Gratuity income
-
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్: ఇలా చేస్తే మీ పెన్షన్, గ్రాట్యుటీ ఆగిపోతాయ్!
పండుగల సీజన్‌కు ముందు కేంద్ర ఉద్యోగులకు డీఏ( DA), బోనస్‌లను అందించి ఉద్యోగులకు శుభవార్త కేంద్రం తాజాగా గ్రాట్యుటీ, పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021 ప్రకారం, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు దుష్ప్రవర్తన లేదా నిర్లక్ష్యపు పనితీరు కలిగి ఉన్నట్లు తేలితే సదరు ఉద్యోగి పెన్షన్, గ్రాట్యుటీని ఇకపై రద్దు చేయనున్నారు. CCS (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 8పై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సవరించిన రూల్ 8 ప్రకారం, ఏదైనా డిపార్ట్మెంటల్లో ఉద్యోగ సమయంలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత అతని ఉద్యోగ సమయంలో ఏదైనా శాఖలో ఇలా చేసి ఉండకూడదు..సదరు ఉద్యోగి తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దోషిగా తేలితే, పైన పేర్కొన్న ఏజెన్సీలు పూర్తిగా లేదా పాక్షికంగా అతని పెన్షన్‌ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఒకవేళ తప్పు చేసిన ఉద్యోగికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వశాఖ భావిస్తే, ఆ ఉద్యోగి నుంచి పరిహారం తీసుకోవచ్చు. అయితే ఈ అంశంపై యూపీఎస్సీ బోర్డును సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకువాల్సి ఉంటుంది. చదవండి: ‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్! -
ఆ 9 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు?
1) నా వయసు 41 సంవత్సరాలు. గ్రాట్యుటీ కింద తాజాగా రూ.9 లక్షలు వచ్చాయి. ఇటీవలే ఉద్యోగం మారిపోయాను. దీంతో గ్రాట్యుటీగా వచ్చిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికితోడు నేను ప్రతీ నెలా రూ.25,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. – రవీష్ సంతోషకరమైన విషయం ఏమిటంటే మీకు గ్రాట్యుటీగా వచ్చిన మొత్తం కూడా పన్ను రహితమే. ఇది ఆదాయం కింద పరిగణనలోకి రాదు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షలకు పెంచింది. కనుక గ్రాట్యుటీ కింద రూ.20లక్షల వరకు వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మీరు నిర్ణయించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ డబ్బులతో అవసరం తిరిగి ఎప్పుడు ఉంటుందన్నది మీకే తెలుస్తుంది. చదవండి: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. వచ్చే ఐదు, ఏడేళ్ల వరకు ఈ నిధి అవసరం మీకు లేకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై మీకు అనుభవం ఉంటే కనుక ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి మొత్తాన్ని ఒకే విడత కాకుండా. వచ్చే 12–18 నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అయితే ఈక్విటీ లేదా ఈక్విటీ/డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడమే సముచితం. మీ అనుభవం ఆధారంగా పథకాన్ని ఎంపిక చేసుకోండి. ఒకవేళ వచ్చే రెండు మూడేళ్లకే ఈ డబ్బులతో మీకు అవసరం ఉంటే కనుక (ఏదైనా అవసరం కోసం) అప్పుడు ఈక్విటీ కాకుండా.. ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనమైన షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2) వృద్ధులకు సెక్యూర్డ్ డిబెంచర్లు సురక్షితమేనా? నమ్మకమైన రాబడుల కోసం ఏ క్రెడిట్ రేటింగ్ చూడాలి? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో వీటిని పోల్చి చూసేదెలా? – పరమేశ్వర్ సెక్యూర్డ్ డిబెంచర్లకు ఆస్తులు హామీగా ఉంటాయి. కానీ, చాలా డిబెంచర్లు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటుంటాయి. వీటికి మద్దతుగా ఎటువంటి ఆస్తులు ఉండవు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. రిటైర్ అయిన అందరూ ఏఏఏ రెటెడ్ లేదా కనీసం ఏఏ రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేయడం సులభమే. అంతా సాఫీగానే నడిస్తే అప్పుడు వడ్డీ ఆదాయం, మీ పెట్టుబడి సకాలంలో మీకు తిరిగి వస్తాయి. ఒకవేళ ఏదైనా అంచనాలు తప్పితే అప్పుడు వచ్చేదేమీ ఉండదు. కనుక వీటి విషయంలో రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. సెక్యూర్డ్ డిబెంచర్ల వంటి వాటిల్లో పెట్టుబడులు 2–5 శాతానికి మించవు. కనుక నష్టాలు వచ్చినా పరిమితంగానే ఉంటాయి. పెట్టుబడులను భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం కారణంగా రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. డిబెంచర్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే పూర్తి కాలం వరకు మీ పెట్టుబడులను లాక్ చేసుకుంటున్నట్టు అవుతుంది. మధ్యలో మీ పెట్టుబడులు కావాలంటే లిక్విడిటీ కష్టం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ లిక్విడిటీ సమస్య ఉండదు. కోరుకున్నప్పుడు మీ పెట్టుబడులను మొత్తం వెనక్కి తీసేసుకోవచ్చు. దీనికితోడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. మూడేళ్ల తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకోవచ్చు. డిబెంచర్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో దానిపై వచ్చే వడ్డీ ఆదాయం మొత్తం కూడా పన్ను పరిధిలోకే వస్తుంది. రెండింటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను పరిశీలించుకోవాలి. డిబెంచర్లోనే ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అధిక క్రెడిట్ రేటింగ్ వాటినే ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన రేటింగ్ ఉంటే రాబడి రేటు అంత ఎక్కువ ఉండదన్నది నిజం. 3) దీర్ఘకాల డెట్ పెట్టుబడుల కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి? – అంకిత్‌జైన్ రిస్క్ వద్దు అనుకుంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ మినహా వేటిని కూడా చూడొద్దు. కాకపోతే కొంచెం రిస్క్ ఉన్నా ఫర్వాలేదనకుంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. అలాంటప్పుడు ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు పెట్టుకోవడం అవుతుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 15–20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. ఈ పథకాల్లో దీర్ఘకాలానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఐదు–ఏడేళ్లకు మించిన కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటి నుంచి అందుకోవచ్చు. -
పన్ను లేని ‘ఆదా’యాలు..
జీవితంలో ఏం తప్పినా తప్పకపోయినా... చావు పుట్టుకలు, పన్నులు కట్టడం మాత్రం తప్పదన్నాడో మేధావి. ఆదాయం ఎంత పెరిగితే పన్నుల మోత కూడా అదే రేంజిలో పెరుగుతుందని అంతా భావిస్తుంటారు. కానీ, అసలు పన్నుల గొడవే లేని ఆదాయాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటి గురించి వివరించేదే ఈ కథనం. వ్యవసాయ ఆదాయం మనది ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. అందుకే సాగు రంగాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను నుంచి మినహాయింపునిస్తోంది ఆదాయ పన్ను చట్టం. పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయం.. మన పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.10,000 దాకా ఉంటే దానిపై ఎలాంటి పన్నూ ఉండదు. ఇతర