కేజ్రీవాల్ ప్రకటనలను తొలగించనున్న ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలున్న ప్రభుత్వ ప్రకటనలను తొలగించనున్నట్లు గురువారం ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు మాత్రమే ప్రచురించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యను తీసుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తెలిపింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఆ మేరకు సీఎం, ఇతర మంత్రుల ఫొటోలు ఉన్న ప్రకటనలను తొలగిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ బొమ్మలు లేకుండా ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమని, అయినా ప్రత్యామ్నాయ పద్ధతిపై దృష్టి సారిస్తామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.