బోరుబావిలో పడిన ఏడాది చిన్నారి
రంగారెడ్డి జిల్లాలో ఓ బాలిక పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. లోక్యా నాయక్ అనే రైతుకు చెందిన పొలంలో ఈ బాలిక పడిపోయింది. గండేడు మండలం గోవింద్‌పల్లి తండాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలిక సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ పడిపోయింది. సొంత పొలానికి పక్కనే ఉన్న మరో పొలంలో ఉన్న బావిలో బాలిక పడిపోయింది.
14 అడుగుల లోతులో బాలిక ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జేసీబీని తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు 108 వాహనాలను రప్పించారు. మండల కేంద్రానికి ఈ తండా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతో ఆసల్యం కాకుండా ఉండేందుకు ముందే పిలిపిస్తున్నారు. పాపను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.