బ్యాంకుల్లో ఉండే ఖాతాలన్నింటిపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా దీన్లో భాగమవుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకులోని పొదుపు ఖాతాపై రూ.10,000 మరో బ్యాంకులోని సేవింగ్స్ అకౌంటుపై ఇంకో రూ.10,000 వడ్డీ ఆదాయం వచ్చిందనుకోండి. అప్పుడు మీకు నికరంగా రూ.20,000 వడ్డీ ఆదాయం వచ్చినట్లవుతుంది. ఇందులో రూ.10,000 పరిమితి పోను మిగతాది పన్ను పరిధిలోకి వస్తుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్.. షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను దీర్ఘకాలం పాటు అట్టే పెట్టుకున్న తర్వాత విక్రయిస్తే వాటిపై వచ్చే లాభాలపై పన్నులుండవు. ఇక్కడ దీర్ఘకాలమంటే కనీసం ఏడాది. ఏడాది పాటైనా సదరు షేర్లను, ఈక్విటీ ఫండ్ యూనిట్‌ను విక్రయించకుండా ఉండాలి. అయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఇది వర్తించదు. విదేశీ సర్వీసులకు మినహాయింపు భారతీయులు విదేశాల్లో సర్వీసులు అందిస్తూ వాటికి సంబంధించి అలవెన్సులు మొదలైనవి ఆ దేశంలోనే అందుకుంటున్న పక్షంలో ఆదాయ పన్ను చట్టంలోని 10(7) సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనివల్లే ప్రభుత్వ ఉద్యోగులు విదేశాల్లో సేవలు అందిస్తున్నప్పుడు అక్కడ అందుకునే అలవెన్సులపై పన్నుల బెడద ఉండదు. హిందూ అవిభక్త కుటుంబాల ఆదాయం.. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)లో సభ్యులుగా అందుకునే ఆదాయం లేదా వారసత్వంగా వచ్చే డబ్బుపై ఆదాయ పన్ను పడదు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10 (2) కింద ఈ మినహాయింపు లభిస్తుంది. భాగస్వామ్య సంస్థలో షేర్లు .. మీరేదైనా పార్ట్నర్షిప్ సంస్థలో భాగస్వామిగా ఉన్న పక్షంలో కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో మీకొచ్చే వాటాపై ఆదాయ పన్ను ఉండదు. అయితే, లాభాల్లో వాటాలు కాకుండా.. ఇతరత్రా రెమ్యూనరేషన్, వడ్డీ మొదలైనవి మాత్రం పన్ను పరిధిలోకి వచ్చేస్తాయి. గ్రాట్యుటీ ఆదాయం సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉద్యోగుల సేవలను గుర్తించి, కంపెనీలు ప్రత్యేకంగా ఇచ్చేది గ్రాట్యుటీ. ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే గ్రాట్యుటీకి ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. అలా కాకుండా గ్రాట్యుటీ చట్టం 1972 పరిధిలోకి వచ్చే ఇతరత్రా ఉద్యోగుల విషయంలో ఈ కింది మూడింటిలో ఏది తక్కువైతే దానికి మినహాయింపు లభిస్తుంది. ఎ) ప్రతి ఏడాది ఆఖరున అందుకున్న జీతం ఆధారంగా 15 రోజుల వేతనం. బి) రూ. 10,00,000. సి) అందుకున్న మొత్తం గ్రాట్యుటీ. ఒకవేళ రిటైర్మెంట్ సందర్భంగా అందుకున్నది, రిటైర్మెంట్ కన్నా ముందే పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు అందుకునే గ్రాట్యుటీ, ఉద్యోగి మరణించిన పక్షంలో వారిపై ఆధారపడిన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులకు ఇచ్చే గ్రాట్యుటీపైన పన్ను ఉండదు. స్కాలర్షిప్లు, అవార్డులు.. విద్య ఖర్చుల కోసం అర్హులైన విద్యార్థులు అందుకునే స్కాలర్షిప్ లేదా అవార్డుల్లాంటివి పన్ను పరిధిలోకి రావు. దీనికి గరిష్ట పరిమితంటూ ఏమీ లేదు. స్కాలర్షిప్ కింద ఎంత వచ్చినా పన్ను మినహాయింపు లభిస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణ మొత్తం.. ఆదాయ పన్ను(ఐటీ చట్టం నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) స్కీమును ఎంచుకోవడం ద్వారా ఉద్యోగి అందుకునే అమౌంటుపై పన్నులు ఉండవు. గరిష్టంగా రూ. 5 లక్షల దాకా మొత్తానికి ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది.