gowtham sawang
-
ప్రభుత్వ ఒత్తిడితో సవాంగ్ రాజీనామా
-
ఏపీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
-
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
-
బుద్దా వెంకన్నపై కేసు నమోదు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వెంకన్న చేసిన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు. ఏసీపీ కె.హనుమంతరావు ఆధ్వర్యంలో సాయంత్రం వెంకన్న ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరారు. వెంకన్న అనుచరులు పోలీసులను లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వెంకన్నను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలేశారు. అంతకుముందు వెంకన్న మరో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని, డీజీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘అరే కొడాలి నానీ.. చంద్రబాబు ఇంటి గేట్ ముట్టుకో. నీ శవాన్ని పంపుతా. అరే నానీ కొట్టుకుందాం రా..’ అంటూ వీరంగం వేశారు. ‘అరేయ్ కొడాలి నాని నీ భాషేంటి? నీ చరిత్ర ఏంట్రా? గుడివాడలో ఆయిల్ దొంగవి. వర్ల రామయ్య నిన్ను లోపలవేసి చితక బాదిన విషయం అందరికీ తెలుసు’ అంటూ రెచ్చిపోయారు. ‘పోలీసుల్లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి. కొట్టుకుందాం రా’ అంటూ సవాళ్లు విసిరారు. గుడివాడకు వ్యభిచార కంపెనీ తీసుకొచ్చావని, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీశావని అన్నారు. నువ్వు తోపు అయితే కెమెరా పట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్లు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు గేట్ తాకితే నాని శవాన్ని పంపుతానంటూ హెచ్చరించారు. ‘నీ బావ, బావమరిది అనుకున్నవా? మమ్మల్ని వాడు, వీడు అంటున్నావు? డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఊగిపోయారు. నాని కులాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. ‘చంద్రబాబును నా కొడకా అంటున్నావు నీ బాబు పేరు ఏంట్రా? 2004లో నీకు టిక్కెట్ ఇచ్చింది చంద్రబాబు. హరికృష్ణ కాదు. 2024లో ఓడిపోయిన అర గంటలో ప్రజలు నిన్ను చంపుతారు. ఓడిపోగానే దుబాయి పారిపోతావు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా గౌతమ్ సవాంగ్ వ్యవహరిస్తున్నారు. గుడివాడ కేసినోలో రూ.250 కోట్లు చేతులు మారాయి. డీజీపీ నీ వాటా ఎంతో చెప్పు’ అంటూ చిందులేశారు. గుట్కా తిని క్యాన్సర్‌తో చచ్చిపోతావంటూ నానికి శాపనార్థ్ధాలు పెట్టారు. -
ఏపీలో బాగా తగ్గిన నేరాల సంఖ్య
-
దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు
సాక్షి, అనంతపురం: జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గూటి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతీ ప్రసాద్ ఓ అభాగ్యురాలిపట్ల మానవత్వం చూపించారు. అనంతపురం హైవే రోడ్డులో చలితో వణుకుతున్న మహిళకు తన వింటర్ జాకెట్‌ని అందించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు నగదు సాయం చేయడంతో పాటు అనాథ శరణాలయంలో చేర్చి మారుతీ ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కానిస్టేబుల్ దాతృత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మారుతీ ప్రసాద్‌ని ప్రశంసించారు. DGP Gautam Sawang appreciates the humanity gesture exhibited by Maruti Prasad,Police Constable of Gooty PS #Anantapur District when an old woman is suffering with winter on a high way road,he has given his jacket and extended a helping hand financially&joined her in an orphanage. pic.twitter.com/criqZKaYAH — Andhra Pradesh Police (@APPOLICE100) November 26, 2021 -
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
-
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
-
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: నిన్న టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. (చదవండి: నారా లోకేష్‌పై కేసు నమోదు) పట్టాభి వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి.. నిన్న పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. నిన్న సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్‌లో ఒక కాల్ వచ్చింది. కాల్ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు. నిరాధార ఆరోపణలు కరెక్టు కాదు నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్ కూడా విజయవాడకు రాలేదన్నారు. పోలీసుల త్యాగాన్ని మరువలేం.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఫ్లాగ్ డే నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని డీజీపీ అన్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
-
