యయం చేశాం. అమ్మ ఒడి కింద రూ.19,618 కోట్లు, విద్యా దీవెనకు రూ.8 వేల కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. గోరుముద్ద కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. విద్యాకానుక ద్వారా రూ.2324 కోట్లు వ్యయం చేశాం. నాడు పేదపిల్లల చదువుకి చంద్రబాబు సర్కారు ఏదో ముష్టి వేసినట్లుగా ఏడాదికి రూ.120 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకొంది. నాడు–నేడు కింద 15,715 స్కూళ్లను తొలిదశలో రూ.4 వేల కోట్లు వెచ్చించి రూపురేఖలు మార్చాం. రెండో దశలో మరో 22,344 స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం రూ.8 వేల కోట్లుతో కొనసాగుతోంది. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలల పాటు బకాయిలు పెట్టి ఆయాలకు కనీసం జీతాలు చెల్లించలేదు. కూరగాయలు, సరుకుల బిల్లులు కట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలను చెల్లించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద మేం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు హయాంలో రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు. టీడీపీ సర్కారు విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజుల బకాయిలు పెట్టి దిగిపోయింది. జగనన్న ప్రభుత్వమే ఆ మొత్తమంతా తీర్చింది. ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఫలితంగా 2018–19లో టెన్త్‌లోపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 37.21 లక్షలు కాగా 2021–22లో 44.30 లక్షలకు పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల మందికిపైగా విద్యార్థులు పెరిగారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయనకు ఎన్నడూ ఇలాంటి ఆలోచనలు రాలేదు. చంద్రబాబుకుగానీ, దుష్ట చతుష్టయంలోని రామోజీరావు, టీవీ 5, ఏబీఎన్కుగానీ ఏనాడైనా నిజాలు చెప్పే ధైర్యం ఉందా? జగనన్న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ ఆశీస్సులుండగా వెంట్రుక కూడా పీకలేరు.. మంచి చేసే ప్రభుత్వం మీద, మీ జగన్ మామయ్య మీద, మీ జగన్ అన్నపైన విమర్శలు చేసేవారు ఎలాంటివారో ఒకసారి గమనించాలి. యుద్ధం ఇవాళ నేరుగా జరగడం లేదు. కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. మారీచులతో, దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబుతోనే కాదు ఈనాడుతో, టీవీ–5తో, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం. వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరందరితో ఒకే ఒక్క జగన్ పోరాటం చేస్తున్నాడు. మీ జగన్‌కు.. ఈనాడు తోడు లేకపోవచ్చు.. ఆంధ్రజ్యోతి, టీవీ–5, రామోజీరావు తోడు లేకపోవచ్చు. కానీ మీ జగన్‌కు మీమీద నమ్మకం ఉంది. మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ వారంతా కలిసినా మీ జగన్ వెంట్రుక కూడా పీకలేరు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. మన ప్రభుత్వం ద్వారా మన ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే చూడండి. చేసిన మేలును కొలబద్ధగా తీసుకోండి. జగనన్న వల్ల మంచి జరిగిందనుకుంటే మద్దతు ఇవ్వండి. దేవుడి దయతో ఇంకా మంచి జరగాలి. మీరంతా ఆశీస్సులివ్వాలి. సిక్కోలుపై వరాల జల్లు ► శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ వరాలు జల్లు కురిపించారు. వేదికపై మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ప్రజాప్రతినిధుల విన్నపాలపై స్పందించి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ► టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం బాగు చేసేందుకు రూ.10 కోట్లు ► ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పూర్తి చేసేందుకు అదనంగా రూ.69 కోట్లు ► శ్రీకాకుళం–ఆమదాలవలస నాలుగు లైన్ల రహదారి పనుల భూసేకరణ, యుటిలిటీ కింద అదనంగా రూ.18 కోట్లు ► గొట్టా బ్యారేజీ వద్ద లిప్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు రూ.189 కోట్లు మంజూరు. ► మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్‌గా రూ.855 కోట్లు మంజూరు. యుద్ధ ప్రాతిపదికన పనులు ► వంశధార ఫేజ్ 2లో రెండో దశ పనుల పూర్తికి అంచనా వ్యయం రూ.1616.23 కోట్ల నుంచి రూ. 2,407.79 కోట్లకు పెంపు. ప్రాజెక్టు పూర్తి చేసి డిసెంబర్లో జాతికి అంకితం. ► ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తి. ప్రాజెక్టు పరిధిలోకి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలతో పాటు పాతపట్నంలోని మూడు మండలాలు. ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.265 కోట్లు మంజూరు. దాదాపు రూ.1000 కోట్లతో కిడ్నీ ప్రభావిత గ్రామాలకు వంశధార నుంచి నీళ్లిచ్చేలా పనులు. ఆంగ్లంలో నిహారిక ఆహా శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గురుగుబిల్లి నిహారిక ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. అమ్మ ఒడితో పాటు పలు పథకాల ద్వారా తన లాంటి లక్షల మంది విద్యార్థులకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరించింది. ‘జగన్ మావయ్యా.. మీరు రాజన్నకి పుత్రుడు. రైతన్నకి మిత్రుడు. అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ముడు. మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’ అంటూ కృతజ్ఞతలు తెలియచేసింది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బాలిక ప్రతిభకు సీఎం జగన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముగ్దులయ్యారు. -
దశలవారీగా సీబీఎస్ఈ అమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరం నాటికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానం అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను చేపట్టింది. విద్యార్థి కేంద్రంగా సబ్జెక్టు ప్రాధాన్యతతో కూడిన బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. నూతన విద్యావిధానం ప్రకారం.. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఆరంచెలు (శాటిలైట్ స్కూళ్లు, ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్)గా స్కూళ్లను తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. మ్యాపింగ్ విధానం ద్వారా అంగన్వాడీ స్థాయిలో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెస్తారు. అలాగే 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టులను బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ)లతో బోధన కోసం సమీపంలోని హైస్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టారు. ఆరంచెల విధానంలో ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు వీరిని అనుసంధానం చేస్తున్నారు. ఇలా ఏర్పాటయ్యే ఈ హైస్కూళ్లలో సీబీఎస్ఈ అమలు కానుంది. కేంద్రానికి ప్రతిపాదనలు.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), ఆదర్శ పాఠశాలలు, వివిధ గురుకుల పాఠశాలలతోపాటు కొన్ని జెడ్పీ హైస్కూళ్లలో (మొత్తం 1,092) సీబీఎస్ఈ అమలుకు అధికారులు ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. ఈ స్కూళ్లలో దశలవారీగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 8వ తరగతి వరకు నాన్ సబ్జెక్టుల్లో పూర్తిగా రాష్ట్ర సిలబస్ అమలు కానుండగా సబ్జెక్టులు సీబీఎస్ఈ సిలబస్‌లో ఉంటాయి. 9, 10 తరగతులు మాత్రం పూర్తిగా సీబీఎస్ఈలో ఉంటాయి. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హైస్కూళ్లలో 9 మంది సబ్జెక్టు టీచర్లు, 1 హెడ్ మాస్టర్ (హెచ్ఎం), 1 ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) మొత్తం 11 మంది ఉండనున్నారు. ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో ఒకే మాధ్యమం అమల్లో ఉండగా మరికొన్నింటిలో వేర్వేరు మాధ్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో మాధ్యమం ఉన్న స్కూళ్లలో అదనపు సబ్జెక్టు టీచర్లను నియమించనున్నారు. 