govt degree college
-
ఇన్విజిలేటర్ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం
నర్సంపేట రూరల్: పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ మందలించి, చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్యా ఈర్య– పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు భూక్య సాయికుమార్ (23) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో అదే పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన ఇన్విజిలేటర్.. సాయికుమార్‌ను మందలించి కొట్టాడు. దీంతో మనోవేదనకు గురై, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్ మృతికి ఇన్విజిలేటర్, యాజమాన్యం కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహంతో కాలేజీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులతో మాట్లాడిన నర్సంపేట సీఐ పులి రమేష్çగౌడ్... మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌రాజ్‌ను వివరణ కోరగా... సాయి కుమార్ అనే విద్యార్థి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తోపాటు బుక్‌లెట్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, గుర్తించిన ఇన్విజిలేటర్ మందలించి, తమ వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థి రిక్వెస్ట్‌తో పరీక్ష రాసేందుకు అనుమతించామే తప్ప.. ఎవరూ కొట్టలేదన్నారు. -
మహిళా కాలేజీకి మంచిరోజులు..
-
ఇద్దరే ఇద్దరు !
సాక్షి, బి.కొత్తకోట : 2014 నవంబర్ 5న అంగళ్లులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి.కొత్తకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి, అందులో వృత్తిపరమైన కోర్సులు అందిస్తామని ప్రకటించారు. దానికోసం నిరుపేద విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా కదలికలేదు. 2016 చివర్లో కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసి చేతులు దులుపుకుంది. తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మరో జీఓ జారీ చేస్తూ అధ్యాపకులు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఖాళీ భవనాల్లో తరగతులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చేరిక కోసం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు పల్లెల్లో పర్యటించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. చేరింది ఇద్దరే.. కళాశాలలో మంగళవారం నాటికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. వీరిలో పెద్దతిప్పసముద్రం మండలం కమ్మపల్లెకు చెందిన సి.నరేంద్ర, రంగసముద్రానికి చెందిన షేక్ వలీ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికపై ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ప్రకటన చేసింది. తొలివిడతలో ఈ కళాశాలలో చేరిన వారు ఇద్దరే. ఈ నెలాఖరులో మరోసారి ప్రకటన ఇవ్వనుంది. బి.కొత్తకోట కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలంటే బీఏకు 25మంది, బీకాంకు 25 మంది విద్యార్థులు అవసరం. ఈ సంఖ్యను ఈనెల 30వ తేదీలోగా చేరుకోకుంటే తరగతులు ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే. కారణాలేమిటి? డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు చేరకపోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా జీఓ జారీ చేయడం, విద్యార్థుల చేరిక విషయంలో సరైన ప్రచారం లేకపోవడం కనిపిస్తోంది. ప్రయివేటు కళాశాల సిబ్బంది పల్లెలకు వెళ్లి ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను చేర్పించుకోవడం, టీసీలు తీసుకోవడం లాంటి చర్యలతో ప్రభుత్వ కళాశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ కళాశాల తరగతుల నిర్వహణకు తగిన సంఖ్య లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన 10 రోజుల్లోనైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునే వీలుంది. -
మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య
చింతలపూడి : ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడికి చెందిన కాళ్ల రమణారావు(45) అనే వ్యక్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తమ నుంచి వసూలు చేసిన ఫీజులను సొంత పనులకు వాడుకున్నాడంటూ విద్యార్థులు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయుడు రమణారావును మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమణారావు సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కాగా ఈరోజు ఉదయం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని పొలాల్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్లో తన చావుకు అధ్యాపకుల తీరే కారణమని పేర్కొన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిగ్రీ ప్రశ్నపత్రం తారుమారు
కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్పేపరు పంపిణీ ఆందోళనలో ఫస్టియర్ విద్యార్థులు ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సవరం డిగ్రీ పరీక్షలలో ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా రాత్రి వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా కంప్యూటర్ కోర్సు పేపరు రాయల్సి ఉండగా, వారికి కంప్యూటర్ స్కిల్స్ పేపరు అందజేశారు. దీంతో విద్యార్థులు చూసుకోకుండా ఆ సబ్జెక్టు పేపరుకు పరీక్ష కూడా పూర్తి చేశారు. పరీక్ష పూర్తై తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు రాసిన సమాధానాల పత్రాలకు వారు రాసిన ప్రశ్నాపత్రాన్నే జత చేసి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి పంపారు. డిగ్రీ జనరల్ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు పేపర్, వోకేషనల్ విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పేపరు ఇవ్వాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సుమారు 550 మంది విద్యార్థులకు 13 గదుల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్ విద్యార్థులున్న ఒక పరీక్ష గదిలో కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. వారు పరీక్ష కూడా రాసి సమాధానపత్రాలిచ్చిన తర్వాత జరిగిన పొరపాటు తెలుసుకున్నారు. దాంతో చాలా మార్కులు కొల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ రోబిన్కుమార్ పాడి వివరణ ఇస్తూ ప్రశ్నాపత్రం మారిన మాట వాస్తవమేనన్నారు. కొన్ని పరీక్ష గదుల్లో విద్యార్థులు పొరపాటును గమనించి చెప్పడంతో వారికి సరైన ప్రశ్నాపత్రం అందజేశామని, మరో గదిలోని విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత పొరపాటును గమనించి తమ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే బీఆర్‌ఏయూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ప్రశ్నాపత్రం మారినా సుమారు 60 శాతం ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదన్నారు.