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు. చదవండి: మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి -
అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు. చంద్రబాబు హస్తం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు. అత్యంత దారుణం.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారన్నారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని జోగి రమేష్ అన్నారు. చదవండి: వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన -
ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ
-
ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’
-
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: 75వ స్వాత్రంత్య వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందని, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
ఆరుగురు మావోయిస్టుల కీలక నేతలు అరెస్ట్
-
ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ
సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంతరం కూంబింగ్ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు. మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్ సమస్య ఉండేది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. -
నంద్యాల రిపోర్టర్ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. -
ఏపీ డీజీపీ ట్విటర్ నకిలీ అకౌంట్ తొలగింపు
సాక్షి, అమరావతి: డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పోలిన నకిలీ అకౌంట్‌ను సృష్టించిన ఆగంతకుడు అందర్నీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇది ‘డీజీపీ అంధ్రప్రదేశ్’ అధికారిక అకౌంట్ అంటూ అపరిచితుడు చేసిన ట్వీట్‌తో అనుమానించిన డీజీపీ కార్యాలయం ఆరా తీస్తే అది నకిలీ అకౌంట్ అని బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఏపీ పోలీస్ టెక్ సర్వీసెస్ అధికారులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్ ః ఏపీస్టేట్డీజీపీ’ పేరుతో ఉన్న నకిలీ అకౌంట్‌ను బ్లాక్‌చేసి దాన్ని వినియోగించే అవకాశం లేకుండా తొలగించారు. చదవండి: సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా.. నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. -
ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్నకర్ఫ్యూ
-
అందరు రెండు మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి
-
హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్
గుంటూరు రూరల్: హైందవ ధర్మంపై, హిందూ దేవుళ్లపై వికృత కార్యక్రమాలు చేసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్ యూట్యూబ్ చానల్‌పై కఠిన చర్యలు తీసుకుని చానల్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫిర్యాదు చేసింది. సీఐడీ ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదు అందజేశారు. గుంటూరులోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ఏబీఎన్ తెలుగు అనే యూట్యూబ్ చానల్ లైవ్‌లో ఈనెల 21న శ్రీరామనవమి రోజున లైవ్ స్ట్రీమ్‌లో కరోనా వైరస్ రామాయణ, రాములమ్మ, కిరాక్ న్యూస్ అనే కార్యక్రమంలో కరోనా కాండ, రామాయణంలో కరోనా ఉండి ఉంటే అంటూ ఒక కార్యక్రమం చేశారని తెలిపారు. రాముడిని, సీతమ్మను, రావణాసురుడిని అవహేళన చేసి మాట్లాడటం జరిగిందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమాలు చేస్తున్న ఆ చానల్‌ను రద్దుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఇదే చానల్ గతంలోనూ ప్రజల్లో మత కలహాలు రేపేలా ముఖ్యమంత్రిపై, తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై, పలు హిందూ దేవాలయాలపై అసభ్యకర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. -
మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగుబాటు
సాక్షి, అమరావతి: గతంలో బలిమెలలో పోలీసులపై జరిగిన దాడి, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనల్లో పాత్రధారి, మావోయిస్టు కీలక నేత.. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ, మారన్న, కరుణ, శరత్ (40) మంగళవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. తెలం గాణలోని సిద్ధిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన జలంధర్‌రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ (ఏవోబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు హింసాయుత మార్గంలో ఏదీ సాధించ లేరని, జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయేవారికి చట్టపరంగా ఎటువం టి ఇబ్బందులు లేకుండా సహాయం అందించడంతోపాటు పునరావాసం కల్పిస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలు గిరిజనుల్లో కొత్త కాంతిని నింపుతు