Grand Welcom
-
ఇక ర్యాలీని మళ్లీ జైలు వైపు తిప్పండి
-
టీవీ నటికి ముద్దుల పాపాయి : కుటుంబం ఘన స్వాగతం, వైరల్ వీడియో
టెలివిజన్ నటి, మోహెనా కుమారి సింగ్, సుయేష్ రావత్ దంపతుల ఇంట ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే బుల్లి యవరాణికి మోహెనా కుటుంబం వేడుకగా స్వాగతం పలికిన తీరు విశేషంగా నిలిచింది. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో తల్లీ-కూతురు ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాపాయికి ఘన స్వాగతం పలికారుకుటుంబ సభ్యులు, సన్నిహితులు. మోహెనా కుమారి సింగ్ అభిమాని పేజీ ప్రకారం, మోహెనా భర్త, సుయేష్ కుమారుడు అయాన్ష్‌ని చేతుల్లో పట్టుకుని కనిపించాడు. పాపాయిని పరిచయం చేసినపుడు బంధువులు, స్నేహితులు ఆనందంతో స్టెప్పులు వేశారు. అటు అయాన్ష్ కూడా తన బుజ్జి చెల్లాయ్ని చూసి మురిసి పోయాడు. ఇల్లంతా పింక్ కలర్ (పాపాయికి పింక్ కలర్ సింబల్) బెలూన్స్, బటర్ ఫ్లైస్తో అంలంకరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. View this post on Instagram A post shared by princess of reva (@mohena.ksingh) కాగా ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ అనే సీరియల్లో 'కీర్తి గోయెంకా సింఘానియా'గా నటించి దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నటి మోహెనా. నయా అక్బర్ బీర్బల్, కుబూల్ హై, సిల్సిలా ప్యార్ కా , ప్యార్ తునే క్యా కియాతో లాంటి టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయింది. తొలిబిడ్డగా కుమారుడు అయాన్ష్ పుట్టినపుడు చేతుల్లోకి మొదటిసారి పట్టుకున్నప్పుడు ఎంత భావోద్వేగానికి లోనైందీ తెలిపింది. అలాగే తన రెండో ప్రెగ్నెన్సీని కూడా భారతీయ శాస్త్రీయ నృత్యం చేస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
విశ్వసుందరికి సాదర స్వాగతం
-
పీవీ సింధుకు విజయవాడలో గ్రాండ్ వెల్ కమ్
సాక్షి, విజయవాడ: పీవీ సింధుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. -
ఫ్రాన్స్ టీమ్‌కు స్వదేశంలో గ్రాండ్ వెల్కమ్
-
సూపర్ కింగ్స్‌కు ఘన స్వాగతం
చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
వెల్లువెత్తిన అభిమానం
– వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం – మీ వెంట నేనుంటానంటూ మహిళలకు జగనన్న భరోసా తిరుపతి మంగళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రత్యేక హోదా సాధనకోసం నెల్లూరులో నిర్వహిస్తున్న యువభేరిలో పాల్గొనేందుకు గురువారం ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ఆదిమూలం(సత్యవేడు, రాకేష్‌రెడ్డి(పలమనేరు), పార్టీ రాష్ట్ర నాయకులు పెంచలయ్య(తిరుమల), నెల్లూరు జిల్లా నాయకులు కళివేటి సంజీవయ్య, మేకపాటి గౌతంరెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి, దుశ్శాలువలు కప్పి ఆత్మీయంగా సత్కరించారు. జగన్మోహన్రెడ్డి విమానాశ్రయానికి చేరుకోగానే అప్పటికే అక్కడున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులు పట్టుకుని జై జగన్..జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. నాయకులను, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం ప్రతిఒక్కరు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం యువత ఉద్యమించాల్సిన అవసరం ఉందని యువతకు సూచించారు. అక్కడి నుంచి జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఆయనకు బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. జననేతకు స్వాగతం పలికినవారిలో మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు గాయత్రీదేవి, చెలికం కుసుమ, తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, వైఎస్సార్ టీయూసీ జిల్లా, నగర అధ్యక్షులు బీరేంద్రవర్మ, పుల్లూరు అమరనా«థ్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు టి.రాజేంద్ర, గఫూర్, రవిచంద్ర, మురళి, ఓబుల్‌రెడ్డి, సురేష్‌నాయక్, నాయకులు మాదవనాయుడు, రామూర్తి, మురళి, యువత ఉన్నారు. మీ వెంట నేనుంటా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం తిరుపతిలో నిర్వహించిన బంద్‌లో మహిళలపై పోలీసులు చేసిన పైశాచిక దాడులకు గురైన శాంతమ్మ, రమణమ్మ, లక్ష్మి, పుష్పాచౌదరి, మునీశ్వరి, పుష్పలత, శారద, గీతాయాదవ్, శ్యామల, సాయికుమారి, పుణీత, కెఆర్.సుశీల, దుర్గ, భారతిలను రేణిగుంట విమానాశ్రయంలో జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మీ వెంట నేనుంటానంటూ మహిళలకు భరోసా ఇచ్చారు. పోలీసుల చేతుల్లో పైశాచిక దాడులకు గురైన మహిళలు సిగ్గుపడాల్సిన అవసరం లేదని, మహిళల చీరలను చింపి, తాళిబొట్టులను తెంపించిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు జననేతకు తెలిపారు.