Government statement
-
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
షార్ట్ సెల్లర్స్‌పై ‘బ్యాంకు’ పిడుగు!
(సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి) బ్యాంకులే కాదు... బ్యాంకు షేర్లూ నోట్లు కురిపించాయి. కొన్ని షేర్లయితే ఒకేరోజు ఏకంగా 45 శాతానికిపైగా పెరిగిపోయాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీ, ఐడీబీఐ, కెనరా బ్యాంక్... ఒకటేమిటి!! దాదాపు అన్ని బ్యాంకులదీ ఇదే పరిస్థితి. కాకపోతే... డెరివేటివ్స్‌లో (ఎఫ్ అండ్ ఓ) ట్రేడవుతున్న పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మాత్రమే ఈ స్థాయిలో పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా... డెరివేటివ్స్‌లో లేనివైతే ఒక మోస్తరు స్థాయిలో మాత్రమే పెరిగాయి. ఈ మేజిక్‌తో ఒకేరోజులో కొందరు ట్రేడర్లు వందలు, వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ షార్ట్ సెల్లర్లు అదే స్థాయిలో నష్టపోయారు. నిజానికి డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో ఒకరికి లాభం వచ్చిందంటే దానర్థం మరొకరు నష్టపోయినట్లే. అంటే! బ్యాంకులకు ఈ స్థాయిలో ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ గడువుకు ఒక్కరోజు ముందు ఈ ప్రకటన వస్తుందని... దాంతో అవి ఇంతలా పెరిగిపోతాయని తెలియక షార్ట్ సెల్లింగ్ చేసినవారంతా ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం. ఒక రంగానికి చెందిన షేర్లన్నీ గంపగుత్తగా ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు... బహుశా స్టాక్ మార్కెట్ చరిత్రలో లేవనే చెప్పాలి. మొండి బకాయిలు పేరుకుపోవడమే కాక రోజురోజుకూ కొత్త ఎన్పీఏలు బయటపడుతుండటంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దయనీయంగా తయారయింది. లాభాలుగా వచ్చిన సొమ్మును ఈ ఎన్పీఏలకు సర్దుబాటు చేస్తూ అవి భారీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఇన్వెస్టర్లకు మోజు తగ్గింది. ట్రేడర్లు వీటిలో షార్ట్ పొజిషన్లు తప్ప లాంగ్ పొజిషన్లు మానేశారు. ఫలితంగానే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి షేరు సోమవారం ఉదయానికి ఏకంగా రూ.240 స్థాయిలోకి పడిపోయింది. మిగిలిన బ్యాంకుల పరిస్థితీ అంతే. ఎన్పీఏలు మరీ పెరిగిపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) సహా బ్యాంకులన్నీ కనిష్ఠ స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు బాగానే పెరుగుతున్నప్పటికీ... ప్రభుత్వ రంగ షేర్లవైపు ఎవరూ చూడటం మానేశారు. ఎఫ్ అండ్ ఓలో వీటిలో షార్ట్ పొజిషన్లు భారీ స్థాయిలో ఉండటమే దీన్ని సూచిస్తోందని చెప్పాలి. షేరు అంతలా ఎందుకు పెరిగాయంటే... అక్టోబర్ నెల డెరివేటివ్స్ గడువు గురువారంతో ముగియనుంది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇప్పటికే బాగా పడి ఉన్నాయి. ఇంకొక్క రెండ్రోజులు గడిస్తే ఎక్స్పైరీ అయిపోతుంది. నవంబర్ కాంట్రాక్టులు మొదలవుతాయి. ఈ సమయంలో బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చవచ్చునంటూ మంగళవారం ఉదయం నుంచే కొన్ని వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ఎంత మొత్తమిస్తారనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. దీంతో సోమ, మంగళవారాల్లో చాలా వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 2 నుంచి 4 శాతం వరకూ పెరిగాయి. మంగళవారం మార్కెట్లు ముగిశాక ఆర్థిక మంత్రి నేతృత్వంలో మీడియా సమావేశం పెట్టి... బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లను మూలధనంగా సమకూరుస్తామని చెప్పారు. అంటే చాలా బ్యాంకులు మొండి బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి కనుక... వాటికి మరిన్ని రుణాలివ్వటానికి తగిన మూలధనం లేదు కనుక... ఆ మూలధనాన్ని ప్రభుత్వం కొంత బడ్జెట్ నుంచి, కొంత బాండ్ల జారీ ద్వారా సమకూరుస్తుందన్న మాట. అంటే డిపాజిట్లు కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లోకి గాలివాటం డబ్బులు ఏకంగా కేంద్రం నుంచి వస్తాయి. బ్యాంకులకిది నిజంగా కిక్కిచ్చే వార్తే!!. డెరివేటివ్స్ గడువు తీరే ముందు ఇలాంటి వార్త రావటం... ఆ షేర్లలో లాంగ్ పొజిషన్లున్న వారికి కనకవర్షం కురిపించేదే!!. నిజానికి బ్యాంకులకు ఈ డబ్బులన్నీ వెంటనే వచ్చేవి కావు. కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. సానుకూల వార్త కనక బ్యాంకు షేర్లు కొంత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే ఆ షేర్లలో షార్ట్‌లు విపరీతంగా ఉండటంతో... బుధవారం ఉదయాన్నే సదరు బ్యాంకు షేర్లలో దాదాపు 15–20–30% గ్యాప్ అప్‌తో ట్రేడింగ్ మొదలయ్యింది. నిజానికి డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసేవారంతా మార్జిన్ ట్రేడర్లే. అంటే లాట్ ధరలో 15–20% మాత్రమే పెట్టి ట్రేడింగ్ చేస్తారు. ఉదయాన్నే గ్యాప్ అప్‌తో ట్రేడింగ్ మొదలయ్యేసరికి... ఆయా బ్యాంకుల్లో షార్ట్ పొజిషన్లున్న వారందరికీ వారి బ్రోకింగ్ సంస్థల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అర్జంటుగా మరింత మార్జిన్ మనీ అందుబాటులో ఉంచాలని, లేకపోతే ఆ పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అయిపోతాయని దాని సారాంశం. కొందరి షార్ట్ పొజిషన్లయితే ఎలాంటి మెసేజ్‌లూ లేకుండానే స్క్వేర్ ఆఫ్ అయిపోయాయి. పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అవుతున్న కొద్దీ ఆయా షేర్లు మరింత పెరగటం మొదలెట్టాయి. ఫలితం... కొన్ని షేర్లు ఏకంగా ఒకేరోజు 45%పైగా పెరిగిపోయాయి. అదీ కథ!! ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? బ్యాంకులకు మూలధనాన్ని అందజేయనున్నట్లు మంగళవారం సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. బుధవారం బ్యాంకు షేర్లు బీభత్సమైన ర్యాలీ చేశాయి. కాకపోతే మంగళవారం ఈ ప్రకటన వెలువడటానికి ముందే కొన్ని ప్రభుత్వ బ్యాంకు షేర్లలో ఆసక్తికరమైన ట్రేడింగ్ జరిగింది. ఉదాహరణకు భారీగా 46 శాతం పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంకునే తీసుకుంటే... మంగళవారంనాడు 145 స్ట్రైక్ ప్రైస్ వద్ద దీని కాల్ ధర కనిష్టం 5 పైసలు. గరిష్ఠం రూ.2.20. చిత్రమేంటంటే... గత శుక్రవారం బ్యాంకు షేర్లన్నీ బాగా పపడగా... ఈ కాల్లో రూ.1.98 కోట్ల టర్నోవర్ మాత్రమే జరిగింది. సోమవారం ఈ టర్నోవర్ రూ.4 కోట్లకు చేరింది. కానీ మంగళవారం ఏకంగా ఈ ఒక్క కాల్‌లోనే రూ.104 కోట్ల మేర టర్నోవర్ నమోదయింది. ఇంకేముంది! బుధవారం ఇది ఏకంగా 4,140 శాతం పెరిగిపోయింది. మరి సమాచారం తెలియని వారు అమ్మితే... తెలిసిన వారే ఈ కాల్‌ను కొన్నారా? కొని ఒకేరోజులో ఏకంగా 414 రెట్ల లాభాన్ని జేబులో వేసుకున్నారా? ఇది ఇన్సైడర్ ట్రేడింగేనా? అనే అనుమానాల్ని ట్విటర్ వేదికగా కొందరు వ్యక్తం చేయటం గమనార్హం. -
‘గ్రేటర్’ పోలింగ్ రోజు సెలవు
► జీహెచ్ఎంసీ పరిధిలో 2న స్థానిక సెలవుగా ప్రభుత్వ ప్రకటన ► ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకూ వర్తింపు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 2న ఈ ప్రాంత పరిధిలో స్థానిక సెలవు(లోకల్ హాలిడే)గా ప్రకటించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ సెలవును వర్తింపజేయాలంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పోలింగ్‌కు 48 గంటల ముందే గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించాలని కలెక్టర్లకు సూచించారు. పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 1న, 2న... కౌంటింగ్ సందర్భంగా ఫిబ్రవరి 5న ఎన్నికల అవసరాలకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లోని సిబ్బందికీ స్థానిక సెలవును ప్రకటించాలని సూచిం చారు. ఎన్నికల్లో పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులకు సైతం పోలింగ్ రోజున స్థానిక సెలవు ఇవ్వాలన్నారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు-1881 కింద జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని ఆదేశించారు. దుకాణాలు, ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని రాష్ట్ర లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు. ఎన్నికల అవసరాల కోసం అవసరమైన సంఖ్యలో వాహనాలను వినియోగించే అధికారాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారికి ప్రభుత్వం కల్పించింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
పేద విద్యార్థులకు సదావకాశం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం భైంసా : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆది లాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీకర ణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యన ందించే లక్ష్యంతో ఆర్జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విధానం... ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ప్రక్రియలో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ ఠీఠీఠీ.టజఠ్జ్ట.జీల్చోఛీఝజీటటజీౌట 2015.టజఠజ్టు.జీ లింక్ ద్వారా అప్లికేషన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది. ప్రవేశానికి అర్హతలు... పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. జీపీఏ సమానంగా ఉంటే... దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అ లాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉం టే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆ ధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం తర్వాత... ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. బోధన రుసుము.. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు... బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది. -
మాఫీ మాయలు!
* రూ.50 వేలు పూర్తి రద్దు అబద్ధమే * స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక * దిక్కుతోచని అన్నదాత సాక్షి ప్రతినిధి, విజయవాడ : రైతు రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. రూ.50 వేలు లోపు ఉన్న రుణాలన్నీ పూర్తిగా రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటన చేయగా, ఆచరణలోకి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టి అందులోనూ కోత పెట్టారు. జిల్లాలో రుణమాఫీ ఎంత జరిగిందనేది కూడా అధికారులకు తెలియదు. లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను ఏది అడిగినా తెలియదనే సమాధానమే చెబుతున్నారు. ఇతర బ్యాంకుల మేనేజర్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సేకరించిన వివరాలను పరిశీలిస్తే... రూ.50 వేల లోపు 20 శాతమే మాఫీ... గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో 823 మంది రైతులు రూ.3 కోట్ల 28 లక్షల 62 వేల 856 రుణాలుగా పొందారు. అందులో 377 మందికి తాజాగా రుణమాఫీ అయినట్లు జాబితాలో వచ్చింది. అందులో 205 మాత్రం రూ.50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. వారిలో కూడా 172 మందికి 20 శాతమే రుణమాఫీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. పీఏసీఎస్‌లో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులు 470 మంది ఉన్నారు. ఈ లెక్కన మరో 265 మందికి రూ.50 వేల లోపు రుణమాఫీ జరగాల్సి