పండుగల సీజన్‌కు ముందు కేంద్ర ఉద్యోగులకు డీఏ( DA), బోనస్‌లను అందించి ఉద్యోగులకు శుభవార్త కేంద్రం తాజాగా గ్రాట్యుటీ, పెన్షన్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021 ప్రకారం, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు దుష్ప్రవర్తన లేదా నిర్లక్ష్యపు పనితీరు కలిగి ఉన్నట్లు తేలితే సదరు ఉద్యోగి పెన్షన్, గ్రాట్యుటీని ఇకపై రద్దు చేయనున్నారు. CCS (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 8పై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
సవరించిన రూల్ 8 ప్రకారం, ఏదైనా డిపార్ట్‌మెంటల్‌లో ఉద్యోగ సమయంలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత అతని ఉద్యోగ సమయంలో ఏదైనా శాఖలో ఇలా చేసి ఉండకూడదు..సదరు ఉద్యోగి తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దోషిగా తేలితే, పైన పేర్కొన్న ఏజెన్సీలు పూర్తిగా లేదా పాక్షికంగా అతని పెన్షన్‌ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఒకవేళ తప్పు చేసిన ఉద్యోగికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వశాఖ భావిస్తే, ఆ ఉద్యోగి నుంచి పరిహారం తీసుకోవచ్చు. అయితే ఈ అంశంపై యూపీఎస్సీ బోర్డును సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకువాల్సి ఉంటుంది.
చదవండి: ‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్!
Comments
Please login to add a commentAdd a comment