2024–25 నాటికి ఈ స్కూళ్లన్నీ ఒకే మాధ్యమంలోకి మారడంతోపాటు సీబీఎస్ఈ విధానంలో కొనసాగనున్నాయి. 31,312 మంది ఎస్జీటీలకు ఎస్ఏలుగా అవకాశం ఆరంచెల విధానంలో హైస్కూల్, ప్రీ హైస్కూళ్లకు 3, 4, 5 తరగతుల విద్యార్థులను అనుసంధానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కూళ్లలోని కింది తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా పనిచేస్తున్న 31,312 మందికి స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)లుగా అవకాశం దక్కనుంది. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియ అనంతరం 3,676 ప్రీ హైస్కూళ్లు (3–8 తరగతులు)గా, 5,202 హైస్కూళ్లు (3–10 తరగతులు)గా మొత్తం 8,878 ఉంటాయి. మ్యాపింగ్‌కు అవకాశం లేని 1,277 స్కూళ్లు.. హైస్కూళ్లు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లుగా కొనసాగుతాయి. 1,12,853 మంది అవసరం.. ఈ మొత్తం 10,155 స్కూళ్లలో సబ్జెక్టుల బోధన కోసం 1,12,853 మంది టీచర్లు అవసరమవుతారని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం సబ్జెక్టుల బోధన కోసం 72,625 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇంకా 40,228 మంది స్కూల్ అసిస్టెంట్లు అవసరమవుతారని అంచనా వేస్తోంది. అలాగే 1,735 మంది హెడ్మాస్టర్లు, ఫిజికల్ డైరెక్టర్లు అవసరమని గుర్తించింది. ఆరంచెల విధానంలో రూపుదిద్దుకుంటున్న 26,271 ఫౌండేషనల్ స్కూళ్లు (పీపీ1, పీపీ2, 1, 2 తరగతులు), 11,234 ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్ల (పీపీ1, పీపీ2, 1–5 తరగతులు)ల్లో 52,242 మంది ఎస్జీటీలు అవసరమవుతారని అధికారులు లెక్కకట్టారు. ప్రస్తుతం 83,554 మంది ఎస్జీటీలు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లకు అవసరమైనవారు కాకుండా అర్హతలు ఉన్న ఎస్జీటీలకు ఎస్ఏలుగా అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక. ఇలా అర్హతలున్న ఎస్జీటీలు 53,063 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31,312 మందికి ఎస్ఏలుగా అవకాశం కల్పించనున్నారు. -
స్కూల్స్ ఆఫ్ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హైస్కూళ్లను ‘స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్సు’లుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యా శాఖ అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నూతన విద్యావిధానంలోని లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు కదులుతోంది. విద్యార్థి కేంద్రంగా పాఠ్య, బోధన ప్రణాళికలు, ఫౌండేషన్ విద్యలో నిర్దేశించిన త్రిలక్ష్య సాధన, హైస్కూల్ విద్యార్థులకు సంపూర్ణ సామర్థ్యాలు సమకూరేలా సబ్జెక్టులవారీ బోధన.. అంతిమంగా ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న మానవ, మౌలిక సదుపాయాల వనరులన్నిటినీ సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం పాఠశాలలను ఆరంచెల విధానంలో ఏర్పాటు చేస్తోంది. 2023–24 నాటికి వీటిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఉన్నత ప్రమాణాలతో విద్యే లక్ష్యం.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టింది. అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు మంచి ఆరోగ్యం, ప్రవర్తనలను అలవర్చడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంచడం, అభ్యసనం పట్ల ఆసక్తిని పెంచుతూ భాగస్వాములను చేయడం అనే లక్ష్యాలతో ఫౌండేషనల్ విద్యకు ఏర్పాట్లు చేయించింది. రాష్ట్రంలో 2025 నాటికి ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (అంకెల పరిజ్ఞానం)ని సాధించడమే వీటి ఉద్దేశం. ఇక 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు అంశాలను బోధిస్తూ.. వారికి పూర్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అలవడేలా హైస్కూళ్లకు అనుసంధానిస్తోంది. వీటిని ‘స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సులు’గా అభివృద్ధి చేస్తూ ఆరంచెల స్కూలింగ్ విధానాన్ని చేపట్టింది. మౌలిక వసతులతో అనేక కార్యక్రమాలు ఫౌండేషనల్ స్కూళ్లను అభివృద్ధి పర్చడంతోపాటు హైస్కూళ్లను స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సులుగా తీర్చిదిద్దేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కింద మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. మంచి అలంకరణలతో తరగతి గదులు, రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ప్రహరీలు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులు–టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, కుర్చీలు, అల్మారాలు వంటి ఫర్నిచర్, గ్రీన్‌చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కిచెన్ షెడ్లు నిర్మించింది. జగనన్న అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలనూ అమలు చేస్తోంది. అలాగే ఫౌండేషనల్ స్కూళ్లలో ముగ్గురు అంగన్వాడీ వర్కర్, సహాయకులతోపాటు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీ టీచర్లు ఉంటారు. హైస్కూళ్లలో సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు కూడా అందుబాటులో ఉంటాయి. 2023 నాటికి పూర్తి స్థాయిలో ఆరంచెల విధానం.. ఆరంచెల విధానానికి అనుగుణంగా 2023–24 నాటికి పూర్తి అయ్యేలా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం 2,835 ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషనల్ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. 2,682 హైస్కూళ్లకు 3–5 తరగతుల విద్యార్థులను అనుసంధానించారు. ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్ల నుంచి 1,73,441 మంది, మున్సిపల్ స్కూళ్ల నుంచి 30,013 మంది మొత్తం 2,03,454 మంది విద్యార్థులు హైస్కూళ్లకు అనుసంధానమయ్యారు. 2022–23లో కిలోమీటర్ పరిధిలోని ప్రైమరీ స్కూళ్లలో 3–5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. వాటిలో అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. ఇక జూనియర్ కాలేజీలు లేని 202 మండలాల్లోని హైస్కూళ్లలో +2 తరగతులు ప్రారంభిస్తారు. 2023–24లో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్ల 3–5 తరగతుల విద్యార్థులను ప్రీ హైస్కూల్, హైస్కూళ్లలో అనుసంధానం చేస్తారు. ఈ హైస్కూళ్లను స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సులుగా మార్చేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క స్కూల్, అంగన్వాడీ కేంద్రం మూతపడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఏ ఒక్క టీచర్, అంగన్వాడీ వర్కర్ పోస్టూ పోకుండా జాగ్రత్తలు తీసుకుంది. -
చదువులమ్మ గుడిలో కిలకిల రావాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : విద్యార్థులు కిలకిల నవ్వులతో సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఏ పాఠశాలలో చూసిన విద్యార్థులు ఆట పాటలతో నవ్వుతూ... తుళ్లుతూ సంతోషంగా గడిపారు. పాఠశాలల్లో ప్రతి నెలా మొదటి, మూడో శనివారం నో స్కూల్ బ్యాగ్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ రెండు రోజులు విద్యార్థులు ఆట పాటలతో సంతోషంగా గడపాలని, వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచనలిచ్చారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శనివారం విద్యార్థులు పుస్తకాల బ్యాగులు తీసుకురాకుండా వచ్చారు. కుమారప్రియంలోని సానా వెంకట్రావు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.గోపాలకృష్ణాచార్యులు మాట్లాడుతూ ఆనందం వేదిక కార్యక్రమంలో తమ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారని చెప్పారు. విద్యార్థులలో ఒత్తిడిని దూరం చేసి వారిలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఈఆర్టీ రూపొందించిన ఆనందవేదికలో మొదటి శనివారం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గడిపారని చెప్పారు. ఉదయం విద్యార్థులతో ధ్యానం చేయించారు. విద్యార్థులు పాఠశాలలోని గ్రంథాలయంలో తమకు నచ్చిన పుస్తకాలు చదువుకున్నారు. అనంతరం పలు చిత్రాలు గీశారు. మధ్యాహ్నం విద్యార్థులు సభ నిర్వహించారు. పలువురు విద్యార్థులు చక్కని నీతి కథలు చెప్పారు. పాటలు పాడారు. పొడుపు కథలు, సామెతలు చెప్పారు. తరువాత తోటపని చేసి ప్రకృతి పట్ల తమకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. చివరి పిరియడ్‌లో ఇన్డోర్, అవుట్డోర్ ఆటలు ఆడుకున్నారు. ఉపాధ్యాయుడు వి.సత్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డి శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుపాలెం పాఠశాలలో ఉపాధ్యాయుడు పి.సత్యనారాయణ విద్యార్థులకు కథలు చెప్పారు. ఆటలు ఆడించారు. బాగా ఎంజాయ్ చేశాం... రంగంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాలు పక్కనపెట్టి అభినయ గేయాలు, నీతి కథలు, వివిధ ఇండోర్ గేమ్స్‌తో సరదాగా గడిపారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఇప్పటికే నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ రోజు పాఠశాలలో చాలా ఆనందంగా గడిపామని, ఆటలు, పాటలు, కథలతో బాగా ఎంజాయ్ చేశామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రతి శనివారం కూడా పుస్తకాలతో తరగతి గదిలోనే గడిపేవారమని, జగన్ సార్ ముఖ్యమంత్రి అయ్యాకా శనివారం నో బ్యాగ్ డేగా ప్రటించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
సర్కారు బడి చావు కేక
అంపశయ్యపై 3,600 పాఠశాలలు అదో మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఒక బడి. ఊరి పిల్లలంతా ఆ బడికే వెళ్లేవారు. కాలం తిరిగింది. ఊరు మారింది. అవసరాలు మారాయి. చదువులు మారాయి. పోటీతత్వం పెరిగింది. ఒక్కటేమిటీ? కాలచక్రంలో పడి అన్నీ మారిపోయాయి. బడి మాత్రం అలాగే ఉంది. అందులో చదువులూ అలాగే ఉన్నాయి! మారని ఆ బడి.. తన బిడ్డ భవిష్యత్తును ఎలా మారుస్తుందని ఓ తండ్రి ఆలోచించాడు. ఆ బడి మాన్పించి ప్రైవేటు బడి చూసుకున్నాడు. ఇందులో తప్పెవరిది? కాలానికి అనుగుణంగా బడిని మార్చని సర్కారుదా? బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న తండ్రిదా? అదో ప్రభుత్వ బడి. 70 మంది పిల్లలు. ఒకే టీచరు. తెలుగు, లెక్కలు, సామాన్య, సాంఘికశాస్త్రం.. అన్నీ ఆ ఒక్కరే చెప్పాలి. ఒంట్లో బాగోలేకో, ఇంట్లో పనుండో ఓ రోజు టీచర్ సెలవు పెట్టాడు. అంతే.. ఆ రోజు స్కూలుకు సెలవు! పిల్లలంతా బడికి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. ‘ఇదేం బడి? ఆయనేం సారు? ఎప్పుడొస్తారో తెలియదు. ఎప్పుడు రారో తెలియదు..’ అంటూ ఇంట్లో తల్లి విసుక్కుంది! అదే స్కూలుకు ఇంకో టీచర్ ఉండి ఉంటే ఆ బడి నడిచేది! ఆ తల్లి మాటల్లో నిజం లేదా? ఇంకో టీచర్‌ను ఇచ్చి బడి నడిపే బాధ్యత ప్రభుత్వానికి లేదా? నరేశ్ చిన్నప్పట్నుంచే కాన్వెంట్లో చదివాడు. సురేశ్ తెలుగు మీడియంలో చదివాడు. నరేశ్‌కు ఇప్పుడు ఓ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. జీవితంలో స్థిరపడ్డాడు. సురేశ్‌కు ఉద్యోగం రాక ఊళ్లోనే ఏవో పనులు చేసుకుంటున్నాడు. తమ పిల్లలకు కూడా నరేశ్‌లాంటి చదువులే కావాలని కోరుకుంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా కావాలని వారు కోరుకోవడం అత్యాశ కాదు కదా..! ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకు పెట్టరు? సర్కారీ బడులు ప్రైవేటు స్కూళ్లతో ఎందుకు పోటీ పడవు? అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండా అది. అక్కడ పది మంది పిల్లలతో స్కూలు నడుస్తోంది. ఇన్నాళ్లూ ఆ స్కూలుకు భవనం, తాగునీరు, టాయిలెట్ వంటి కనీస వసతుల ఊసెత్తని ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా ఓ విషయం గుర్తొచ్చింది. స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారట.. దాన్ని మూసేసి మరో స్కూల్లో కలిపేస్తారట! బస్సు వసతి కూడా లేని పక్క ఊరికి పంపలేక ఆ పది మంది పిల్లల్ని అసలు బడే మాన్పించాలని చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇదొక్కటే కాదు. రాష్ట్రంలో ఇలాంటి అనేక పాఠశాలల్ని మూసేస్తామంటోంది సర్కారు. ఉన్నచోటే ఆ స్కూళ్లను బలోపేతం చేస్తే 10 మంది పిల్లలు కాస్తా 20 మంది కారా? మూసేస్తే ఆ స్కూళ్లలోని వేల మంది పిల్లల చదువులు ప్రశ్నార్థకం కావా? ఐదేళ్లు నిండాకే ప్రభుత్వ బడిలో చేర్పించాలి. కానీ ఈ నిబంధనకు కాలం చెల్లిందంటున్నారు తల్లిదండ్రులు. మూడేళ్ల నుంచే చదివిస్తామంటూ ఆర్థిక భారమైనా పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే పిల్లలంతా ‘ప్రైవేటు’ వైపు మళ్లడంతో సర్కారీ బడుల్లో ఏటా 50 వేల నుంచి లక్ష మంది పిల్లలు తగ్గిపోతున్నారు. పేరెంట్స్ ఆశలకు అనుగుణంగా ఐదేళ్ల నిబంధన ఎందుకు మార్చరు? అంగన్వాడీ కేంద్రాలను ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి ఎందుకు తేలేరు? ప్రభుత్వం తలచుకుంటే ఇవేమైనా అసాధ్యమైనా పనులా? ....ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ చుట్టూ ముసురుకున్న సమస్యలు ఎన్నో. సమాధానం లేని ప్రశ్నలు మరెన్నో. ప్రభుత్వ బడుల్లో చదువు కరువు. ప్రైవేటు స్కూళ్లలో కరెన్సీ బరువు. సర్కారీ పంతుళ్ల బోధన పై నిఘా ఉండదు.. ప్రైవేటు యాజమాన్యాల అడ్డగోలు ఫీజులపై నియంత్రణ ఉండదు. చెట్టు కింద చదువులు ఓచోట.. ఏసీ గదుల్లో చదువులు మరోచోట..! కొందరు పిల్లలకు ర్యాంకుల గొప్పలు.. మరికొందరికి అసలు చదువుకే తిప్పలు..! వెరసి పునాదుల్లోనే అల్లుకుంటున్న అంతరాలు. పాఠశాల విద్యా వ్యవస్థ ఆసాంతం అస్తవ్యస్తం! రాష్ట్రంలో పాఠశాల విద్య దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు రేపటి నుంచి.. -
కంప్యూటర్ విద్యకు మంగళం!
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యకు గడ్డు కాలం రానుంది. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి, బోధించే కాంట్రాక్ట్ నేటి(జూలై 31)తో పూర్తి కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,031 ప్రాజెక్టులకు మళ్లీ టెండర్లు పిలి చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కంప్యూటర్ విద్యను బోధిస్తున్న 8వేల మంది ఇన్స్ట్రక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై 4 వేల స్కూళ్లలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పథకాన్ని 2002లో అరకొర ఏర్పాట్ల మధ్య ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. కంప్యూటర్ల కోసం ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షలు వెచ్చించారు. తాజాగా టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఖరారు చేయడమో లేదా పొడిగించడమో చేయని పక్షంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కంప్యూటర్ కేంద్రాలు మూత పడడం ఖాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకం అమలుకు రాష్ట్రం 30 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. మిగతా 70 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. పథకం పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రానిదే. టెండర్లు పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిస్తే 70 శాతం నిధులు లభిస్తాయి. మిగతా 30 శాతం నిధులు సర్దుబాటు చేయడానికి ఇష్టంలేని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రతిపాదనలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుపై ఇన్స్ట్రక్టర్లు మండిపడుతున్నారు. కంప్యూటర్ విద్య పథకాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించడం మేలని కొందరు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.