ఉంది. వారి పరిస్థితి ఏమిటనేది స్పష్టత లేదు. గుడివాడ ఎస్బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో డిసెంబర్ 2013 వరకు రుణాలు తీసుకున్నవారి సంఖ్య 920. వారిలో మొదటి జాబితాలో అర్హులైనవారు 265 మంది. రూ.50 వేల లోపు 230 మందికి మాఫీ అవుతున్నట్లు బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగతా 35 మంది రైతులకు 20 శాతం చొప్పున రూ.6 లక్షల మాఫీ వచ్చింది. నందివాడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 3,200 మంది వివిధ రకాల రుణాలు రూ.19కోట్లు పొందారు. మొదటి విడత జాబితాలో 725 కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. బ్యాంక్ పరిధిలో రూ.50 వేలలోపు రుణాలు పొందినవారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో 20 శాతం మందికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదు. దీంతోపాటు బంగారం రుణాలు పొందినవారిలో 90 శాతం మందికి రుణమాఫీ వర్తించలేదు. రుణం రూ.20 వేలు.. చూపుతోంది రూ.56 వేలు బ్యాంకులో పంట రుణం కింద తీసుకున్న రుణం రూ.20 వేలు అయితే.. రుణమాఫీ జాబితాలో రూ.56 వేలుగా చూపడం ఓ రైతు కుటుంబాన్ని విస్తుపోయేలా చేసింది. కోడూరు మండలం లింగారెడ్డిపాలేనికి చెందిన చిట్టిప్రోలు మునేశ్వరమ్మ 2011 సెప్టెంబర్ 14న కోడూరు స్టేట్‌బ్యాంకులో తన ఎకరం 40 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాన్ని కుదవపెట్టి రూ.20 వేలు పంట రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి పంటలు సరిగ్గా పండక తీసుకున్న రుణాన్ని బ్యాంకుకు జమ చేయలేకపోయారు. ఈలోపు ఎన్నికలు రావడం, చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేయడంతో రుణం చెల్లించలేదు. ప్రస్తుతం ఈ రుణం వడ్డీతో కలిపి రూ.30,500 అయింది. ఈ ఏడాది అక్టోబరులో పంట సాగు కోసం అదే బ్యాంకులో బంగారం కుదవపెట్టి మరోసారి రూ.35 వేలు రుణం పొందారు. ఈ నెల ఆరోతేదీన రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలు మొత్తం ఒక్కసారే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటన విడుదల చేయడంతో మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు ముందుగా తీసుకున్న తమ రుణం రూ.20 వేలు వడ్డీ సహా మాఫీ అయిపోతుందని భావించారు. ఈ నెల ఎనిమిదిన ఆన్లైన్లో విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2013లో తీసుకున్న రుణం రూ.56 వేలు అని, అందులో మొదటి విడత కింద రూ.5,194 మాఫీ అవుతుందని చూపించింది. దీంతో కంగుతిన్న మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా, ‘మీరు తీసుకున్న అప్పు మొత్తం మాఫీ కాదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద కొంత మొత్తమే వర్తిస్తుంది. గడువు మీరిన నేపథ్యంలో మిగతా సొమ్ము వెంటనే చెల్లించని పక్షంలో ఈ ఏడాది పంట రుణం కింద కుదవపెట్టిన బంగారాన్ని వేలం వేస్తాం’ అంటూ బ్యాంక్ మేనేజర్ చెప్పారని మునేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011లో రూ.20 వేలు రుణం తీసుకోగా.. 2013లో రూ.56 వేలు రుణం తీసుకున్నట్లుగా పేర్కొనడమే పొరపాటు కాగా, ఇందులో రుణమాఫీ కింద పోగా మిగిలిన మొత్తానికి ఈ ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించిన బంగారాన్ని వేలం వేసి జమ చేస్తామని చెప్పడమేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా తీసుకున్న రుణం వరకే నమోదై ఉంటే వడ్డీతో కలిపి రూ.30,500 సొమ్ము మాఫీ కావాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకు అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇది బ్యాంక్ అధికారుల పొరపాటా? లేక ప్రభుత్వం రుణమాఫీ ఎగవేతకు పన్నిన వ్యూహమా? అనేది బ్యాంకు అధికారులకు, ప్రభుత్వానికే తెలియాలి.