► జీహెచ్‌ఎంసీ పరిధిలో 2న స్థానిక సెలవుగా ప్రభుత్వ ప్రకటన
► ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకూ వర్తింపు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 2న ఈ ప్రాంత పరిధిలో స్థానిక సెలవు(లోకల్ హాలిడే)గా ప్రకటించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ సెలవును వర్తింపజేయాలంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదే విధంగా పోలింగ్‌కు 48 గంటల ముందే గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించాలని కలెక్టర్లకు సూచించారు. పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 1న, 2న... కౌంటింగ్ సందర్భంగా ఫిబ్రవరి 5న ఎన్నికల అవసరాలకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లోని సిబ్బందికీ స్థానిక సెలవును ప్రకటించాలని సూచిం చారు. ఎన్నికల్లో పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులకు సైతం పోలింగ్ రోజున స్థానిక సెలవు ఇవ్వాలన్నారు.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్టు-1881 కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో పోలింగ్ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని ఆదేశించారు. దుకాణాలు, ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని రాష్ట్ర లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు.
ఎన్నికల అవసరాల కోసం అవసరమైన సంఖ్యలో వాహనాలను వినియోగించే అధికారాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారికి ప్రభుత్వం కల్పించింది.
‘గ్రేటర్’ పోలింగ్ రోజు సెలవు
Published Wed, Jan 20 2016 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement