Govt education
-
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, పథకాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంస్కరణలకు తెరతీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాసంస్కరణలపై ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విద్యా సంస్కరణలు, పథకాల తీరుతెన్నులను పరిశీలించి వెళ్లారు. తమ దేశాల్లోనూ వాటిని అమలు చేస్తామని చెప్పడం ఏపీ విద్యకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపునకు నిదర్శనం. ఇలా ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను వారికి దూరం చేయాలని కుట్రలు పన్నుతోంది. నాణ్యమైన విద్యే మార్గం..‘పేదరికాన్ని జయించాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఒక్కటే మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. అన్ని దేశాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని ఐదేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం గొప్ప ముందడుగు’.. స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో క్యాసిస్ ఇచ్చిన కితాబు ఇది. గతేడాది ఫిబ్రవరిలో జెనీవాలో ‘ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ అంశంపై మాట్లాడిన ఇగ్నాజియో.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచాన్ని ప్రగతి వైపు నడిపించే విద్యా బోధన, సంస్కరణలను ఏపీ అమలు చేయడం గొప్ప ముందడుగని పేర్కొన్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ ఏపీ విద్యా విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో గ్లోబల్ విద్యా విధానం అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప అంశంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమన్నారు. తాజాగా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతిని«దులు సాక్షి ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రపంచ పౌరులుగా పేద విద్యార్థులు..పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేయడం పేద పిల్లలకు దక్కిన గొప్ప గౌరవం. విద్యా సాధనలో అట్టడుగు స్థాయిల్లో ఇలాంటి సంస్కరణలనే కోరుకుంటున్నాం.స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి కార్యాలయం అట్టడుగు స్థాయిలో నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నా. – లిడియా గ్రిగొరెవా, చీఫ్ ఆఫ్ క్యాబినెట్, యూఎన్వో డైరెక్టర్ జనరల్ ఆఫీస్, జెనీవా ఏపీ పాఠశాలల్లో మార్పులను చూసి ఆశ్చర్యపోయా కంపారిటివ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీలో దక్షిణాసియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) చైర్‌గా నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోయాను. గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కొలంబియా విశ్వవిద్యాలయంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏపీలో విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి వారు అనర్గళంగా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులతో పోటీపడుతూ మాట్లాడారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ బోర్డులు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని వినియోగించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ మార్పులతో ఏపీ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు. – రాధిక అయ్యంగార్, సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ప్రపంచ అవసరాలకు తగ్గట్టు ఏపీ విద్యార్థులుఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఆకర్షించింది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ అందించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఏపీ విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు. ఇది ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునేందుకు, పరస్పరం సహాయానికి, భవిష్యత్‌ను అద్భుతంగా మార్చుకునేందుకు దోహదం చేస్తుంది.బాలికల డ్రాపవుట్లను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10 లక్షల మంది బాలికలకు ఉచిత బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లను నిర్మించింది. యుక్త వయసు బాలికల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను. – దివ్యాన్షి వాధ్వా, ప్రపంచ బ్యాంక్ డేటా సైంటిస్ట్, వాషింగ్టన్ఏపీలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యఆకలిని, పేదరికాన్ని జయించాలంటే మొదట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అనేక మంది పేద విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.దీనిద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను, వేతనాలను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం సమకాలీన ప్రపంచ సవాళ్లను అధిగమించి అవకాశాలను అందుకునేదిగా ఉంది. ప్రీ–స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు చేసిన మార్పులతో నాణ్యమైన విద్యాభివృద్ధిని సాధిస్తుంది. – రజనీ ఘోష్, బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ ఎఫైర్స్ ఇండియా డెస్క్ ఆఫీసర్, అమెరికా ప్రభుత్వంకార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలునా చిన్నప్పటికి, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, ఇంగ్లిష్ మీడియం బోధన వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారడం గర్వకారణం.ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుతో ప్రతిభ గల నాణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావచ్చు. పేద విద్యార్థులకు ఆంగ్లంలో మంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది. పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. – ఉపేందర్‌రెడ్డి గాదె, విజ్డమ్ టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్, సిడ్నీ, ఆస్ట్రేలియాఆంధ్రప్రదేశ్లోనే ఇంత గొప్ప మార్పు..ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణలను ప్రభుత్వ విద్యార్థులే నేరుగా ఐక్యరాజ్యసమితిలో వివరించారు. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప మార్పును ఏపీలో చూస్తున్నామని ప్రపంచ దేశాల ప్రతినిధులు అభినందించారు. కొలంబియా యూనివర్సిటీలో మన విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్‌లో మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.స్టాన్‌ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, జెనీవా యూనివర్సిటీ, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్కూల్స్ ఫోరమ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ ఇన్‌క్లూజన్ వంటి వాటిలో గత ఐదేళ్లుగా ఏపీ విద్య సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ప్రతిచోటా ఏపీ విద్యకు ప్రశంసలు లభిస్తున్నాయి. – ఉన్నవ షకిన్ కుమార్, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ సభ్యుడు -
జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం
ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం దక్కింది. 2021-22 రాష్ట్రాల విద్యా వ్యవస్థ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్‌ను కేంద్రం విడుదల చేయగా, అందులో ఏపీకి ప్రథమ స్థానం లభించింది. 73 అంశాలకు 1000 పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్ ఇవ్వగా, 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది. లెర్నింగ్ అవుట్‌కమ్‌లు (LO), యాక్సెస్ (A), ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్ (IF), ఈక్విటీ (E), గవర్నెన్స్ ప్రాసెస్ (GP) & టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TE&T) అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు. చదవండి: నెట్టింట అభిమానం: జగనన్న పాలనలో.. మహానేత కలగన్న గ్రామస్వరాజ్యం -
నాణ్యమైన విద్యే లక్ష్యం: సీఎం వైఎస్ జగన్
నూతన విద్యా విధానంపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో సమాధానం చెప్పాలి. కొత్త విధానం లక్ష్యాలను, ప్రయోజనాలను వివరించాలి. 8 ఏళ్లలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారి నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. ఫాండేషన్ స్కూళ్ల లక్ష్యమిదే. ప్రస్తుతం విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్తో లైబ్రరీలను బలోపేతం చేయాలి. సాక్షి, అమరావతి: నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. ఇప్పటి వారికే కాకుండా తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా శాఖ, అంగన్ వాడీల్లో నాడు–నేడు, నూతన విద్యా విధానంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ మూత పడటం లేదని, ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదని, అంతిమంగా అదే సందేశం వెళ్లాలని స్పష్టం చేశారు. అంగన్వాడీల్లో కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్‌ను కూడా మూసి వేయడం లేదన్నారు. ‘ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం. సానుకూల దృక్పథంతో పని చేయండి. ఇదే విషయాన్ని అందరికీ చెప్పండి’ అని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండు రకాల స్కూళ్లు రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం. పీపీ (ప్రీ ప్రైమరీ)1, పీపీ2, ప్రిపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒక రకం. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి 10వ తరగతి వరకు సమీపంలో ఉన్న హై స్కూల్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలి. ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండాలి ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు. పౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరం. ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా ముఖ్యం. ఈ వయసులోపు పిల్లల్లో నూరు శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి. 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. అలాగే ఒకే చోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదు. అందరి సందేహాలు తీర్చాలి నూతన విద్యా విధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి. ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి. ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యా విధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి. భాగస్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణనలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి. వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. రెండేళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం. ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం అంగన్వాడీలు కూడా నాడు-నేడులో భాగం. దీనికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. 2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్ పూర్తి కావాలి. సాచ్యురేషన్ పద్ధతిలో అంగన్వాడీలుంటాయి. 55 వేల అంగన్వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు. ప్రతిభ కలిగిన అంగన్వాడీ టీచర్లకు భవిష్యత్‌లో పదోన్నతి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాం. పౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందరూ ఇదే ఫాలో అవ్వాలి. 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్జీటీ టీచర్ డీల్ చేయలేడు. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం. జూలై 1 నుంచి రెండో విడత నాడు–నేడు ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. స్కూళ్లలో నాడు –నేడు గురించి తెలంగాణ అధికారులు సంప్రదించారని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆకాంక్షించారు. విద్యా కానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన మన లక్ష్యం. ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్నవి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అటు ఉపాధ్యాయులుకు, ఇటు పిల్లలకు నూతన విద్యా విధానంతో మంచి జరుగుతుందని వివరించండి. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమిని కొనుగోలు చేయాలి. ప్రస్తుత విద్యా కానుకలో ఇస్తున్న దానికంటే వచ్చే ఏడాది అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ఇందుకోసం ప్రణాళిక వేసుకోవాలి. పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలను బలోపేతం చేసుకోవాలి. పాఠశాల లైబ్రరీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందించాలి. -
నినాదాన్ని సాకారం చేసేవాడే మేటి యోధుడు
కార్పొరేట్ విద్యకు రెడ్‌కార్పెట్ పరచి విద్యా వ్యవస్థను నాశనం చేసుకున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తించాం. విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందించడం సర్కారీ విద్యతోనే సాధ్యం. గత రెండు నెలలుగా అమెరి కాలో తిరుగుతున్నాను. ప్రస్తు తం తూర్పు అమెరికా నుంచి పడమరకు వచ్చాను. తూర్పు అమెరికాలోని కాలిఫోర్నియా లో సుమారు యాభై ఏళ్లకు పైబడిన నా పూర్వ విద్యార్థు లు కలిశారు. వీరంతా 1970- 90ల మధ్య ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారే. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. కొందరు పలు కంపెనీలను నడిపిస్తున్నవారైతే... ఇంకొందరు కొన్ని కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ఈసారి పర్యటనలో వారందరితో కలసి ముచ్చటించే అవకాశం నాకు చిక్కింది. ‘‘తెలుగు రాష్ట్రాలు రెండూ పునర్నిర్మాణ దశలో ఉన్నాయి కదా... మీరు కూడా మీ గ్రామాల్లోనో, లేక సమీప పట్టణాల్లోనో కంపెనీలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుంది కదా!’’ అని వారితో అనగానే... వారంతా ఉత్సాహంగా అందుకు ముందుకువచ్చారు. ‘‘ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది ఉద్యమాలు, తగాదాలు కావు... నిర్మాణాత్మక కార్యక్రమాల్ని రూపొం దించే సరికొత్త ఆలోచనలు’’ అన్న నా విజ్ఞప్తికి వారి నుం చి విశేష స్పందన వచ్చింది. ఇటీవలే అమెరికాకు పడమర దిశగా ఉన్న వాషింగ్ట న్లో కూడా అలాగే కొందరు తెలుగువారిని కలిశాను. వీరు కూడా నా దగ్గర చదువుకున్నవారే. కానీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములు కండనే నా విజ్ఞప్తికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ‘‘మాకు దేశం ఏం చేసింది? ప్రభుత్వ బడుల్లో నాణ్యతలేక చిన్నప్పటి నుంచీ ప్రైవేట్ బడుల్లోనే చదువుకున్నాం. కళాశాల విద్య కూడా అంతే. ఫీజులన్నీ మా తల్లిదండ్రులే భరించారు. ఇంజనీరింగ్ విద్య కూడా అంతంత మాత్రంగానే సాగిం ది. ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మాకు ఈ దేశం ఉద్యోగావకాశాలను కల్పించింది. మన దేశంలో కులమే అన్నింటికీ ప్రాతిపదిక. ఇక్కడ కులాన్ని, మతాన్ని చూడరు. అందుకే మాకు ఈ దేశం అంటే ఇష్టం... మేం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది కేవ లం మా తల్లిదండ్రులకే’నని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని ఇంతకు ముందు నేను అనేకసార్లు చర్చించాను. ప్రైవేట్ కళాశా లల్లో అధిక ఫీజులు చెల్లించి చదువును కొనుక్కోవడం వల్ల లాభాపేక్షకు సంబంధించిన ఆలోచనలతోనే వారి విద్యాభ్యాసం సాగింది తప్ప వారిలో సామాజిక దృక్ప థం ఏర్పడలేదు. ప్రభుత్వాలు సర్కారీ విద్యను క్రమం గా నీరుగార్చడం వల్ల కలుగుతున్న విపరిణామాలను ఇప్పుడు చవిచూడాల్సి వస్తోంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లలోని విద్యార్థులకు ఎంత తేడా ఉందో గమనించాను. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న తరం ఒకటైతే... కార్పొరేట్ కళాశాలల్లో చదువును కొనుక్కున్న తరం ఇంకొకటి. అందుకే సామా జిక లక్ష్యం అనే పదానికి అర్థమే మారిపోయింది. కాబట్టి ప్రైవేట్ విద్యావ్యవస్థ మనుషుల్లో తీసుకొచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. అమె రికా అధ్యక్షులలో జఫర్సన్ గొప్పవాడు. ఆ తర్వాత అధ్యక్షుడైన లింకన్‌ను పత్రికా విలేకర్లు మీకు ‘‘ఆదర్శ ప్రాయుడైన అధ్యక్షుడు ఎవరు?’’ అని అడిగితే ఆయన ‘‘నేనే ఓ ఆదర్శ అధ్యక్షుడ్ని కావాలి’ అన్నారట. జఫర్ సన్ ప్రపంచానికి సమానత్వ నినాదాన్ని ఇచ్చాడు. ఆ కారణంగా లింకన్ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చని అనలేం. జఫర్సన్ కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం మాత్రమే. ఆయన సమానత్వ నినాదాన్ని ఇచ్చాడే తప్ప దాన్ని అమలు జరపలేదు. ప్రజలకు నినాదం కన్నా అమలు ముఖ్యం. నినాదమిచ్చినవాడి కంటే దాన్ని అమ లు చేసిన వాడే ఆదర్శం. జఫర్సన్ కాలం కంటే లింకన్ కాలంలో సాంకేతికత బాగా పెరిగింది. లింకన్ బ్యాం కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేశాడు. ఆనాడు బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేసిన వాడే యోధుడు. అందువల్ల అమెరికా స్వాతంత్య్రదినోత్సవం నాడు జఫర్సన్ కన్నా లింకన్నే ప్రజలు ఎక్కువగా జ్ఞప్తికి తెచ్చుకుంటారు. లింకన్ నినాదం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యమి చ్చాడు. అలాగే మన ప్రజలకు కూడా ఈనాడు కావా ల్సింది నినాదాలు కాదు. ఆచరణలో అమలు చేసి చూపే ప్రభుత్వాలు, నాయకులు కావాలి. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే శక్తినిచ్చే నాయకులు కావాలి. సమస్యల మూలాలను కనుగొని నిర్మూలించేవాడే యోధుడు. ప్రజాస్వామిక నినాదాలను ఇవ్వడంకన్నా ఆచరణలో అమలయ్యేలా చేసేవాడే గొప్పవాడు. మనం కార్పొరేట్ యాజమాన్యాలకు రెడ్‌కార్పెట్ పరచి చేజేతులారా మన విద్యా వ్యవస్థను నాశనం చేసు కున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తిం చాం. చిన్న వయసు నుంచే విద్యార్థిలో ‘‘నేను చదువును కొనుక్కున్నాను’’ అనే భావనను కలిగిస్తున్నాం. కాబట్టి మా తల్లిదండ్రులు నా కోసం ఖర్చు చేసిన ఆ డబ్బును ఏ రకంగానైనా నేను సంపాదించాల్సిందే అనే ఆలోచ నను మనమే వారిలో కల్పిస్తున్నాం. వెర్రితలలు వేస్తోన్న కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించకపోతే మరె న్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏ దేశం తమకు మంచి ఉపాధిని, భవిష్యత్తును కల్పిస్తున్నదో ఆ దేశాన్నే ఎవరైనా ప్రేమిస్తారు, గౌరవి స్తారు. కాబట్టి విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందిం చడం సర్కారీ బడులతోనే సాధ్యం. ప్రభుత్వాలు తక్ష ణమే సర్కారీ విద్యాసంస్థలను పటిష్టపరిచేందుకు పూను కోవాలి. సరికొత్త పరిశ్రమలను, వివిధ రంగాలలోని కంపెనీలను ఏర్పరచి ఉపాధి అవకాశాలను కల్పించగల గాలి. అప్పుడే విద్యార్థులకు దేశం పట్ల, రాష్ర్టం పట్ల ప్రేమ కలుగుతుంది. సామాజిక బాధ్యతతో మెలగు తారు. యువతను కదిలించడానికి కావాల్సింది ఉపన్యా సాలు కాదు... ఆచరణ! (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు) - చుక్కా రామయ్య