న్నాయని చెప్పారు. విప్లవం, నూతన ప్రజా స్వామ్యం అంటూ మావోయిస్టులు చేస్తున్న హింసా యుత కార్యకలాపాలపై గిరిజనులు, యువత తోపాటు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు పట్టు కోల్పో యారని, గత రెండేళ్లలో అనేక మంది లొంగి పోయారని వివరించారు. జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షలు నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని ఆయన పునరావాసానికి వినియోగిస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు.. అటవీ హక్కుల గుర్తింపు కింద 1.53 లక్షల మంది గిరిజనులకు 3.06 లక్షల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం పంచిపెట్టిందని డీజీపీ సవాంగ్ తెలిపారు. పలు సంక్షేమ పథకాల కింద గిరిజనులకు రూ.2,136 కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఐబీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఉద్యమానికి దూరం మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించలేకే ఉద్యమానికి దూరమైనట్టు జలంధర్‌రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాల పట్ల విభేదించానని తెలిపారు. పై స్థాయిలో పార్టీ చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు, తన ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగిపోయానన్నారు. ఆర్ఎస్యూ నుంచి సెంట్రల్ జోన్ సభ్యుడి స్థాయికి.. రిటైర్డ్ వీఆర్వో బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1998లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరిన జలంధర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిం చారు. 2000 ఫిబ్రవరిలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ పార్టీ సభ్యుడిగా గిరాయిపల్లి దళంలో చేరారు. 2000 సెప్టెంబర్ నుంచి 2002 ఆగçస్టు వరకు నల్లమల ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్, ఆంధ్ర ప్రాంత ప్లాటూన్ లలో పనిచేశారు. 2002 సెప్టెంబర్‌లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీలో ఈస్ట్ డివిజనల్ కమిటీ, మల్కన్‌గిరి– కోరాపుట్–విశాఖ బోర్డర్ కమిటీల్లో డివిజన్ కార్యదర్శి, కమాండర్‌గా పనిచేశారు. 2006 నవంబర్‌లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 నుంచి 2016 వరకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ స్క్వాడ్ కార్యదర్శిగా పనిచేశారు. 2019 అక్టోబర్ నుంచి ఏవోబీ ఎస్జెడ్సీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2008లో గ్రేహౌండ్స్ పోలీసులపై జరిగిన బలిమెల దాడి, 2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనలు జలంధర్‌రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. బలిమెల దాడిలో రెండో అస్సాల్ట్ టీమ్‌కు నాయకత్వం వహించారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ఐదు ప్రధాన దాడులు, 19 ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. 2004 ఫిబ్రవరి 6న కోరాఫుట్ జిల్లా ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌పై దాడిలోనూ ఉన్నారు. 2001 మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. -
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి: డీజీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు. -
చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న టీడీపీ అధికార ఫేస్బుక్ అక్కౌంట్లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్.. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా అందజేశారు. టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లో ‘ఒకప్పుడు జగన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నాడని, ఎందుకంటే వైఎస్సార్సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛలేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు.. లోక్‌సభలో లక్ష్మి గొంతు’ అంటూ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్టు ఫొటో సృష్టించి ఉంచారని తెలిపారు. ‘ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తువారు కావాలా? పెద్దిరెడ్డి కాళ్లకు మసాజు చేసేవారు కావాలా?’ అని పేర్కొంటూ పోస్టర్లో పనబాక లక్ష్మి ఫొటో పెట్టి టీడీపీకి ఓటు వేయండి అంటూ పోస్టులు పెట్టారని వివరించారు. ఈ పోస్టింగ్‌ల ద్వారా గురుమూర్తిని ప్రజల దృష్టిలో బహిరంగంగా అవమానించి, మానసికంగా బాధించారని, గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో వాటిని ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఫేస్బుక్ అక్కౌంట్లో పెట్టిన తప్పుడు పోస్టింగ్‌లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు బాధ్యులైన చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు.